Sunday, September 11, 2016

ఖుషీ ఖుషీ గా తారక్



'జనతా గ్యారేజ్‌'పై ఏ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు, ఎన్టీఆర్‌లాంటి మాస్‌ హీరోతో కలిసినప్పుడు ఆ కలయికలో వచ్చే సినిమా సంచలనానికి తగ్గే సమస్యే లేదని ఫిక్స్‌ అయిపోయారు. ఎన్టీఆర్‌కి తోడు మోహన్‌లాల్‌ లాంటి జాతీయ ఉత్తమ నటుడు ఉండడం, ట్రెయిలర్‌ చాలా ప్రామిసింగ్‌గా అనిపించడంతో 'జనతా గ్యారేజ్‌' తప్పక చూడాల్సిందేనని సినీ ప్రియులు నిర్ణయించేసుకున్నారు. పాత కథలతోనే కనికట్టు చేసి మొదటి రెండు చిత్రాలనీ అంతటి హిట్లు చేసిన కొరటాల శివ పనితనంపై ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు. కమర్షియల్‌ అంశాలని జోడించి అన్ని వర్గాలనీ ఆకట్టుకోవడంలో సిద్ధహస్తుడని అనిపించుకున్న కొరటాల శివ ఈసారి కూడా తనదైన శైలి లొ బిగ్ హ్యాట్రిక్ సక్సస్ సాదించారు. ఈ విజయం తారక్ కి కూడా హ్యాట్రిక్ కనుక తన తరువాత మూవీ కి రెట్టించిన ఉత్సాహం తొ సిద్దమౌతున్నాడని సినీ వర్గాల సమాచారం.

ప్యాకజీయే ముద్దు అంటున్న బాలయ్య!

మనం మన రాష్ట్రం అని స్వార్దం చూస్కొకుండా పక్క రాష్ట్రాల వారి అవకాశాల్ని దెబ్బ తియ్యకుండా, మనం త్వరితగతిన ఎదగాలంటే ప్యాకేజీ నే మంచిదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

బాబు కాలర్ పట్టుకుంటే, చెయ్యి నరికెస్తా: రాజేంద్ర ప్రసాద్

ప్రత్యేక హోదా సాంగ్


వినాయకుడికి నైవేధ్యంగా ఊహించనిది పెడుతున్నారు



కొప్పల్/కర్నాటక: దేశ వ్యాప్తంగా వినాయక పూజలు, నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు భక్తులు తమ ఆరాధనలు, పూజలు, నైవేద్యాలతో రకరకాలుగా స్వామిని కొలుస్తున్నారు. అయితే ఒకచోట మాత్రం గణేశుడికి నైవేద్యంగా ఊహించనిది పెడుతున్నారు. మామూలుగా అయితే ఉండ్రాళ్లు, పప్పన్నం,పాయాసం, కొబ్బరి, పళ్లు పలహారాల వంటివి పెడుతుంటారు. కానీ మద్యం, మాసాలను నైవేద్యంగా పెట్టడం అక్కడి ఆచారమట. కర్నాటకలోని కొప్పల్ జిల్లా, భాగ్యనగర్ గ్రామంలో ఈ విధంగా జరుగుతోంది. అలా చేస్తే స్వామి వారు సంతోషిస్తారని అక్కడివారి ఆచారమట.

http://www.andhrajyothy.com/artical?SID=307898

Saturday, September 10, 2016

"ఏదేశమేగినా, ఎందుకాలిడినా అని గురజాడ అప్పారావు గారు చెప్పారని అన్నారు సార్‌! అది తప్పు సార్‌! ఆ గేయం రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు సార్‌!’’

మధురపూడి విమానాశ్రయం : విమానం డోర్‌ తెరుచుకోగానే పవన్ కళ్యాణ్‌, వెనకాలే అతడి కుడి, ఎడమ భుజాలైన బాలు, శీను, మరికొంతమంది అసిస్టెంట్లు దిగుతారు. 
శీను లాప్‌టాప్‌ ఓపెన్ చెయ్యగానే బాలు మీటనొక్కి, స్ర్కీన్ మీద ప్రత్యక్షమయ్యే వారి గురించి చెప్పడం మొదలుపెడతాడు.
 
