Saturday, September 10, 2016

"ఏదేశమేగినా, ఎందుకాలిడినా అని గురజాడ అప్పారావు గారు చెప్పారని అన్నారు సార్‌! అది తప్పు సార్‌! ఆ గేయం రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు సార్‌!’’

మధురపూడి విమానాశ్రయం : విమానం డోర్‌ తెరుచుకోగానే పవన్ కళ్యాణ్‌, వెనకాలే అతడి కుడి, ఎడమ భుజాలైన బాలు, శీను, మరికొంతమంది అసిస్టెంట్లు దిగుతారు. 
శీను లాప్‌టాప్‌ ఓపెన్ చెయ్యగానే బాలు మీటనొక్కి, స్ర్కీన్ మీద ప్రత్యక్షమయ్యే వారి గురించి చెప్పడం మొదలుపెడతాడు.
 
‘‘సార్‌.. ఈయన వెంకయ్యనాయుడు.. కేబినెట్‌లో తెలుగు మంత్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఈయనగారి పాస్‌వర్డ్‌... అధిక్షారపక్షం కాగానే అది ఫెయిల్‌ వర్డ్‌గా మారిపోయింది.. ఈయన అశోక్‌ గజపతి రాజు.. పేరులో రాజున్నా మోదీ కేబినెట్‌లో మంత్రి మాత్రమే. తెలుగునేల మీదే పుట్టి, తెలుగుదేశం పార్టీలోనే పెరిగినా, తెలుగు మాత్రం మంచులక్ష్మి టైపులో మాట్లాడతారు. ప్రత్యేక హోదా అనే మాట నోరు తిరక్క కాబోలు, దాని జోలికి ఎప్పుడూ పోరు.. ఇంకో తెలుగు మంత్రి సుజనా చౌదరి.. కిట్టని వాళ్లు స్వజనా చౌదరి అంటారు.. ఇక, వీళ్లంతా మన ఎంపీలు..’’ 
పవన్ కళ్యాణ్‌ విసుగ్గా మొహం పెట్టడంతో బాలు వాగ్ధాటికి బ్రేక్‌ పడింది.
 
‘‘కొత్త పాయింట్లు చెప్పరా.. ఈ చెత్త గురించి అవసరం లేదు’’ చిరాగ్గా అన్నాడు పవన కళ్యాణ్‌.
‘‘సార్‌... ఈ డీటెయిల్స్‌ అన్నీ తెలుసుకోకుండా మీరు రేపు స్పీచేం ఇస్తారు? హోదా ఎలా సాధిస్తారు?’’ అడిగాడు బాలు.
పవన్ కళ్యాణ్‌ బాలు వైపు జాలిగా చూసి చెప్పాడు. ‘‘ఒరే, రాముడు సముద్రం దగ్గరికి వెళ్లాక బ్రిడ్జి ఎలా కట్టాలో ప్లాన చేశాడు కానీ అడవిలో ఉండగా బ్రిడ్జి ప్లాన గీసుకుని సముద్రం దగ్గరికి వెళ్లలేదురా!’’
‘‘అయితే ఇప్పుడేం చేద్దాం సార్‌?’’ పిల్లిగడ్డం గోక్కుంటూ అన్నాడు బాలు. 
‘‘ఒరే బాలుగా! ప్రత్యేక హోదా సాధించడం ఎలా? అనే పుస్తకం నేనేమన్నా రాశానా? ఏమనిపిస్తే అది చేసుకు వెళ్లిపోవడమే!’’ అంటూ ముందుకు కదిలాడు పవన్ కళ్యాణ్‌. 

కాకినాడ హోటల్‌ రూమ్‌ : బహిరంగ సభలో తాను ఇవ్వబోయే ప్రసంగం తాలూకు పాయింట్లు శ్రద్ధగా రాసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్‌. 
సరిగ్గా అప్పుడు శీను పెద్ద తప్పు చేశాడు. కడుపులో ఉన్నమాట బయటికి కక్కేశాడు. 
‘‘ఒక పక్క సినిమాల్లో హీరో వేషం వేస్తూ, మరో పక్క రాజకీయాల్లో గెస్ట్‌ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తుంటే, ప్రత్యేకహోదా ఎలా వస్తుంది సార్‌? రాదూ..’’
పవన్ కళ్యాణ్‌ కోపం నషాళానికి అంటింది. అసిస్టెంట్లకి సైగ చేశాడు. తక్షణం వాళ్లు శీనుగాణ్ణి శీర్షాసనం టైపులో తలకిందులు చేసి పట్టుకున్నారు. శీను లబలబలాడాడు. 
‘‘ఒరే శీనుగా! నీ దగ్గర అయిడియా లేవైనా ఉన్నాయట్రా?’’ సీరియ్‌సగా అడిగాడు పవన్   కళ్యాణ్‌.
 
భయంతో తల అడ్డంగా ఊపాడు శీను. 
‘‘మరి ఆల్టర్నేటివ్స్‌ లేనప్పుడు పక్కవాళ్లని క్రిటిసైజ్‌ చెయ్యకూడదొరేయ్‌.. కాలిపోద్ది.. ఒరే శీనుగా.. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ చీదేశాక మన ఫైనాన్షియల్‌ పొజిషన వీకైంది కదా’’ 
‘‘బాగా వీకయిపోయింది సార్‌!’’ వంతపాడాడు బాలు.
 
‘‘బ్యాంక్‌ బ్యాలెన్స లేకపోయినా మీ బ్యాండ్‌ మేళం డ్రెస్సులకి ఇస్ర్తీ డబ్బులిస్తూ, మిమ్మల్ని ముప్పొద్దులా సుష్ఠుగా మేపాలి కదా!’’ 
‘‘మేపి తీరాలి సార్‌!’’
 
