శ్రీనగర్: జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కేంద్రం తొలగించే అవకాశాలున్నట్టు అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. గవర్నర్ వోహ్రా స్థానంలో ఐదుగురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు రిటైర్డ్ జనరల్స్, ఇద్దరు మాజీ గవర్నర్ కూడా ఉన్నారు. కొత్తగా జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్న వారిలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జనరల్ బీసీ ఖండూరి, జనరల్ సైయద్ ఆటా హస్‌నైన్, జనరల్ వీపి మాలిక్, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కపూర్, మిజోరాం మాజీ గవర్నర్ ఎఆర్ కోహ్లి పేర్లు వినిపిపిస్తున్నాయి. త్వరలోనే మోదీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లో కల్లోల పరిస్థితుల నెలకొనడంతో గవర్నర్ మార్పు అనివార్యం కావచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి.
Saturday, August 27, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment