న్యూఢిల్లీ: పీఓకే, బలూచిస్తాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలతో స్ఫూర్తి పొందిన బలూచిస్తాన్ వాసులు క్రమంగా వీధుల్లో కథం తొక్కుతున్నారు. ఏకంగా కరాచీలో నిరసనలు చేపట్టారు. కరాచీ ల్యారీలోని ప్రభుత్వ భవనం నుంచి పాకిస్థాన్ జాతీయ జెండాను తొలగించి బలూచిస్తాన్ జెండాను ఎగురవేశారు. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పాక్ సైన్యం దమనకాండను ఆపెయ్యాలని కోరారు. బలూచిస్తాన్, పిఓకేలో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా కరాచీకి విస్తరించడంతో నవాజ్ సర్కారులో గుబులు మొదలైంది. నేడో రేపో ఇస్లామాబాద్‌లో కూడా బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు చెలరేగుతాయని నవాజ్ సర్కారు భావిస్తోంది.
Sunday, August 14, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment