
13 జిల్లాలు
37 డిపార్టుమెంట్లు
715 సేవలు
480000 మంది ఉద్యోగ్రస్తులు
లక్షల్లో లబ్ధిదారులు
రాష్ట్రప్రజలు ప్రతి ఒక్కరి సమాచారం(ముందుముందు)
ఈ సమాచారం మొత్తం సీఎం చేతిలో... అదే "డాష్ బోర్డు" లో
రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగింది, జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది.
టెక్నాలజీ తో :- సమయం ఆదా... ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది... అవినీతి ఉండదు... రేషన్ లో తరుగు ఉండదు... సంక్షేమ పధకాలు పక్కాగా పేదవాడికి చేరతాయి... ప్రజలు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు... సమస్యల పరిష్కారం అవుతాయి... ఉద్యోగ్రస్తుల మీద పనిఒత్తిడిఫై తగ్గుతుంది... మెరుగైన పాలన ఉంటుంది.
అంతా Automatic గా జరిగిపోతుంది.... ఉదా :-
పంటల వివరాలు :- ఎక్కడ ఏ పంట వేస్తారు... ఆ పంటకి నీరు లభ్యత, విద్యుత్ వివరాలు, భూగర్భజలాల వివరాలు ప్రతి క్షణం, అప్పటి పరిస్థితి అందుబాటులో ఉంటుంది. ఏ చెరువులో ఎంత నీరుంది ఎప్పటికప్పుడు తెలుస్తుంది... దీనిపై ఎప్పుడు ఏ ప్రాంతంలో ఏ పంటకి అనుకూలం, వేయాల్సిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు వివరిస్తారు.
విద్యుత్ :- ఫలానా ప్రాంతంలో కరెంట్ పొయ్యింది... వెంటనే రికార్డ్ అవుతుంది... ఫలానా నెంబర్ కల స్తంభం మీద లైట్ వెలగటం లేదు అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే క్రింద అధికారినుండి సిఎం వరకు ఈ మెసేజ్ వెళుతుంది... కరెంట్ బిల్స్ కోసం ఇంటికి వచ్చి రీడింగ్ తీసుకునే అవసరం ఉండదు... త్వరలో ఏ ఇంటికి ఎంత కాల్చుకున్నారు ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతుంది.
ఎన్టీఆర్ వైద్యసేవ :- ఎన్ని ఆపరేషన్స్ జరిగాయి... వ్యక్తి, ఆపరేషన్ వివరాలు ఎప్పటికప్పుడు.
ఉపాధి హామీ :- అవినీతి ఉండదు... పని రికార్డ్ అవుతుంది... వేతనం నేరుగా కూలి చేతికే వెళుతుంది.
రెవిన్యూ, వాణిజ్యం :- పన్ను వసూళ్లు... ఎప్పటికప్పుడు...ఎందుకు తగ్గుతుందో తెలుసుకోవచ్చు..
ఇలా ... అన్ని శాఖలు.
సీఎం "డాష్ బోర్డు" లోనే ఉంటాయి.
No comments:
Post a Comment