
అమరావతి: బీజేపీ అంటే భారతీయ జోకర్ల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్ పేర్కొన్నారు. శనివారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలిలో పట్టిసీమపై చర్చ జరిగిన సమయంలో సోము వీర్రాజు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని రవిచంద్ర అన్నారు. బీజేపీ- టీడీపీకి గ్యాప్ రావడానికి సోము వీర్రాజే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం మీద నిత్యం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ సోము వీర్రాజు నిధులు రాకుండా చేసాడన్నారు. వైసీపీతో వీర్రాజు చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని, పట్టిసీమలో అవినీతి జరిగింది అంటే రైతులే బీజేపీని ఉరి తీస్తారని రవిచంద్ర పేర్కొన్నారు. నిరవ్‌మోడీ, లలిత్‌మోడీ, విజయ్ మాల్యా కుంభకోణాలపై విచారణకు కేంద్రం సిద్దమా అంటూ ప్రశ్నించారు.
No comments:
Post a Comment