ఈ ఫోటోను చూస్తుంటే.. బస్సు ఆగిపోవడం వల్ల కారు డ్రైవరును లిఫ్టు అడుగుతున్నట్టుంది కదూ?! కానీ వీరు వాహనాలను ఆపుతున్నది అందుకు కాదు.. ఉచిత భోజనం చేసి వెళ్లమని పుష్కర యాత్రికులను ఆహ్వానిస్తున్నారు. గుంటూరు- అమరావతి మార్గంలోని నిడుముక్కలలో గ్రామస్థులు ఇలా రోడ్డుపై వాహనాలను ఆపి, అమరావతి వెళ్తున్న/వెళ్లి వస్తున్న పుష్కర యాత్రికులను పిలుచుకు వెళ్లి మరీ భోజనాలు పెడుతున్నారు. ఎక్కడి నుంచో వస్తున్న పుష్కర యాత్రికులకు గ్రామీణులు ఇలా పిలిచి మరీ అతిథ్యం ఇవ్వడం విశేషమే కదా!!
No comments:
Post a Comment