‘‘సార్‌.. ఈయన వెంకయ్యనాయుడు.. కేబినెట్‌లో తెలుగు మంత్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఈయనగారి పాస్‌వర్డ్‌... అధిక్షారపక్షం కాగానే అది ఫెయిల్‌ వర్డ్‌గా మారిపోయింది.. ఈయన అశోక్‌ గజపతి రాజు.. పేరులో రాజున్నా మోదీ కేబినెట్‌లో మంత్రి మాత్రమే. తెలుగునేల మీదే పుట్టి, తెలుగుదేశం పార్టీలోనే పెరిగినా, తెలుగు మాత్రం మంచులక్ష్మి టైపులో మాట్లాడతారు. ప్రత్యేక హోదా అనే మాట నోరు తిరక్క కాబోలు, దాని జోలికి ఎప్పుడూ పోరు.. ఇంకో తెలుగు మంత్రి సుజనా చౌదరి.. కిట్టని వాళ్లు స్వజనా చౌదరి అంటారు.. ఇక, వీళ్లంతా మన ఎంపీలు..’’ 
పవన్ కళ్యాణ్‌ విసుగ్గా మొహం పెట్టడంతో బాలు వాగ్ధాటికి బ్రేక్‌ పడింది.
 
‘‘కొత్త పాయింట్లు చెప్పరా.. ఈ చెత్త గురించి అవసరం లేదు’’ చిరాగ్గా అన్నాడు పవన కళ్యాణ్‌.
‘‘సార్‌... ఈ డీటెయిల్స్‌ అన్నీ తెలుసుకోకుండా మీరు రేపు స్పీచేం ఇస్తారు? హోదా ఎలా సాధిస్తారు?’’ అడిగాడు బాలు.
పవన్ కళ్యాణ్‌ బాలు వైపు జాలిగా చూసి చెప్పాడు. ‘‘ఒరే, రాముడు సముద్రం దగ్గరికి వెళ్లాక బ్రిడ్జి ఎలా కట్టాలో ప్లాన చేశాడు కానీ అడవిలో ఉండగా బ్రిడ్జి ప్లాన గీసుకుని సముద్రం దగ్గరికి వెళ్లలేదురా!’’
‘‘అయితే ఇప్పుడేం చేద్దాం సార్‌?’’ పిల్లిగడ్డం గోక్కుంటూ అన్నాడు బాలు. 
‘‘ఒరే బాలుగా! ప్రత్యేక హోదా సాధించడం ఎలా? అనే పుస్తకం నేనేమన్నా రాశానా? ఏమనిపిస్తే అది చేసుకు వెళ్లిపోవడమే!’’ అంటూ ముందుకు కదిలాడు పవన్ కళ్యాణ్‌. 

కాకినాడ హోటల్‌ రూమ్‌ : బహిరంగ సభలో తాను ఇవ్వబోయే ప్రసంగం తాలూకు పాయింట్లు శ్రద్ధగా రాసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్‌. 
సరిగ్గా అప్పుడు శీను పెద్ద తప్పు చేశాడు. కడుపులో ఉన్నమాట బయటికి కక్కేశాడు. 
‘‘ఒక పక్క సినిమాల్లో హీరో వేషం వేస్తూ, మరో పక్క రాజకీయాల్లో గెస్ట్‌ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తుంటే, ప్రత్యేకహోదా ఎలా వస్తుంది సార్‌? రాదూ..’’
పవన్ కళ్యాణ్‌ కోపం నషాళానికి అంటింది. అసిస్టెంట్లకి సైగ చేశాడు. తక్షణం వాళ్లు శీనుగాణ్ణి శీర్షాసనం టైపులో తలకిందులు చేసి పట్టుకున్నారు. శీను లబలబలాడాడు. 
‘‘ఒరే శీనుగా! నీ దగ్గర అయిడియా లేవైనా ఉన్నాయట్రా?’’ సీరియ్‌సగా అడిగాడు పవన్   కళ్యాణ్‌.
 
