హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకా 40 నిమిషాల పాటు బేగంపేటలోనే ఉంటానని, తమ్మిడిహట్టిపై ఒప్పంద పత్రాలు తీసుకురావాలని ఉత్తమ్‌కు ఆయన సవాల్ విసిరారు. తనది తప్పయితే రాజీనామా లేఖతో రాజ్‌భవన్ వెళ్తానన్నారు. తమ్మిడిహట్టి ఒప్పందం జరిగి ఉంటే పదేళ్లుగా తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మల్లన్నసాగర్ దగ్గర డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్రాతో తెలంగాణను కలిపిందే కాంగ్రెస్సని నందికొండను నాగార్జునసాగర్‌గా మార్చి అన్యాయం చేశారని కేసీఆర్ ఆరోపించారు.
Wednesday, August 24, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment