జనసేన పార్టీని స్థాపించాక... రెండు భారీ సభలను నిర్వహించారు పవన్ కళ్యాణ్. అయితే... ఆ సభల్లో కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. మోడీ ప్రధాని కావాలన్నారు. అయితే... తెలుగుదేశం గురించి గానీ, జగన్ గురించి గానీ, ఆయన పార్టీ గురించిగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఆ పార్టీ నేతలెవ్వరూ పవన్ గురించి చెడుగా మాట్లాడలేదు. అయితే.. ఉన్నట్టుండి పవన్ జగన్‌ని టార్గెట్ చేసుకొన్నాడు. ఆయనకి అధికార వ్యామోహం ఉందనీ, తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన జగన్ అధికారం కోసం పాకులాడటం బాధించిందని తూర్పారబట్టాడు. వైఎస్ పాలనలో అవినీతిని ఎండగట్టాడు. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తాజా సంచలనానికి తెర తీశాడు.
పవన్ ఇచ్చిన ఈ ట్విస్టుతో జగన్ పార్టీ బిత్తరపోతోంది. ఇంతగా ఏకేశాడేంటి? అని ఆ పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ చెప్పిన మాటల్ని జనం సీరియస్‌గా తీసుకొంటే మాత్రం జగన్ పార్టీకి నిజంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మరి ఆ పార్టీ ఈ వ్యాఖ్యల్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఇప్పటికే జగన్ మీడియా పవన్‌ని టార్గెట్ చేసి స్క్రిప్టు సిద్ధం చేసిందని సమాచారం.

No comments:
Post a Comment