భయంతో తల అడ్డంగా ఊపాడు శీను. 
‘‘మరి ఆల్టర్నేటివ్స్‌ లేనప్పుడు పక్కవాళ్లని క్రిటిసైజ్‌ చెయ్యకూడదొరేయ్‌.. కాలిపోద్ది.. ఒరే శీనుగా.. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ చీదేశాక మన ఫైనాన్షియల్‌ పొజిషన వీకైంది కదా’’ 
‘‘బాగా వీకయిపోయింది సార్‌!’’ వంతపాడాడు బాలు.
 
‘‘బ్యాంక్‌ బ్యాలెన్స లేకపోయినా మీ బ్యాండ్‌ మేళం డ్రెస్సులకి ఇస్ర్తీ డబ్బులిస్తూ, మిమ్మల్ని ముప్పొద్దులా సుష్ఠుగా మేపాలి కదా!’’ 
‘‘మేపి తీరాలి సార్‌!’’
 
‘‘మరప్పుడు నేను సినిమాల్లో వేషాలేసి సంపాదించకుండా ఇంకేం చేయాల్రా? చెప్పండి!’’
 
‘‘లోకంలో ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరు. మీరు యాక్టర్‌గానే ఉండాలి.’’ 
పవనకళ్యాణ్‌ గర్వంగా నవ్వి అన్నాడు. ‘‘రేపు పబ్లిక్‌ మీటింగ్‌లో జనం చేతే ఆ మాట చెప్పిస్తా, చూడండి..’’
 
‘‘బాస్‌.. ఇక నన్ను దింపమనండి బాస్‌’’ శ్రీను మొత్తుకున్నాడు. 
‘‘జీతాలిచ్చేవాడి మీద జోకులేస్తే ఇలాగే జీవితం తలకిందలైపోతుంది ఎదవ.. ఇక దింపండి ఎదవని’’
 
అసిస్టెంట్లు శీనుని దింపేశారు. శీను వణుకుతూ కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్‌ శీను భుజం తట్టి చెప్పాడు.
 
‘‘అరే శీనుగా.. నేను అగ్గిపుల్ల లాంటోణ్ణిరా! కొవ్వొత్తి వెలిగించడానికీ పనికొస్తా.. కొంపలార్పడానికీ పనికొస్తా!’’
 
‘‘ఎందుకో ఈ సిట్యుయేషనకి ఈ డైలాగ్‌ సూట్‌ కావడం లేదు సార్‌!’’ పిల్లి గడ్డం నిమురుకుంటూ అన్నాడు బాలు.
‘‘నీ ఎదవ మొకానికి ఆ పిల్లిగడ్డం సూటైందా? మరి మేం చూడటంలా? ఎదవ సోది ఆపి మన స్పీచకి కొత్త పాయింట్లు తడితే చెప్పండి’’ అంటూ నోట్సు ప్రిపరేషన్‌లో మునిగిపోయాడు పవన్ కళ్యాణ్‌. 
 
పబ్లిక్‌ మీటింగ్‌ : పవన్ కళ్యాణ్‌ షరా మామూలుగా వీరావేశంతో ఉపన్యసిస్తున్నాడు. మధ్యలో సినిమాల టాపిక్‌ తెచ్చాడు.
 
‘‘నన్ను సినిమాలు వదిలేయమంటే ఈ క్షణంలోనే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సినిమాలు వదిలేస్తే నా దగ్గర తిండానికి కూడా డబ్బులుండవు. మీరే నన్ను పోషించాలి. మీ ఇళ్లకొచ్చి ‘‘అరే బాబూ, అన్నం పెట్టు, అమ్మా, అక్కా, అన్నం పెట్టు, ఆకలేస్తోంది’’ అంటా’’
 
జనం బెదిరిపోయి ‘‘వద్దు, వద్దు, సినిమాల్లోనే ఉండు’’ అంటూ కేకలు వేశారు. 
టీవీలో తన ప్రసంగాన్ని శ్రద్ధగా చూస్తున్న చంద్రబాబుకి ఒళ్లు పులకించేలా ఇంకోమాట చెప్పాడు పవన్ కళ్యాణ్‌.
 
