
పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని అనేవారు ఎన్టీఆర్. పేదలకు ఆహారభద్రత కల్పించలేని నాడు మనం ఏం పాలించినట్టు? ఏం సాధించినట్టు?.. అంటూ అధికారులతో ఆవేశంగా అనేవారాయన. అలా అన్నట్టే ఆయన పథకాలన్నీ పేదల చుట్టూనే తిరిగాయి. ఆయన ఆదర్శాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళంతా, వాటిని కేవలం జనాకర్షణ పథకాలుగా పేర్కొనేవారు. ఎవరెన్ని, ఏ విధంగా అనుకున్నా లెక్కచేసేవారుకాదు ఎన్టీఆర్. ఆయనకు తెలుసు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారో. ప్రజలకు తెలుసు ఆయన ఎంత నిజాయితీతో చేస్తున్నారో. ఈ పరస్పర నమ్మకమే ఎన్టీఆర్ ను ప్రజానాయకుడిగా చిరస్మరణీయుడిని చేసింది.
No comments:
Post a Comment