Wednesday, August 3, 2016

కృష్ణా పుష్కరాల యాత్రికులకు విన్నపము




పుష్కర యాత్రికులకు ఒక విన్నపము.
కృష్ణా పుష్కరాలు ఆగష్టు 12 వ తేదీ నుండి
ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సారి యాత్రీకులందరూ విజయవాడలో నే
పుష్కర స్నానాలు చేయటం సాధ్య పడక పోవచ్చు.
ముఖ్యంగా రహదారి గుండా ప్రయాణాలు చేసే వారు
చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా
ఉంది.
కారణం
విజయవాడలో గత సంవత్సరం నుండి జరుగుతున్న
Fly Over మరియు రహదారి మరమ్మత్తు పనులు
ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు.
ఎన్నేళ్ళు పడుతుందో ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం
అసాధ్యం .
ఈ ఏడాది అంతా హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు మరో రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని తీవ్ర అసౌకర్యానికి లోనై తిట్టుకుంటూ , పసి
పిల్లలతో తీవ్ర అవస్ధల పాలవుతూ ప్రయాణాలు
చేస్తున్నారు.
అలాంటిది పుష్కరాల సమయంలో పట్టే ఆలస్యాన్ని
మనం ఊహించగలమా ?
చాలా అవస్ధల పాలు కావలసి వస్తుంది.
దీనికి మా సలహా !
పుష్కర స్నాన ఫలితం నది పరీవాహక ప్రాంతంలో ఎక్కడ
చేసినా వస్తుంది.
విజయవాడ లోనే చెయ్యాలన్న నియమం పెట్టుకోవద్దు.
ముఖ్యంగా హైదరాబాదు వైపు నుండి వచ్చేవారు
విజయవాడ లో దిగే ప్రయత్నం చేసే కన్నా తెనాలి
లో దిగితే బస్టాండు వద్ద మంచి హోటల్స్ మరియు
బస చేసే సౌకర్యాలు ఉన్నాయి.
విశ్రాంతి తీసుకొని వల్లభాపురం , గాజుల్లంక , చిలుమూరు ఇత్యాది కృష్ణా నదీ పరివాహిక ప్రాంతాలున్నాయి.
హాయిగా పుష్కర స్నానం చేసుకొని దైవ దర్శనం
కూడా చేసుకోవచ్చు .
లేదా
రేపల్లే కు హైదరాబాదు నుండి రైలు సౌకర్యం ఉంది.
చక్కగా రేపల్లె వెడితే రేపల్లె లో ఇప్పుడు మంచి
హోటల్స్ వసతి సౌకర్యాలు ఉన్నాయి.
పెనుమూడి రేవులో స్నానం చేసుకొని మోపిదీవి
సుబ్రహ్మణ్య స్వామి వారిని , శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును , అడవుల దీవి , మోర్తోట , హంసల దీవి ,
ఇలా ఎన్నో చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలను దర్శించు
కోవచ్చు.
ఇదంతా కృష్ణా నది పరీవాహిక ప్రాంతం.
సంగమ ప్రదేశం.
పరమ పవిత్రం.
మరో ముఖ్యమైన విషయం.
పుష్కరాలు మొదటి రోజునే అదీ పుష్కరుడు ప్రవేశించబోయే సుముహూర్త సమయంలోనే పుష్కర
స్నానం చెయ్యాలనే మూఢ నమ్మకాలు వదిలేయండి.
ఆ పుష్కరాలు 12 రోజులలో ఎక్కడ చేసినా ఏ ప్రాంతంలో స్నానం చేసినా సంపూర్ణమైన ఫలితం
లభిస్తుంది .
అనవసరమైన మూఢ నమ్మకాలతో మీరు అవస్ధల పాలై
మీ కుటుంబ సభ్యులను పసి పిల్లలను చిన్నారులను
అవస్ధల పాలు చేయవద్దు.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020