‘‘నేను బంద్‌లకి పిలుపివ్వను.. నిరసనలంటూ మిమ్మల్ని రోడ్డెక్కమని చెప్పను. ప్రభుత్వ ఆస్తులకి నష్టం కలిగించే పనులు చెయ్యమని చెప్పను.. పార్లమెంటు కేంటీనలో సబ్సిడీ ఫుడ్డు తింటున్న మన ప్రజాప్రతినిధులున్నారుగా.. వాళ్ల చేతే పోరాటం చెయ్యిద్దాం.. మధ్యలో మీరెందుకు కష్టపడాలి? మనకెందుకీ రొష్ఠు?’’ 
జనం కేరింతలు కొట్టారు.
 
‘‘చివరిగా గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికో మాట చెప్పి, నా ఉపన్యాసం ముగిస్తాను. వెంకయ్య నాయుడూ జీ! కుదిరితే హోదా ఇప్పించండి.. లేదంటే మేం వేసే శిక్షని భరించండి.. కానీ, మీరిచ్చిన పాచిపోయిన లడ్డూల ప్యాకేజీతో సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందని మాత్రం గుర్తించండి.. భారత మాతాకీ జై... జైహింద్‌’’ అంటూ ఉపన్యాసం ముగించాడు పవన్ కళ్యాణ్‌. 
 
కొసమెరుపు : పవన్ కళ్యాణ్‌ వేదిక దిగి వస్తుంటే అసిస్టెంటు శీను అతడి చెవిలో గొణిగాడు. 
‘‘సార్‌... మీ స్పీచ్ స్టార్టింగ్‌లో ఏదేశమేగినా, ఎందుకాలిడినా అని గురజాడ అప్పారావు గారు చెప్పారని అన్నారు సార్‌! అది తప్పు సార్‌! ఆ గేయం రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు సార్‌!’’ 
పవన్ కళ్యాణ్‌ మళ్లీ తనకి పనిష్మెంట్‌ వేసే ఛాన్సివ్వకుండా హడావిడిగా పరిగెత్తాడు శీను. 
                                                                     ఇదంతా కేవలం సరదాకి మాత్రమే                    మంగు రాజగోపాల్‌

http://www.andhrajyothy.com/artical?SID=307602

అవసరమైతే బాబు కాలర్‌ పట్టుకుంటా: జగన్‌


‘ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో కుర్చీలు, బల్లలు ఎక్కడమే కాదు.. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్‌ పట్టుకుంటా. రాష్ట్రానికి హోదా తేవడం కోసం అవసరమైతే ఆయన చొక్కా పట్టుకుంటా’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కుర్చీలు, బల్లలు ఎక్కిన దృశ్యాల వీడియో టేపులను టీడీపీ నేతలు మీడియాకు రిలీజ్‌ చేశారని ఇప్పుడే సమాచారం అందిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నా అవి అభివృద్ధి చెందలేదని చంద్రబాబు శాసనమండలిలో అన్నారని, తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పారని విమర్శించారు.


అవసరం ఐతే కాలర్ పట్టుకుంటా?

ఇంతకన్న అవసరం ఎం వస్తుంది రా వెర్రి పుష్పమా. నీకు రాష్ట్రం బాగుండటం ఇష్టం లేక, నీకు పాకేజీ లొ వాటా కొసమో మాట్లాడుతున్నావ్

source: http://www.andhrajyothy.com/artical?SID=307595

Sunday, August 28, 2016

సీఎం "డాష్ బోర్డు"


