
కచశేరా గారు ఘటనాఘటన సమర్ధులు. సన్నాసీ, హిట్లర్ అన్న నోటితోనే ఇంద్రుడని కీర్తించగలరు. ఎప్పుడు ధిల్లీ వచ్చినా తమ రాష్ట్రాభివృద్ది గురించే మాట్లాడే ముఖ్యమంత్రి వీరేనని , నాలుగుమంచిమాటలు తాను ఒకనాడు తూలనాడిన నరేంద్రునిచేనే అనిపించుకోగలరు. "మిమ్మల్ని హైదరాబాదు వస్తే అరెస్టు చేస్తానన్నరోజులు కావండి ఇవి ... మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళం మేము" అని ప్రక్క ముఖ్యమంత్రి మీద పాతగాయాలు రేపెట్టగలరు కొందరు. నాచబానా గారు మిత్రపక్షం అయినా, వారి రాజధాని శంకుస్థాపనరోజు అలా రెండు మాటలు బాగా అనిపించుకోలేకపోయారు. అదే వాజపేయీ గారి సమయంలో "ఎపినుంచి నచబానాగారికి 43 మంది మొత్తం పార్లమెంట్ సభ్యుల అండ ఉన్నా, కేంద్రంలో మమ్మల్నిబ్లాక్ మెయిల్ చేయకుండా రాష్ట్రాభివ్రుద్దికోసం పాటుబడే ముఖ్యమంత్రి" అన్న ఆనాటి రోజలు గుర్తుకువచ్చి ఆయన ఈరోజు లోలోపల బాధపడుతూ ఉండవచ్చు. 2004 తరువాత భాజపాని వదిలేసినా మహాకూటమి కట్టినా ఫలితం దక్కలేదే.. స్వయంక్రుతాపరాధమా అనుకోవచ్చు.
--
అయితే ఎపికి వచ్చిన గుజరాత్ ప్రధానమంత్రి గౌ|| నదామో గారు గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు(యమునా మురికి నీళ్ళా) ఎలా ఇచ్చారో తెలంగాణలో కొంచెం స్టైల్ మార్చి ఒక చెంబులో నీరుపట్టి పోయారు గానీ మన ఆఖరిగా తెలుగురాష్ట్రాలకి ఇవ్వవలసినదానికంటే అదనంగా చిప్ప మాత్రం ఇస్తారేమో(మహారాష్ట్ర, గుజరాత్ కంటే)! కాని దాంట్లో రెండు అణాలు మాత్రం వేస్తారనే నమ్మకం ఉంది. ఇరువురు చంద్రులకంటే గుజరాతీ నరేంద్రుడి పవర్ ఎక్కువేగా. ఆయన ఎపికి రాయతీలతో కూడిన ప్రత్యేకతరగతిహోదా విభజన హామీల అమలులో చూపించే నిర్లిప్తత చూసి - చలసాని
No comments:
Post a Comment