NTR అనే పేరు వినగానే తెలుగువారికి ప్రపంచంలో మరింత గుర్తింపు తీసుకువచ్చిన అక్షరాలుగానే కాక, అణగారిన వర్గాలకోసం తపనపడినవాడిగా, తెలుగువారి ఆత్మ్గగౌరవానికి చిహ్నంగా అత్యధికులు భావిస్తారు. నేడు ఎపి ముఖ్యమంత్రిగా ఆయనుంటే, కేంద్ర అహంకార ప్రవర్తనను సహించేవారా? ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం కాపాడటంలో చిత్తశుద్దిలేని మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రవర్తన చూసి ఊరుకునేవారా....లోకసభలో తమిళవేడి కంటే మిన్నగా తెలుగు‘వాడి’ ఉండేదిగాదా ?
నేడు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సభ్యుల ధనబలం చూసి పై సభలకు ఎర్ర తివాచీ వేస్తున్నారు. ఆసలు ఆయనగానీ, లేదా వైయస్ గారు గాని ఉంటే రాష్ట్రం ఈ విధంగా చీలేదా? పార్లమెంటులో హక్కుల సాధన విషయంలో వారి పార్టీ సభ్యుల నిర్లిప్తత కూడా చూసి.. -చలసాని

No comments:
Post a Comment