Sunday, August 14, 2016

పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద మంత్రిగారికి ఇచ్చిన పత్రం: చలసాని



ఈ రోజు మేము రాష్ట్ర, ఆర్థిక, మరియు ఆరోగ్యశాఖామంత్రులని కలవడం జరిగింది.

1. పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజిన (పి.సి.పిఐఆర్) యొక్క స్వరూపాన్ని వ్యతిరేకించినందుకు ఆంధప్రదేశ్ ఆర్థికశాఖ, వాణిజ్యపన్నుల, శాసనసభ వ్యవహారాల మంత్రిగారిని అభినందిస్తూ వివరాలతో ఒక పత్రాన్ని అందించడం జరిగింది. ఏదో దేశంలో తుక్కుగా తీసిన యంత్రాలను మన తీరప్రాంతములో ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను జబ్బులలో ముంచేబదులు ఆ ప్రాంతంలో కాలుష్యరహిత పరిశ్రమలు, సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాథి, ఉద్యోగాలు, అభివృద్ది ఫలాలు అందించాలని కోరాము. పరిశ్రమలు అని చెప్పి కాలుష్య పరిశ్రమలను అనుమతించవద్దని విన్నవించాము. గౌరవ మంత్రివర్యులు వెంటనే సానుకూలంగా స్పందించారు. తరువాత కాలుష్య నివారణా సంస్థ ఇతర అధికారులతో ఆ విషయాలు మాట్లాడారు. ఆ విషయాన్ని తరువాత మాకు తెలియచేసినందుకు వారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఇది తక్షణ స్పందన అంటే.
(పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో మీ అందరూ భాగస్వామ్యం కావాలి. తొందరలోనే వివరాలు తెలియచేస్తాము)
2.బడ్జెట్ ని రూపకల్పనలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్దికి అన్ని వర్గాలకి సమానమైన న్యాయం జరిగేటట్లు చూడమని చెప్పి అభ్యర్థనా పత్రాలు అందించటం జరిగింది. యువతకి ఉపాథి కల్పనకి కూడా ప్రాధ్యాన్యత ఇవ్వాలని కోరాము. అత్యంత క్లిష్టపరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలు ఉన్న రాష్ట్రంలో ఆ భారం తలకెత్తుకోవడం ముళ్ళకిరీటాన్ని ఎత్తుకోవడమే. అయితే సుదీత్ఘమైన అనుభవం, పరిజ్ఞానం గల యనమల గారు దాన్ని సమర్థవంతంతా నిర్వహిస్తారని భావిస్తున్నాము.
3. ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం విషయంలో మరల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు రేపు పెద్దలను కలిసి ఈ విషయాన్ని సవరించాలని చెప్తామని చెప్పారు.
( కానీ దురదృష్టవశాత్తూ ఈ రోజు రాత్రి 7-8 చంద్రబాబుగారి అధికారిక స్పీచ్ (అమెరికా తరహాలో నుంచుని ఇచ్చే స్పీచ్) బాక్ డ్రాప్ లో మన 2000 సం॥ ఘన ఆంధ్ర వారసత్వం గల చారిత్రాత్మిక అమరావతీ పూర్ణకుభం స్థానంలో మరలా ఆధికారిక చిహ్నంగా చెంబు కొబ్బరికాయ కలశ చిహ్నాన్నే వాడారు. గౌ॥నీయులు మృదుస్వభావి పెల్లె రఘునాదరెడ్డిగారి దృష్టికి స్వయంగా తీసుకువెళ్ళాము. ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రిగారు కూడా మా లేఖ చదివారు. ఎవరు ముఖ్యమంత్రిగారిని ఇతరులని తప్పుదోవ పట్టిస్తున్నారు?)
.
4. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర మంత్రి రావెల గారు మరి కొంతమంది మంత్రులు శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నారని రోజూ వారి ప్రకటనల ద్వారా తెలుస్తుంది. అయితే తెదేపా నాయకత్వం ఎందుకని దాన్ని జాతీయ సమస్యలా చేయడం లేదో, భాజపాకు ఎందుకు అంత భయపడుతుందో అర్థం కాదు. చిదంబర రహస్యం ఏమై ఉంటుంది?
5. జాతివివక్షలాగా వాడుకోకపోతే తెలంగాణ మాస్ సర్వే మంచిపనే. కానీ కొందరు ఉద్యోగ మితృలు ఈ రోజు సచివాలయంలో దానిపై ఇలా ప్రశ్నించారు అ) దానిలో నేటివిటీ వచ్చిన సం॥ తీసేసామని ఒకరు చెబుతున్నా అది ప్రశ్నార్థకమే. ఆ) పైగా దానిలో కులం సర్టిఫికెట్ అడుగుతున్నారు. 1931 తరువాత భారతదేశం కులగణనను నిషేధించింది. కేవలం యస్.సి. యస్.టి ఇతర ప్రాయోజిత కులాల లెక్కలు మాత్రం తీసుకోవాలి. మొత్తం ఎందుకు తీసుకుంటున్నారు? ఇ) అందరి పుట్టిన సర్టిఫికెట్, భూముల పత్రాలు అడుగుతున్నారు అలాగే అనేక వివరాలు. ఏదైనా పథకాలను ఉపయోగించుకునేవారిని అడిగి తీసుకోవడం భావ్యమే.( దఌతులకి 3 ఎకరాలు ఉచితం కాబట్టి ఉందెంతో, ఇవ్వవలసింది ఎంతో లెక్కలు కావాలనేది, అలాగే ప్రభుత్వ పథకాల లబ్దిదారులకి అవసరం) కానీ అందరినీ అడగాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ చెల్లుతాయా? ఆఖరికి కోర్టులు స్వాంతన చేకూర్తుస్తాయా? కేంద్ర భాజపా ప్రభుత్వం ముందుకు వస్తుందా?
నాతోపాటు ప్రొఫెసర్ ప్రముఖ శాస్త్రవేత్త, బి.అర్. కలపాల, ప్రొఫెసర్. కాంతారావు, ప్రొ రాజు, శ్రీ పన్నాల సత్యన్నారాయణమూర్తి, డా॥ రాధాకృష్ణమూర్తి మొదలగువారితో పాటు విద్యార్ధి యువజన జె.ఎ.సి ప్రతినిధులు(1956-ఫీజు రియంబర్స్ మెంట్, ఉపాథి కల్పన కోసం పాపం పోరాడుతూనే )ఉన్నారు .

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020