13 జిల్లాలు
37 డిపార్టుమెంట్లు
715 సేవలు
480000 మంది ఉద్యోగ్రస్తులు
లక్షల్లో లబ్ధిదారులు
రాష్ట్రప్రజలు ప్రతి ఒక్కరి సమాచారం(ముందుముందు)
ఈ సమాచారం మొత్తం సీఎం చేతిలో... అదే "డాష్ బోర్డు" లో
రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగింది, జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది.
టెక్నాలజీ తో :- సమయం ఆదా... ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది... అవినీతి ఉండదు... రేషన్ లో తరుగు ఉండదు... సంక్షేమ పధకాలు పక్కాగా పేదవాడికి చేరతాయి... ప్రజలు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు... సమస్యల పరిష్కారం అవుతాయి... ఉద్యోగ్రస్తుల మీద పనిఒత్తిడిఫై తగ్గుతుంది... మెరుగైన పాలన ఉంటుంది.
అంతా Automatic గా జరిగిపోతుంది.... ఉదా :-
పంటల వివరాలు :- ఎక్కడ ఏ పంట వేస్తారు... ఆ పంటకి నీరు లభ్యత, విద్యుత్ వివరాలు, భూగర్భజలాల వివరాలు ప్రతి క్షణం, అప్పటి పరిస్థితి అందుబాటులో ఉంటుంది. ఏ చెరువులో ఎంత నీరుంది ఎప్పటికప్పుడు తెలుస్తుంది... దీనిపై ఎప్పుడు ఏ ప్రాంతంలో ఏ పంటకి అనుకూలం, వేయాల్సిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు వివరిస్తారు.
విద్యుత్ :- ఫలానా ప్రాంతంలో కరెంట్ పొయ్యింది... వెంటనే రికార్డ్ అవుతుంది... ఫలానా నెంబర్ కల స్తంభం మీద లైట్ వెలగటం లేదు అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే క్రింద అధికారినుండి సిఎం వరకు ఈ మెసేజ్ వెళుతుంది... కరెంట్ బిల్స్ కోసం ఇంటికి వచ్చి రీడింగ్ తీసుకునే అవసరం ఉండదు... త్వరలో ఏ ఇంటికి ఎంత కాల్చుకున్నారు ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతుంది.
ఎన్టీఆర్ వైద్యసేవ :- ఎన్ని ఆపరేషన్స్ జరిగాయి... వ్యక్తి, ఆపరేషన్ వివరాలు ఎప్పటికప్పుడు.
ఉపాధి హామీ :- అవినీతి ఉండదు... పని రికార్డ్ అవుతుంది... వేతనం నేరుగా కూలి చేతికే వెళుతుంది.
రెవిన్యూ, వాణిజ్యం :- పన్ను వసూళ్లు... ఎప్పటికప్పుడు...ఎందుకు తగ్గుతుందో తెలుసుకోవచ్చు..
ఇలా ... అన్ని శాఖలు.
సీఎం "డాష్ బోర్డు" లోనే ఉంటాయి.

Saturday, August 27, 2016

గవర్నర్‌‌కు ఉద్వాసన...?

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కేంద్రం తొలగించే అవకాశాలున్నట్టు అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. గవర్నర్ వోహ్రా స్థానంలో ఐదుగురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు రిటైర్డ్ జనరల్స్, ఇద్దరు మాజీ గవర్నర్ కూడా ఉన్నారు. కొత్తగా జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్న వారిలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జనరల్ బీసీ ఖండూరి, జనరల్ సైయద్ ఆటా హస్‌నైన్, జనరల్ వీపి మాలిక్, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కపూర్, మిజోరాం మాజీ గవర్నర్ ఎఆర్ కోహ్లి పేర్లు వినిపిపిస్తున్నాయి. త్వరలోనే మోదీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లో కల్లోల పరిస్థితుల నెలకొనడంతో గవర్నర్ మార్పు అనివార్యం కావచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి.

