
నమ్మిన సిద్దాంతం కోసం, ఆంద్ర ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఒకోసారి ఒక్కడిగానైనా నిలబడే ఉంటా. అవతలవైపు ఎంత మేరునగదీరులైనా, పెద్ద రాజకీయనాయకులు వారి మీడియాలు, లేదా వేలాదికోట్ల కాంట్రాక్టర్లు అయినా నన్ను నాలాంటి వారిని తోక్కుతానన్నా నేను పట్టించుకోను. అదే తిక్కనుకుంటే అది నాకు మెండుగా ఉంది. నా మాట నమ్మినవారు వందమంది లేదా వేయమంది ఉన్నా ఒక్కొక్కరూ పదివేలమంది పెట్టు. ఆంధ్రా అంటే అభిమానమున్న పాత్రికేయ మిత్రులు లక్షమంది పెట్టు.
===
ఆంధ్రులకి అలాగే ప్రక్కన జిల్లాలవారికీ అందరికీ హైదరాబాదు పోలీసు ఉద్యోగ వ్యవస్థలో కూడా సమానమైన హక్కులు ఉండాలనే రాష్ట్రపతి శాసనంలోని 14యఫ్ మినహాయింపు ఉండాలని దాదాపు దశాబ్దం క్రితం ఉన్నత న్యాయష్టానాన్ని ఆశ్రయించాను. అప్పుడు మా న్యాయవాది ఇప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు. అప్పుడు దానిపై ఎన్ని సంవత్సరాలు ఎంతగా కృషి చేసానో ఆరోజు ఇన్వాల్వ్ అయిన పోలీసు అధికారులకి తెలుసు. తరువాత ధిల్లీలోజరిగిన న్యాయపోరాటంలో ప్రక్కనే ఉన్నాను. (నాకు అక్కడ కేసు వేసే అర్హత లేదు- 6 సంవత్సరాలు కేసునడించింది). ఆఖరికి న్యాయం గెలించింది.
===
ఆంధ్రులకి అలాగే ప్రక్కన జిల్లాలవారికీ అందరికీ హైదరాబాదు పోలీసు ఉద్యోగ వ్యవస్థలో కూడా సమానమైన హక్కులు ఉండాలనే రాష్ట్రపతి శాసనంలోని 14యఫ్ మినహాయింపు ఉండాలని దాదాపు దశాబ్దం క్రితం ఉన్నత న్యాయష్టానాన్ని ఆశ్రయించాను. అప్పుడు మా న్యాయవాది ఇప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు. అప్పుడు దానిపై ఎన్ని సంవత్సరాలు ఎంతగా కృషి చేసానో ఆరోజు ఇన్వాల్వ్ అయిన పోలీసు అధికారులకి తెలుసు. తరువాత ధిల్లీలోజరిగిన న్యాయపోరాటంలో ప్రక్కనే ఉన్నాను. (నాకు అక్కడ కేసు వేసే అర్హత లేదు- 6 సంవత్సరాలు కేసునడించింది). ఆఖరికి న్యాయం గెలించింది.
కాని, కాని...
అర్ధం పర్ధం తెలియని నాయకులు ఒక మేధావి యం.యల్.ఎ గారి బ్రీఫింగ్ వల్ల ఏకమై అది తీయాలని మూకగా మారి(ఎపి శాసనసభ్యులని మాత్రమే అంటున్నాను) ఏకగ్రీవంగా తీయించివేయించారు. తరువాత ఆ స్పీడు శాసనసభ్యుడి గారి మీదే అసెంబ్లీ ఆవరణలోనే దాడిజరిగిందనేది వేరే సంగతి. నేను అప్పుడు అందరి వద్దకు వెళ్లాను లేదా మాట్లాడాను. హైదరాబాదు పోలీసు వ్యవస్థమాత్రం ఉమ్మడిగా ఉండాలనే పాయింట్ అలాగే ఉంచాలి, పొరపాటున విభజన అయి తెలంగాణకువెళ్ళినా కూడా ఉమ్మడి పోలీసు భర్తీ వ్యవస్థ కొనసాగుతుంది. అది అవసరం అని కూడా చెప్పాను. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలంటే మా మిత్రులు కోటగిరి గారి మాట విని కొంచెం తడవు అక్కడ అడ్డుకుంది చిరంజీవి గారే. ఆర్నెల్ల ప్లాంటెడ్ ఉద్యోగ నాయకుడి వద్దకు పోలీసులు ఇలా ఉంది టి,యన్.జి.ఒలు మద్దతు ఇచ్చినట్లు మీరు కూడా ఇవ్వాలి అంటే, ఆ నాయకుడు చూపించిన అహంకార ప్రవర్తన మరవులేరు.
కాని. రివ్యూ పిటిషన్ మరల సుప్రీంకోర్టులో కొట్టేసారు. న్యాయం మరల గెలిచింది అన్నమా ఆశలు అడియాశలు చేసి మరల శాసనసభలో మూకగా అందరూ దాన్ని తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఆంద్ర శాసనసభ్యులు కూడా ' సోయి' కోల్పోయారు. అప్పుడు ఒక్కడినే శాసనసభ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిశ్చేష్టుడనై కొద్దితడవు కూలబడిపోయాను. నేను నాతొపాటు ఓ పదిమంది పోలీసు అధికారులు ఎంతబాధపడ్డామో. అయితే ఆ శాసనసభ్యులు చేసింది న్యాయమైనదని నేను ఒప్పుకోను. అప్పుడూ, ఇప్పుడూ ఒంటరిగానైనా పోరాడుతాననే గుండెనిబ్బరం నాకు ఉంది. అది, ఆంధ్రుల హక్కులు, తెలుగువారికోసం, విద్యుత్ సమస్య, నీటిపారుదల, ఉద్యోగ సమస్యలు, పర్యావరణ రక్షణ, తెలుగుభాషని నిలబెట్టుకోవడం ఏదైనా సరే.
నేడు.. జియస్టి బిల్లు వచ్చినప్పుడు అది సరళీకృతం చేయడానికి కొంతవరకూ ఉపయోగమే. కాని మన యంపిలు దిల్లీలో అందరికీ చెప్పి ఎపికి రావలసిన విభజన హామీల అమలుకి బిల్లుల్లో ఉన్న సూత్రాలు హాని చేస్తాయని, అలాగే రాష్ట్రాల అధికారాలకు కొంత దెబ్బ అని చెప్పలేకపోయారు. కనీసం మనసంగతేమిటని గొడవ అన్నాచేయలేదు(Honestly). అనేకమంది తమిళసోదరులు బయటికి వాకౌట్ చేసారు. ఇప్పుడు అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది అంట.
కాని, కాని ఇందాక మన యంపిలు చేసింది తప్పు అని నేను నాలాంటి వారు కొద్దిమందిమైనా చాటుతాం. 14యఫ్ విషయంలో నేను నాతొ పాటు పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్ పడిన తపన, శ్రమ, మరచిపోలేము. మావాదనే నాటికీ నేటికీ ఏనాటికీ నిజం,. - చలసాని
No comments:
Post a Comment