Wednesday, August 3, 2016

ఎ.పి.కి పార్లమెంటు హామీలు అమలు కాకుండా, జియస్టి బిల్లుకి ఎవరు, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా వారు ఆంధ్రాద్రోహులు:చలసాని

ఎ.పి.కి పార్లమెంటు హామీలు అమలు కాకుండా, జియస్టి బిల్లుకి ఎవరు, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా వారు ఆంధ్రాద్రోహులు. నాయకులారా ఉట్టి మాటలు కట్టిపెట్టండోయ్... ఈ సమయంలో బిల్లు ఆపి ఎపికి గట్టి మేలు తలపెట్టండోయ్. 

ఆ బిల్లు యధాతధంగా సవరణలు లేకుండా అమలులోకి వస్తే, ప్రత్యేకతరగతిహోదా+ రాయతీలకు, అలాగే రాష్ట్రాల అధికారాలకు, ఆదాయానికి కూడా భారీ గండి పడుతుంది. 
-
ఈ విషయం అందరికీ తెలపండి .
-
నాయకులారా, గాల్లో కత్తి ఊపటం కాదు... చిత్తశుద్ది, నిజాయితీ, మన ప్రాంతం మీద అభిమానం ఉంటే, అసలు రాజ్యసభలో సాధారణ మెజార్టీనే లేని కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతులు మెజార్టీ కావలసిన ఈ సమయంలో తిరుగుబాటు చేయండి. మొన్న ఆంద్ర హక్కులకోసం నిలబడి ఉంటామని నమ్మబలికి నేడు పారిపోతారా? అదే జరిగితే చరిత్ర will not forgive you. అందరూ విభజన హామీలు సాధించి చిత్తశుద్దిని నిరూపించుకోవాలి – చలసాని

NTR అనే పేరు వినగానే తెలుగువారికి ప్రపంచంలో మరింత గుర్తింపు తీసుకువచ్చిన అక్షరాలు: చలసాని

NTR అనే పేరు వినగానే తెలుగువారికి ప్రపంచంలో మరింత గుర్తింపు తీసుకువచ్చిన అక్షరాలుగానే కాక, అణగారిన వర్గాలకోసం తపనపడినవాడిగా, తెలుగువారి ఆత్మ్గగౌరవానికి చిహ్నంగా అత్యధికులు భావిస్తారు. నేడు ఎపి ముఖ్యమంత్రిగా ఆయనుంటే, కేంద్ర అహంకార ప్రవర్తనను సహించేవారా? ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం కాపాడటంలో చిత్తశుద్దిలేని మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రవర్తన చూసి ఊరుకునేవారా....లోకసభలో తమిళవేడి కంటే మిన్నగా తెలుగు‘వాడి’ ఉండేదిగాదా ?
నేడు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సభ్యుల ధనబలం చూసి పై సభలకు ఎర్ర తివాచీ వేస్తున్నారు. ఆసలు ఆయనగానీ, లేదా వైయస్ గారు గాని ఉంటే రాష్ట్రం ఈ విధంగా చీలేదా? పార్లమెంటులో హక్కుల సాధన విషయంలో వారి పార్టీ సభ్యుల నిర్లిప్తత కూడా చూసి.. -చలసాని

Tuesday, July 12, 2016

పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం : ఎన్టీఆర్



పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని అనేవారు ఎన్టీఆర్. పేదలకు ఆహారభద్రత కల్పించలేని నాడు మనం ఏం పాలించినట్టు? ఏం సాధించినట్టు?.. అంటూ అధికారులతో ఆవేశంగా అనేవారాయన. అలా అన్నట్టే ఆయన పథకాలన్నీ పేదల చుట్టూనే తిరిగాయి. ఆయన ఆదర్శాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళంతా, వాటిని కేవలం జనాకర్షణ పథకాలుగా పేర్కొనేవారు. ఎవరెన్ని, ఏ విధంగా అనుకున్నా లెక్కచేసేవారుకాదు ఎన్టీఆర్. ఆయనకు తెలుసు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారో. ప్రజలకు తెలుసు ఆయన ఎంత నిజాయితీతో చేస్తున్నారో. ఈ పరస్పర నమ్మకమే ఎన్టీఆర్ ను ప్రజానాయకుడిగా చిరస్మరణీయుడిని చేసింది.
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020