Wednesday, August 24, 2016

మా రక్తం తీస్కొండి... ఆంధ్రా కి ప్రత్యెక హోదా ఇవ్వండి: చలసాని


విద్యార్ధులు, యువకులు సెప్టెంబర్ 1న విజయవాడలో రక్తదానం చేస్తూ బ్లడ్ బాంక్ వారిని, వాటిలో కొన్ని సీసాలను ప్రధాని మోదీగారికి వారి కంపెనీకి పంపించమని మిగిలినవి ఎక్కడైనా అవసరమైనవారికి వాడుకోమని కోరతారు. అనేక దీక్షలు, సమ్మెలు, బస్సు యాత్రలు, పాదయాత్రలు, డిల్లీకి దండయాత్ర ఎన్ని చేసినా కేంద్రం స్పందించక పోవడంతో ఈ టోకెన్ తరహా నిరసన మరియు సమాజసేవకలిపి చేస్తున్నదే. కేంద్రం నుంచి వచ్చే ప్రకటన చూసిన తరువాత కార్యాచరణ ఉంటుంది. విశాఖపట్నంలో మూడు రోజుల క్రితం నాతొపాటు ఆచార్య అప్పలనాయుడు గారు, వైద్యులసంఘ కార్యదర్శి శ్యాం సుందర్ గారు, జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారు, సహకార్యదర్స్జ్హి సురేష్ గారు, ఇతర పెద్దలు, విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.– చలసాని

ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఎనలేని అవకాశాలు ఉన్నాయి: చలసాని