‘‘మరప్పుడు నేను సినిమాల్లో వేషాలేసి సంపాదించకుండా ఇంకేం చేయాల్రా? చెప్పండి!’’
 
‘‘లోకంలో ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరు. మీరు యాక్టర్‌గానే ఉండాలి.’’ 
పవనకళ్యాణ్‌ గర్వంగా నవ్వి అన్నాడు. ‘‘రేపు పబ్లిక్‌ మీటింగ్‌లో జనం చేతే ఆ మాట చెప్పిస్తా, చూడండి..’’
 
‘‘బాస్‌.. ఇక నన్ను దింపమనండి బాస్‌’’ శ్రీను మొత్తుకున్నాడు. 
‘‘జీతాలిచ్చేవాడి మీద జోకులేస్తే ఇలాగే జీవితం తలకిందలైపోతుంది ఎదవ.. ఇక దింపండి ఎదవని’’
 
అసిస్టెంట్లు శీనుని దింపేశారు. శీను వణుకుతూ కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్‌ శీను భుజం తట్టి చెప్పాడు.
 
‘‘అరే శీనుగా.. నేను అగ్గిపుల్ల లాంటోణ్ణిరా! కొవ్వొత్తి వెలిగించడానికీ పనికొస్తా.. కొంపలార్పడానికీ పనికొస్తా!’’
 
‘‘ఎందుకో ఈ సిట్యుయేషనకి ఈ డైలాగ్‌ సూట్‌ కావడం లేదు సార్‌!’’ పిల్లి గడ్డం నిమురుకుంటూ అన్నాడు బాలు.
‘‘నీ ఎదవ మొకానికి ఆ పిల్లిగడ్డం సూటైందా? మరి మేం చూడటంలా? ఎదవ సోది ఆపి మన స్పీచకి కొత్త పాయింట్లు తడితే చెప్పండి’’ అంటూ నోట్సు ప్రిపరేషన్‌లో మునిగిపోయాడు పవన్ కళ్యాణ్‌. 
 
పబ్లిక్‌ మీటింగ్‌ : పవన్ కళ్యాణ్‌ షరా మామూలుగా వీరావేశంతో ఉపన్యసిస్తున్నాడు. మధ్యలో సినిమాల టాపిక్‌ తెచ్చాడు.
 
‘‘నన్ను సినిమాలు వదిలేయమంటే ఈ క్షణంలోనే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సినిమాలు వదిలేస్తే నా దగ్గర తిండానికి కూడా డబ్బులుండవు. మీరే నన్ను పోషించాలి. మీ ఇళ్లకొచ్చి ‘‘అరే బాబూ, అన్నం పెట్టు, అమ్మా, అక్కా, అన్నం పెట్టు, ఆకలేస్తోంది’’ అంటా’’
 
జనం బెదిరిపోయి ‘‘వద్దు, వద్దు, సినిమాల్లోనే ఉండు’’ అంటూ కేకలు వేశారు. 
టీవీలో తన ప్రసంగాన్ని శ్రద్ధగా చూస్తున్న చంద్రబాబుకి ఒళ్లు పులకించేలా ఇంకోమాట చెప్పాడు పవన్ కళ్యాణ్‌.
 
‘‘నేను బంద్‌లకి పిలుపివ్వను.. నిరసనలంటూ మిమ్మల్ని రోడ్డెక్కమని చెప్పను. ప్రభుత్వ ఆస్తులకి నష్టం కలిగించే పనులు చెయ్యమని చెప్పను.. పార్లమెంటు కేంటీనలో సబ్సిడీ ఫుడ్డు తింటున్న మన ప్రజాప్రతినిధులున్నారుగా.. వాళ్ల చేతే పోరాటం చెయ్యిద్దాం.. మధ్యలో మీరెందుకు కష్టపడాలి? మనకెందుకీ రొష్ఠు?’’ 
జనం కేరింతలు కొట్టారు.
 
‘‘చివరిగా గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికో మాట చెప్పి, నా ఉపన్యాసం ముగిస్తాను. వెంకయ్య నాయుడూ జీ! కుదిరితే హోదా ఇప్పించండి.. లేదంటే మేం వేసే శిక్షని భరించండి.. కానీ, మీరిచ్చిన పాచిపోయిన లడ్డూల ప్యాకేజీతో సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందని మాత్రం గుర్తించండి.. భారత మాతాకీ జై... జైహింద్‌’’ అంటూ ఉపన్యాసం ముగించాడు పవన్ కళ్యాణ్‌. 
 
కొసమెరుపు : పవన్ కళ్యాణ్‌ వేదిక దిగి వస్తుంటే అసిస్టెంటు శీను అతడి చెవిలో గొణిగాడు. 
‘‘సార్‌... మీ స్పీచ్ స్టార్టింగ్‌లో ఏదేశమేగినా, ఎందుకాలిడినా అని గురజాడ అప్పారావు గారు చెప్పారని అన్నారు సార్‌! అది తప్పు సార్‌! ఆ గేయం రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు సార్‌!’’ 
పవన్ కళ్యాణ్‌ మళ్లీ తనకి పనిష్మెంట్‌ వేసే ఛాన్సివ్వకుండా హడావిడిగా పరిగెత్తాడు శీను. 
                                                                     ఇదంతా కేవలం సరదాకి మాత్రమే                    మంగు రాజగోపాల్‌

http://www.andhrajyothy.com/artical?SID=307602

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020