Friday, April 11, 2014
రూ.50 కోట్ల క్లబ్‌కు చేరుకున్న సినిమా?
నందమూరి కుటుంబానికి ఓ అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటి వరకు ఆ కుటుంబ హీరోల నుంచి వచ్చిన సినిమాల్లో రూ.50 కోట్ల క్లబ్‌కు చేరుకున్న సినిమాలేమి లేవు. అయితే తాజాగా యువరత్న బాలకృష్ణ విశ్వరూపం ప్రదర్శించిన 'లెజెండ్' సినిమా తొలిసారిగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరనుంది. బాలకృష్ణ నటించిన సింహ దాదాపు రూ.40 కోట్ల దరిదాపులకు చేరుకుంది. ఎన్టీఆర్ నటించిన బాద్‌షా కూడా అక్కడే ఆగిపోయింది.
నందమూరి కుటుంబానికి ఎప్పటి నుంచో ఉన్న రూ.50 కోట్ల క్లబ్ కల లెజెండ్‌తో తీరనుంది. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించడంతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ వెరసి సినిమాను విజయం సాధించడానికి తోడ్పడ్డాయి. అంతే కాక సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండడం, బాలయ్య కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారన్న వార్తలు, సినిమాలో కూడా రాజకీయపరంగా టీడీపీకి ధీటైన ప్రత్యర్థిగా ఉన్న పార్టీలపై పంచ్‌లు పడడం తదితర అంశాలు సినిమాలో బాలయ్య అభిమానులతో పాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment