Thursday, August 4, 2016

ఉమ్మడి ఏపీ హత్య 1996 నుండీ బీజేపీ, 99 నుండీ వైఎస్ విడివిడిగా పన్నిన కుట్ర!

వైఎస్ ఉంటె విభజన జరిగేది కాదనే అపోహ జనంలో సృష్టించటంలో బాగానే సఫలమయ్యారు వాళ్ళు.. ఎందుకంటే అడ్డగోలు విభజనకు మూలం వైఎస్సే అని తల్లి పిల్ల కాంగ్రెసులో ప్రతీఒక్కరికీ తెలుసు.. 

చెన్నారెడ్డి హయాములో కుర్చీకోసం పాతబస్తీలో మతకల్లోలాలు దొమ్మీలూ తెచ్చి శాంతిభద్రతల సమస్య అనే సాకుతో చెన్నారెడ్డిగారిని దింపేయటానికి వందలాదిమందిని బలి తీసుకున్న ఘనత వైఎస్ దే. 1996 తరవాత బాబు పాలనలో పాతబస్తీ కర్ఫ్యూ ల్లో ఆ దొమ్మీలను అమలు చెయ్యలేని వైఎస్ పన్నిన మరొక దొమ్మీ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హత్య..

వైఎస్ దగ్గర కుర్చీ రాజకీయం తప్ప 2004 కు ముందు తరవాత అనేం లేదండీ.. తెలంగాణకు నేను అడ్డూకాదూ నిలువూ కాదూ అని తెలంగాణాలో ,హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా పాస్ పోర్టులుకావాలా? అని సీమాంధ్రలో వైఎస్ చేసిన 2 నాలుకల రాజకీయం 2009 ఎన్నికల్లోదే.. 

హత్య చేసి తప్పించుకోవాలనుకున్న ఫాక్షనిస్టు దొమ్మీ హత్యలు చేసి దొమ్మీ కేసుతో ఎస్కెపయినట్టు అడ్డగోలు విభజనను రాజకీయఅనివార్యతగా ప్రమోట్ చేసి ఇతర పార్టీల భుజాలపైకి తుపాకీ చేర్చి ఏపీని కాల్చి పడేసి.. ఇతర పార్టీల పైకి నెట్టేసి చేతికంటిన నెత్తురు వదిలించుకోవాలని వైఎస్ చేసిన కుతంత్రమే ఇంతా కొంప ముంచింది.. 

చిన్నరెడ్లతో టీడిక్లరేషన్ ఒక్కటే కాదు, నిండా 12 సీట్లు కూడా గెలవలేని తెరాసకు 56 సీట్లిచ్చి జీరోగా ఉన్న కేసీఆర్ ను ప్రమోట్ చేసింది వైఎస్ కాదా?

తెరాసలో గెలిచింది 12 మందే అయినా అందులో 6 మందికి మంత్రిపదవులూ, కేసీఆర్ గారికి ఢిల్లీలో మంత్రి సింహాసనం కట్టబెట్టి జాతీయ స్థాయికి ప్రమోట్ చేసింది వైఎస్ కాదా ? మొన్నటి 2014 ఢిల్లీ మంత్రాంగంలో కేసీఆర్ అండ్ కో, ఏపీ ప్రజల స్వరాన్ని, ఆందోళనను ఢిల్లీలో అడ్డుకోగలిగిందీ, సమన్యాయాన్ని పెడచెవిన పెట్టింది.. ఈ ప్రమోషన్ పరిచయాలతోనే కాదా ? 

ఢిల్లీ మొకం కూడా తెలీని కేసీఆర్ కుటుంబ సమేతంగా సోనియాను దర్శించటమే కాకుండా విభజన ఒప్పందాలు చేసుకోవటం, అదే కాంగ్రెసును నిలువునా ముంచగల స్థాయికొచ్చారంటే వైఎస్ చలవ కాదా? 

ఇప్పటి తెరాస సొంత మీడియా కోసం రాజధానిలో కేసీఆర్ కుటుంబం సీమాంధ్రుల దగ్గర పబ్లిక్ గా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కళ్ళు మూసుకున్న వైఎస్ .. కేసీఆర్ అండ్ కోకు అప్పుడప్పుడూ నజరానాలనూ బాగానే కట్టబెట్టారని కూడా వినికిడి.. ఆ సొమ్ములే సీమాంధ్రుల పై తెరాస మీడియా విష ప్రచారాలకు ఇంధనం.. 

అసలు తెలంగాణ ఇచ్చేస్తామని 2004 కాంగ్రెసు మేనిఫెస్టోలో పెట్టించిందే వైఎస్ కాదా? 2004 మేనిఫెస్టో వైఎస్ కనుసన్నల్లో రూపొందిందన్నది ప్రజలందరికీ తెలుసు కదా.. 

విభజన పేరొచ్చిన ప్రతిసారీ హైకమాండ్ చూసుకుంటుందంటూ అధిష్టానంపైన ఒత్తిడి పెంచింది కూడా వైఎస్సే.. 2004 నాటి వాగ్దానాన్ని అమలు చేశామని 2014లో స్వయానా సోనియా ప్రకటించటాన్ని ఎలా విస్మరిస్తాం ?

ఉమ్మడి ఏపీ హత్య 1996 నుండీ బీజేపీ, 99 నుండీ వైఎస్ విడివిడిగా పన్నిన కుట్ర.. its a cold blooded murder... ఇద్దరి లక్ష్యమూ కుర్చీనే.. హత్య చేసి తప్పించుకోవాలనుకున్న ఫాక్షనిస్టు దొమ్మీ సృష్టించి దొమ్మీ కేసుతో ఎస్కెపయినట్టు, అడ్డగోలు విభజన పాపాన్ని అన్ని పార్టీలపైకీ నెట్టేస్తే చేతికంటిన నెత్తురు వదిలిపోతుందని కాంగ్రెస్ భ్రమ పడింది. అడ్డంగా మునిగింది.

ఏ 2 గాఉన్న బీజేపీ తల్లిని చంపి బిడ్డను బయటికే తీశారని డైలాగులతో, రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరిస్తామని 'ప్రత్యేక' హామీలతో, తెలుగుదేశం పొత్తుతో తప్పించుకోగలిగింది. ఇప్పుడు నమ్మించి మోసగించే తొలినాటి వైఖరి కొనసాగిస్తూ కాంగ్రెసుకు పక్కనే గొయ్యి తవ్వుకుంటోంది.. వీళ్లిద్దరి బతుకులు జనానికి తెలుసు

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020