లక్నో : రేప్ చేస్తే ఉరేస్తారా అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌యాదవ్‌కు ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ములాయం వ్యాఖ్యల్లోని మీడియా తప్పుగా చిత్రీకరించిందని అఖిలేష్ తప్పును మీడియాపై తోసే ప్రయత్నం చేశారు. 'అత్యాచారం కేసుల్లో ఏకంగా ఉరిశిక్ష విధించడం అవసరమా? వాళ్లు పిల్లలు...తప్పులు చేస్తుంటారు' అంటూ ములాయం సింగ్ యాదవ్ గురువారం చేసిన వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అటు... ములాయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం తీరుపై బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ములాయం లాంటి వ్యక్తిని నాయకునిగా ఎన్నుకుంటే మహిళలకు భద్రత ఉండదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు కూడా ములాయంపై తీవ్రంగా మండిపడ్డారు. ములాయం తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. మహిళల గురించి ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని నేతగా ఎన్నుకుంటే దేశం ఏమౌతుందని వారు సూటిగా ప్రశ్నించారు.

No comments:
Post a Comment