Monday, April 14, 2014

చిక్కుల్లో టిఆర్ఎస్

టిఆర్ఎస్ చిక్కుల్లో పడింది, తెలంగాణ సాధన తర్వాత నాది ఉద్యమ పార్టీ కాదు, ఇక నుంచి రాజకీయ పార్టీ అంటూ ప్రకటించిన కేసిఆర్, అనంతరం  తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన బలాన్ని తగ్గిస్తున్నాయి.  పలితం రోజురోజుకు అధికారం చేజిక్కుంచుకోవాలన్న లక్ష్యానికి దూరం జరుగుతున్నారు.  ఉద్యమాన్ని కించపరిచి, ఉద్యమకారులపై ఝులుం ప్రదర్శించిన కొండా సురేఖ వంటి వారిని పార్టీలోకి తీసుకోవడం కేసిఆర్ కు బెడసి కొడుతోంది.

తాజాగా తెలంగాణ రాజకీయ జేఏసి సమావేశమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 4న మరో సారి సమావేశమై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఏ పార్టలో ఉన్న మద్దతిచ్చేది లేదని, వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిందేనన్నది టిజేఏసి తీసుకున్న నిర్ణయం. కొండా సురేఖ వంటి వారిని అసలు సమర్థించేది లేదని కూడా టిజేఏసి స్పష్టం చేసింది.

మరో వైపు ఓయు జేఏసి సమావేశమై బాంబు లాంటి వార్తను పేల్చింది. ఓయు జేఏసి నేతలను ఏపార్టీ పట్టించుకోక పోవడంతో వారే స్వయంగా రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించారు. తెలంగాణలోని 41 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వీరంతా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వారు. పైగా పలు పార్టీల నుండి కాకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. అంటే టిజేఏసి వీరికి మద్దతుగా ప్రచారం చేస్తుందన్న మాట.

అంటే తెలంగాణ సాధించడంలో కీలక భాగస్వామి అయిన విధ్యార్థి జేఏసి టిఆర్ఎస్ కు పోటీగా ఎన్నికల్లోకి దిగుతోంది. ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ దక్కించుకున్న కాంగ్రెస్ తోను టిఆర్ఎస్ కలిసి పోనని ప్రకటించింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన బిజేపి సైతం టిఆర్ఎస్ కు ప్రత్యర్థి గానే ఎన్నికల్లో తలపడుతోంది. అంటే ఏ సెంటిమెంట్ అయితే తనకు అధికారం కట్టబెడుతుంది అన్న ధీమాతో కేసిఆర్ ఉన్నారో, అదే నాలుగు ముక్కలుగా విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కేసిఆర్ అధికారమే తన లక్ష్యమని, నిజమైన ఉద్యమకారులను విస్మరించి, పక్కా రాజకీయులను పార్టీలోకి చేర్చుకుని, అందులోను తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన వారికి అవకాశాలు ఇవ్వడం ఆయనకు బెడసి కొడుతోంది అన్నది దీంతో స్పష్టం అవుతోంది. అంతే కాదు కొన్ని చోట్ల పార్టీలో మొదటి నుంచి ఉంటూ పార్టీ కోసం పని చేస్తూ, ఉద్యమంలోను చురుకుగా పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు ఉన్న చోట కూడా కొత్త వారిని చేర్చుకుని, వారికి టికెట్లు ఖరారు చేయడం అక్కడ పాత వారు ఇతర పార్టీలోకి వెల్లి పోటీకి దిగుతుండడం కూడా టిఆర్ఎస్ కు నష్టాన్నే తెస్తోంది. 

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020