1. అ) చంద్రబాబుగారు నిన్న చేసిన పోలిక సరైనది... సింగపూర్ కి ఉన్న ముఖ్య ఎయిర్ పోర్టును సముద్రంను ఇసుకతో కప్పెట్టి కట్టారు. ఎన్నో టెర్మినల్స్ ఉన్నా ముఖ్యమైన పోర్టు ఒకటే. మనకి ఎన్నో సహజ సిద్దమైన పోర్టులు, అనుకూల ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఇంకా అభివృద్దికి ఎనలేని అవకాశాలు ఉన్నాయి. మన ఆర్థిక, భౌగోఌక, సామాజిక పరిస్థితులు వేరు, అక్కడివి వేరు. అది ఒక నగర దేశం, అదీ హైదరాబాద్లో సగం కంటే చిన్నది మాత్రమే. అయితే భౌగోఌక రీత్యా లాజిస్టిక్ హబ్ గా, ఒక వాణిజ్య రాజధానిగా రూపొందించి తలసరి, ఫారెక్స్ రిజర్వులతో పరిపుష్టి చేసారు. దశాబ్దాల కఠోరమైన చట్ట నిబంధనలు (మనలాగా ఫ్రీ ప్రజాస్వామ్యం కాదు), అవినీతిపై అత్యంత తీవ్రమైన పోరు, చట్టాలు, ప్రజలను అభివృద్ది కోసం లా అబైడింగ్ సిటిజన్స్ గా విధంగా మరల్చిన ధృఢమైన నాయకత్వం, ముందస్తు దృష్టి ఇంకా అనేకం దాని అభివృద్దికి తోడ్ఫడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దికి ఉపయోగపడే అనేక వాటిల్లో ఆ అభివృద్దిని ఒక ఉపమానంగా మాత్రమే స్వీకరించాలి గాని అదే తరహా అవ్వకూడదని చెబుతునే ఉన్నాము.
అ) ఏది ఏమైనా చంద్రబాబుగారు నిన్న తమిళనాడు, గుజరాత్ లతో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ అనుకూలతలు అనేకం చెప్పారు. మిషన్లుగా సూత్రీకరించడం మంచిదే. అయితే అభివృద్దికి నిర్థిష్టమైన ప్రణాఌక తీసుకురావాలి. వారు వారి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేలా ప్రసంగం ఉంది. వారికి సౌమ్యంగా వివరించే పల్లెగారు, అలాగే పాయింట్లతో వివరించే రావెళగారు ప్రస్తుతానికి ఆస్తే.
ఆ) రాయలసీమనుంచి గుంటూరుకు బ్రహ్మాండమైన రోడ్ నెట్ వర్కను అభివృద్ధి చేస్తామంటూ రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకనే చెప్పారు. మొదటినుంచి ప్రజల "మైండ్ ను సెట్" చేసి నెమ్మదిగా కన్విన్స్ చేస్తూ వెళతారనేది ఎన్నో సందర్భాలలో చూసాము. ఇదీ దానికి కొనసాగింపే.
ఇ) వారు సంతోషాంధ్ర ప్రదేశ్, కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇది మనసుకు చాలా ఆనందం కలిగించింది.దానికి వారు కట్టుబడి ఉంటారని, ఉండాలని కోరుకుంటున్నాను. కొంతమంది వక్రమార్గాన పట్టిన కాలుష్యపెట్టుబడిదారులకు పొరపాటున తలొగ్గితే మాత్రం ప్రజలు పోరాడాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం మేము ముందే ఉంటాము.
ఈ) నిన్న నవ్యాంధ్రప్రదేశ్ పటంలో భద్రాచలం ముంపు మండలాలు- వేలాది చ॥కిమీ భూభాగం ఆంధ్రప్రదేశ్ భౌగోఌక సరిహద్దులనుంచి "మిస్" అయింది. గమనించండి. వారి సలహాదారులు ఏమైపోయారు?
** ఇప్పుడు "సింగపూరం"పై చంద్రబాబు, జగన్ గారల ఉవాచలు అయిపోయాయి. రేపటినుంచి కె.సిఅర్ గారు కొన్ని రోజులు "ఒహో సింగపూర్" అని మొదలుపెడతారేమో..
2. అ) నిన్న అందరూ మరిచిపోయినా, జగన్ మోహన్ రెడ్డిగారు దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుని జాతీయప్రాజెక్టుగా స్వీకరించాలని లేఖ వ్రాయడం ముదావహం. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టులలో అవినీతి సంగతి ప్రక్కనపెడితే అది సాకారమైతే రాయలసీమకేకాక, తెలంగాణలోఅనేక ప్రాజెక్టులకి, ఆదాచేసిన నీరు నీటి ఎద్దడి సమయంలో ఎనలేని ఉపయోగం కలిగిస్తుంది.
ఆ) వారు మొన్న అత్యుత్సాహంతో ప్రవర్తించే చెవిరెడ్డి భాస్కరరెడ్డిగారిలాంటివారికి అలా చేయకూడదని చెపుతూ, మిగతా సభ్యులకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం మంచిది.
ఇ)అయితే సభలో డా జెపి, దర్మాన. పయ్యావుల, సోమిరెడ్డిలాంటి సమస్యలపై మాట్లాడేవారి కొరత కొంత ఉంది. అందుకని ప్రతిపక్షంలోనుంచి గట్టివారిని తయారుచేసి సహేతుకమైన ప్రభుత్వ నిర్ణయాలపై సహకరిస్తూ, ప్రజాకంటమైన నిర్ణయాలను నిలదీస్తూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వైకాప వ్యవహరించాల్సి ఉంది.
3. మొన్నటిలా ఒకరిపై మరొకరు నీవు 10 మందిని పొట్టనబెట్టుకున్నావంటే 1000మందిని పొట్టన పెట్టుకున్నావంటూ రాజకీయపార్టీల పరస్పర ఆరోపణలు ప్రజలకు అసహ్యం తెప్పిస్తున్నాయి. అవసరమైతే ఆ అన్నింటిపై కేంద్ర సహాయంతో విచారణ జరిపి శిక్షలు వేయించి ఆ అంకాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. అదే విధంగా అధికార ప్రతిపక్షాలు కలిసి తెలంగాణలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్ మెంట్-1956 స్థానికత ఇతర సమస్యలపై, అలాగే కేంద్రం ఇచ్చిన హామీలపై పోరాడండి. అందరూ సంతోషిస్తారు. . - చలసాని

సర్విస్ మాన్

clip

ఎమైపొయినవ్ బిడ్డ... కనిపిస్తలెదు?


