హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలకు ఆహ్వానించింది. ఏపీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి జూనియర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానం పలికారు. దీనికి ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఎంతో కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న జూనియర్‌ను పుష్కరాలకు ఆహ్వానించడం వెనుక రాజకీయ కోణం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు మాత్రం జూనియర్ పుష్కరాలకు హాజరైతే అసలైన పండుగ వస్తుందని అనుకుంటున్నారట!
No comments:
Post a Comment