
సీనియర్ సిటిజన్లు 25 శాతం రాయితీ పొందేందుకు టికెట్‌ను ముందస్తుగా తీసుకునే సమయంలో పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలతో పాటు వయసును పేర్కొనాల్సి ఉంటుంది. వయసు ధ్రువీకరణకు ఆధార్‌తో పాటు ఇంకా ఏయే గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత వయసు ధ్రువీకరణ కార్డు లేకుంటే రాయితీగా ఇచ్చిన 25శాతం ఛార్జీని తిరిగి వసూలు చేస్తారు. ముందుగా రిజర్వేషన్ బస్సుల్లో వృద్ధులకు రాయితీ అమలుతీరును పరిశీలించి, ఆ తర్వాత తెలుగు వెలుగు (ఆర్డినరీ) సహా ఆర్టీసీకి ఉన్న మొత్తం 12 వేల బస్సుల్లో రాయితీని విస్తరించే యోచనలో ఉంది ఏపీఎస్‌ఆర్టీసీ.
No comments:
Post a Comment