‘‘తారక్ పక్కనుంటే గూగుల్ అవసరం లేదు’’ అని చెప్పారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘జనతాగ్యారేజ్’ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు హాజరైన బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘‘సీనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రాలేదు కానీ, జూనియర్ ఎన్టీఆర్‌తో యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. వయసులో నాకంటే చిన్నవాడైనా సరే తారక్‌ను ‘అన్నా’ అంటుంటా. చాలామందితో యాక్ట్ చేశాను కానీ, ఇతను ఒక గూగుల్ లాంటోడు. సెట్స్‌లో మేము కార్ల గురించి మాట్లాడుకున్నా, బాడీ డైట్ గురించి మాట్లాడుకున్నా, యానిమల్స్ గురించి మాట్లాడుకున్నా, మూజిక్ గురించి మట్లాడుకున్నా... 1970లోని ఫలానా సాంగ్ అంటే మేము గూగుల్ ఓపెన్ చేసి చూడాలి. తారక్ పక్కనుంటే అవసరం లేదు. దాని హిస్టరీ, పుట్టుపుర్వోత్తరాలు పాట పాడి వినిపిస్తాడు. సెట్స్‌లో ఫైట్ రిహార్సల్స్ జరుగుతుంటే చూస్తుంటాడు తప్ప తను రిహార్సల్స్ చేయడు. టేక్ చెప్పగానే డైరెక్ట్‌గా షాట్ చేసేస్తాడు. సరే, ఫైట్స్ కదా.. ప్రావీణ్యం ఉందేమో అనుకున్నా.. కానీ సాంగ్స్‌లో కూడా రిహార్సల్స్ చేయకుండా టేక్ చెప్పగానే వెళ్లి దడదడలాండిచేస్తాడు. సరే చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్ కదా అనుకున్నా. ఒక 5 పేజీల డైలాగ్ ఉంటుంది.. దాన్ని బట్టీపట్టకుండా.. జస్ట్ ఒక్కసారి సింపుల్‌గా చదివేసి దాన్ని కూడా దడదడలాడించేస్తాడు. తారక్‌ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇన్ని కళలు ఈ మనిషికి ఎలా వచ్చాయనిపిస్తుంది.’’ అని ఎన్టీఆర్ టాలెంట్ గురించి వివరించారు. చివరిగా సీనియర్ ఎన్టీఆర్ బొమ్మవైపు చూపిస్తూ.. ఆ పెద్దాయన ఆశీస్సులు తారక్‌కు ఉన్నట్టున్నాయి అని చెప్పారు.
No comments:
Post a Comment