Wednesday, August 24, 2016

ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఎనలేని అవకాశాలు ఉన్నాయి: చలసాని



1. అ) చంద్రబాబుగారు నిన్న చేసిన పోలిక సరైనది... సింగపూర్ కి ఉన్న ముఖ్య ఎయిర్ పోర్టును సముద్రంను ఇసుకతో కప్పెట్టి కట్టారు. ఎన్నో టెర్మినల్స్ ఉన్నా ముఖ్యమైన పోర్టు ఒకటే. మనకి ఎన్నో సహజ సిద్దమైన పోర్టులు, అనుకూల ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఇంకా అభివృద్దికి ఎనలేని అవకాశాలు ఉన్నాయి. మన ఆర్థిక, భౌగోఌక, సామాజిక పరిస్థితులు వేరు, అక్కడివి వేరు. అది ఒక నగర దేశం, అదీ హైదరాబాద్లో సగం కంటే చిన్నది మాత్రమే. అయితే భౌగోఌక రీత్యా లాజిస్టిక్ హబ్ గా, ఒక వాణిజ్య రాజధానిగా రూపొందించి తలసరి, ఫారెక్స్ రిజర్వులతో పరిపుష్టి చేసారు. దశాబ్దాల కఠోరమైన చట్ట నిబంధనలు (మనలాగా ఫ్రీ ప్రజాస్వామ్యం కాదు), అవినీతిపై అత్యంత తీవ్రమైన పోరు, చట్టాలు, ప్రజలను అభివృద్ది కోసం లా అబైడింగ్ సిటిజన్స్ గా విధంగా మరల్చిన ధృఢమైన నాయకత్వం, ముందస్తు దృష్టి ఇంకా అనేకం దాని అభివృద్దికి తోడ్ఫడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దికి ఉపయోగపడే అనేక వాటిల్లో ఆ అభివృద్దిని ఒక ఉపమానంగా మాత్రమే స్వీకరించాలి గాని అదే తరహా అవ్వకూడదని చెబుతునే ఉన్నాము.
అ) ఏది ఏమైనా చంద్రబాబుగారు నిన్న తమిళనాడు, గుజరాత్ లతో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ అనుకూలతలు అనేకం చెప్పారు. మిషన్లుగా సూత్రీకరించడం మంచిదే. అయితే అభివృద్దికి నిర్థిష్టమైన ప్రణాఌక తీసుకురావాలి. వారు వారి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేలా ప్రసంగం ఉంది. వారికి సౌమ్యంగా వివరించే పల్లెగారు, అలాగే పాయింట్లతో వివరించే రావెళగారు ప్రస్తుతానికి ఆస్తే.
ఆ) రాయలసీమనుంచి గుంటూరుకు బ్రహ్మాండమైన రోడ్ నెట్ వర్కను అభివృద్ధి చేస్తామంటూ రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకనే చెప్పారు. మొదటినుంచి ప్రజల "మైండ్ ను సెట్" చేసి నెమ్మదిగా కన్విన్స్ చేస్తూ వెళతారనేది ఎన్నో సందర్భాలలో చూసాము. ఇదీ దానికి కొనసాగింపే.
ఇ) వారు సంతోషాంధ్ర ప్రదేశ్, కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇది మనసుకు చాలా ఆనందం కలిగించింది.దానికి వారు కట్టుబడి ఉంటారని, ఉండాలని కోరుకుంటున్నాను. కొంతమంది వక్రమార్గాన పట్టిన కాలుష్యపెట్టుబడిదారులకు పొరపాటున తలొగ్గితే మాత్రం ప్రజలు పోరాడాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం మేము ముందే ఉంటాము.
ఈ) నిన్న నవ్యాంధ్రప్రదేశ్ పటంలో భద్రాచలం ముంపు మండలాలు- వేలాది చ॥కిమీ భూభాగం ఆంధ్రప్రదేశ్ భౌగోఌక సరిహద్దులనుంచి "మిస్" అయింది. గమనించండి. వారి సలహాదారులు ఏమైపోయారు?
** ఇప్పుడు "సింగపూరం"పై చంద్రబాబు, జగన్ గారల ఉవాచలు అయిపోయాయి. రేపటినుంచి కె.సిఅర్ గారు కొన్ని రోజులు "ఒహో సింగపూర్" అని మొదలుపెడతారేమో..
2. అ) నిన్న అందరూ మరిచిపోయినా, జగన్ మోహన్ రెడ్డిగారు దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుని జాతీయప్రాజెక్టుగా స్వీకరించాలని లేఖ వ్రాయడం ముదావహం. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టులలో అవినీతి సంగతి ప్రక్కనపెడితే అది సాకారమైతే రాయలసీమకేకాక, తెలంగాణలోఅనేక ప్రాజెక్టులకి, ఆదాచేసిన నీరు నీటి ఎద్దడి సమయంలో ఎనలేని ఉపయోగం కలిగిస్తుంది.
ఆ) వారు మొన్న అత్యుత్సాహంతో ప్రవర్తించే చెవిరెడ్డి భాస్కరరెడ్డిగారిలాంటివారికి అలా చేయకూడదని చెపుతూ, మిగతా సభ్యులకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం మంచిది.
ఇ)అయితే సభలో డా జెపి, దర్మాన. పయ్యావుల, సోమిరెడ్డిలాంటి సమస్యలపై మాట్లాడేవారి కొరత కొంత ఉంది. అందుకని ప్రతిపక్షంలోనుంచి గట్టివారిని తయారుచేసి సహేతుకమైన ప్రభుత్వ నిర్ణయాలపై సహకరిస్తూ, ప్రజాకంటమైన నిర్ణయాలను నిలదీస్తూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వైకాప వ్యవహరించాల్సి ఉంది.
3. మొన్నటిలా ఒకరిపై మరొకరు నీవు 10 మందిని పొట్టనబెట్టుకున్నావంటే 1000మందిని పొట్టన పెట్టుకున్నావంటూ రాజకీయపార్టీల పరస్పర ఆరోపణలు ప్రజలకు అసహ్యం తెప్పిస్తున్నాయి. అవసరమైతే ఆ అన్నింటిపై కేంద్ర సహాయంతో విచారణ జరిపి శిక్షలు వేయించి ఆ అంకాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. అదే విధంగా అధికార ప్రతిపక్షాలు కలిసి తెలంగాణలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్ మెంట్-1956 స్థానికత ఇతర సమస్యలపై, అలాగే కేంద్రం ఇచ్చిన హామీలపై పోరాడండి. అందరూ సంతోషిస్తారు. . - చలసాని

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020