
నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా వెయిట్ తగ్గాడని తెలిపాడు. ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు చాలా కష్టపడతామని.. చాలా ప్లాన్స్ ఉంటాయని పేర్కొన్నాడు. ఈ ఈవెంట్‌కు వస్తే ఎన్టీఆర్ లుక్ అవుట్ అవుతుంది. ఆ లుక్ ప్రేక్షకులకు చాలా పెద్ద సర్‌ప్రైజ్ అని తెలిపాడు.
ఎన్టీఆర్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకుడదు అనుకున్నానని.. తారక్ పడిన కష్టాన్ని తాను తీసేసుకోకూడదని భావించినట్టు కల్యాణ్ రామ్ తెలిపాడు. ఎన్టీఆర్ లుక్ చూసి తాను చాలా హ్యాపీ ఫీలయినట్టు కల్యాణ్ రామ్ వెల్లడించాడు. ఈవెంట్‌కు ముందు తామిద్దరం మాట్లాడుకున్నామని అప్పుడు అన్న సినిమా ఈవెంట్‌కి తను రావాలి కానీ లుక్ అవుట్ అవుతుందని ఎన్టీఆర్ చాలా ఇబ్బందిపడినట్టు తెలిపాడు. అప్పుడు తనే కల్పించుకుని ఫీలవద్దని చెప్పినట్టు తెలిపాడు. తామిద్దరం ప్రొఫెషన్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని వెల్లడించాడు. రోజూ బయట కనిపిస్తే ఫస్ట లుక్ ఇవ్వడమే వేస్ట్ అని... ఆ కారణంగానే ఎన్టీఆర్‌ను ఈవెంట్‌కు రావొద్దని చెప్పినట్టు కల్యాణ్ రామ్ తెలిపాడు.
No comments:
Post a Comment