
'జనతా గ్యారేజ్'పై ఏ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు, ఎన్టీఆర్‌లాంటి మాస్ హీరోతో కలిసినప్పుడు ఆ కలయికలో వచ్చే సినిమా సంచలనానికి తగ్గే సమస్యే లేదని ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్‌కి తోడు మోహన్‌లాల్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు ఉండడం, ట్రెయిలర్ చాలా ప్రామిసింగ్‌గా అనిపించడంతో 'జనతా గ్యారేజ్' తప్పక చూడాల్సిందేనని సినీ ప్రియులు నిర్ణయించేసుకున్నారు. పాత కథలతోనే కనికట్టు చేసి మొదటి రెండు చిత్రాలనీ అంతటి హిట్లు చేసిన కొరటాల శివ పనితనంపై ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు. కమర్షియల్ అంశాలని జోడించి అన్ని వర్గాలనీ ఆకట్టుకోవడంలో సిద్ధహస్తుడని అనిపించుకున్న కొరటాల శివ ఈసారి కూడా తనదైన శైలి లొ బిగ్ హ్యాట్రిక్ సక్సస్ సాదించారు. ఈ విజయం తారక్ కి కూడా హ్యాట్రిక్ కనుక తన తరువాత మూవీ కి రెట్టించిన ఉత్సాహం తొ సిద్దమౌతున్నాడని సినీ వర్గాల సమాచారం.
No comments:
Post a Comment