Showing posts with label guntur tdp. Show all posts
Showing posts with label guntur tdp. Show all posts

Tuesday, April 15, 2014

ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు : ఫ్రత్తిపాటి


ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు. వాటన్నింటికి అతీతంగా వ్యవహరించండి. మీ ఊళ్లో వాళ్లను కూడా చైతన్యపరచండి. అప్పుడే  మీ భవిష్యత్తు బావుంటుంది. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొంటే నష్టం కలుగుతుందని ఓటర్లకు అవగాహన కలిగించాలని ఫ్రత్తిపాటి అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు. రాధాకాష్ణ మాట్లాడుతూ అభ్యర్థుల కులం, మతం, ప్రాంతం చూడొద్దన్నారు. అభ్యర్థుల గుణం చూసి ఓటేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు నేడు తాడు, బొంగరం లేకుండా చేశారు. ఈ క్లిష్ట సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. రాజకీయ వ్యవస్థ అంతా కుళ్లిపోయిందన్న భావన నుంచి విద్యార్థులు బయటికి రావాలని, అంతా ప్రభుత్వమే చేయాలన్న ధోరణి సరికాదన్నారు. ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగానికి నేను అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడం వలనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ఆకర్షితులు కావడం వలన నేడు ఇంజనీరింగ్ విద్యలో క్వాలిటీ తగ్గిపోయి పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ చురుకుగా ఉండటం వలనే 2జీ లాంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఉన్నంతలో మంచి వాళ్లను ఎన్నుకోవాలన్నారు. నోటా ఓటుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Monday, April 14, 2014

నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగింద?



నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగిందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణకు అనంతపురం జిల్లా హిందూపురం టిక్కెట్టు ఖరారైంది. అయితే హరికృష్ణ తనకు కూడా టిక్కెట్టు కావాలని చంద్రబాబుని కోరారు. అయితే ఈ విషయంపై ఆదివారం హరికృష్ణ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హరికృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ పాల్గొన్నారు. సమావేశంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఇద్దరూ చంద్రబాబు, బాలయ్యతో ఫోన్లో చర్చలు జరిపారు. హరికృష్ణకు పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే హరికృష్ణను గెలిపించుకునే బాధ్యతతో పాటు ఎన్టీఆర్‌ హిందూపూర్‌లో బాలకృష్ణతో కలిసి ప్రచారం చేయాల్సి ఉంటుంది.
               
అలాగే ఎన్టీఆర్‌ నారా లోకేష్‌తో కలిసి కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి. ఈ షరతులకు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ అంగీకరించారు. దీంతో హరికృష్ణకు పెనమలూరు సీటు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు నందమూరి-నారా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్‌  పూడినట్టు అయ్యింది.

పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు... జై ఫ్రత్తిపాటి

తెలుగు దేశం పార్టీని గెలిపించే ప్రయత్నంలో
మీరు కూడా బాగస్వాములు కండి...

పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు

జై ఫ్రత్తిపాటి



జన్మభూమి రుణం తీర్చుకుంటా: కోడెల


సత్తెనపల్లి: సత్తెనపల్లి నా జన్మస్థలం. నేను కోరుకున్న నరసరావుపేటను కాదనుకుని నన్ను కోరుకున్న సత్తెనపల్లికి రావడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం రాత్రి కాకతీయ కల్యాణ మండపంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు యెలినీడి రామస్వామి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ తల్లి ఒడి నుంచి ఈ తల్లి ఒడికి చేరానన్నారు. కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రజలకు వివరించాలన్నారు. నా మీద అభిమానం చూపిస్తున్న సత్తెనపల్లి ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కోడెల నాయకత్వం వర్ధిల్లాలంటా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొందరు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించిన వారు సమావేశానికి వచ్చారని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తెలుగుదేశం పార్టీకి జనసేన సంఘీభావం

తెలుగుదేశం పార్టీకి జిల్లాలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేస్తోన్నారు. టీడీపీ నాయకులు నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచారాల్లో జనసేన కార్యకర్తలు పార్టీ జెండాలతో వచ్చి మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జిల్లా పర్యటనలో తొలిసారిగా జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి ముందుకు నడిచాయి. దీంతో తెలుగుతమ్ముళ్లు ఎన్నికల ప్రచారంతో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో' నినాదంతో రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనదని, ఏ ఒక్క రాజకీయ పార్టీ గెలువు అవకాశాలు దెబ్బతీయ దలుచుకోలేదని స్పష్టం చేశారు. అలానే బీజేపీకి, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీకి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య జిల్లాలో చెలిమికి బీజం పడింది. టీడీపీకి సంఘీభావంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో బైకు ర్యాలీలు, పాదయాత్రలతో హల్‌చల్ చేస్తూ టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
యువతలో పవన్ కల్యాణ్‌కు మంచి క్రేజ్ ఉన్నది. గతంలో పవన్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో యువత విశేషంగా స్పందించింది. ఆయన యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసింది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు మండలాల్లోనూ పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆయా సంఘాల్లోని పవన్ అభిమానులంతా క్రమంగా తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. పవన్ అభిమానుల మద్దతు వలన తమకు ఓటింగ్ శాతం మరింత పెరిగిందని టీడీపీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే బీజేపీకి మద్దతుగా ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన త్వరలో జిల్లాకు కూడా వస్తారని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. టీడీపీ ప్రజాగర్జన జిల్లాలో ఇప్పటివరకు జరగలేదు. ఇతర జిల్లాలను తలదన్నే రీతిలో లక్షల మంది ప్రజలతో సభను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల టిక్కెట్ల ఖరారు పూర్తి అయి నామినేషన్ల ప్రక్రియ ముగియగానే గర్జన తేదీని నిర్ణయించాలని నాయకులు భావిస్తున్నారు. ఆ సభకు పవన్ కల్యాణ్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు.
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020