తెలుగుదేశం లొ ఉన్నప్పుడు మస్త్ పుబ్లిసిటి ఉండెది, టి వి లల్ల నీ హడావిడి చూసి అరె మన బిడ్డ మస్త్ ఎదిగిండు అని ఖుషి ఐతుండే. కెసీఅర్ సియం గిట్ల ఐన తర్వాత అస్సెంబ్లి ల నువ్వు రేవంత్ అన్న తొ కలిసి దడ్ ధడ్ లాడిస్తుంటె నెక్స్ట్ సియం నువ్వె అనుకున్నా. ఎమైందొ ఎమో తెల్లరెసరికి పార్టీ మర్చినవ్, కేసీఅర్ ని పొగిడినవ్ మల్లి అంతూ పొంతు లెవ్. ఈ రాజకీయలల్లొ గివన్ని కామన్ అనుకొవటం తప్ప ఇంకెం సెతాం.

నందికొండను నాగార్జునసాగర్‌గా మార్చి అన్యాయం చేశారు: కేసీఆర్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకా 40 నిమిషాల పాటు బేగంపేటలోనే ఉంటానని, తమ్మిడిహట్టిపై  ఒప్పంద పత్రాలు తీసుకురావాలని ఉత్తమ్‌కు ఆయన సవాల్ విసిరారు. తనది తప్పయితే రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌ వెళ్తానన్నారు. తమ్మిడిహట్టి ఒప్పందం జరిగి ఉంటే పదేళ్లుగా తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ దగ్గర డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్రాతో తెలంగాణను కలిపిందే కాంగ్రెస్సని నందికొండను నాగార్జునసాగర్‌గా మార్చి అన్యాయం చేశారని కేసీఆర్ ఆరోపించారు.

Sunday, August 14, 2016

అమరావతి ఆతిధ్యమండి




ఈ ఫోటోను చూస్తుంటే.. బస్సు ఆగిపోవడం వల్ల కారు డ్రైవరును లిఫ్టు అడుగుతున్నట్టుంది కదూ?! కానీ వీరు వాహనాలను ఆపుతున్నది అందుకు కాదు.. ఉచిత భోజనం చేసి వెళ్లమని పుష్కర యాత్రికులను ఆహ్వానిస్తున్నారు. గుంటూరు- అమరావతి మార్గంలోని నిడుముక్కలలో గ్రామస్థులు ఇలా రోడ్డుపై వాహనాలను ఆపి, అమరావతి వెళ్తున్న/వెళ్లి వస్తున్న పుష్కర యాత్రికులను పిలుచుకు వెళ్లి మరీ భోజనాలు పెడుతున్నారు. ఎక్కడి నుంచో వస్తున్న పుష్కర యాత్రికులకు గ్రామీణులు ఇలా పిలిచి మరీ అతిథ్యం ఇవ్వడం విశేషమే కదా!!

70వ స్వాతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు: తెలుగుదేశం యువసేన



- తెలుగుదేశం యువసేన

GHANTA SRINIVAS RAO's son, RAVI debuting as Hero with ‘KALAHASTI’


Ghanta Srinivas Rao Son, Ravi Debuting As Hero With ‘Kalahasti’

Jayanth Paranjee with debutant actor Ghanta Srinivasa Rao

Ravi Ghanta, son of AP Education Minister Ghanta Srinivasa Rao, is making his debut as an actor with Jayanth C. Paranjee's Kalahasti. The movie, that was launched on Thursday morning, marks the comeback of Jayanth, whose last film Theenmaar was released in 2011.
Jayanth had directed a Kannada movie in the meanwhile but the Telugu film industry has been feeling the lack of his presence since quite some time.
Ravi Ghanta expressed happiness about his debut with a movie with Jayanth. “I am  very lucky that my debut film is directed by an esteemed director such as  Jayanth,” says Ravi.
“This is a realistic story and I feel it is the perfect launch for Ravi. I am very happy to introduce him as the lead actor. Kalahasti is an action thriller, even though the title of the film may not sound like one,” says Jayanth, adding that the shooting will take place in Visakhapatnam and Kalahasti in two schedules.
Jayanth is a hit-maker who has produced movies like Preminchukundaam Raa, Premante Idhera, Takkari Donga, Eeshwar and Lakshmi Narasimha and hopes that this film too will bring him and the debutante actor success.

బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ కరాచీలో నిరసనలు

న్యూఢిల్లీ: పీఓకే, బలూచిస్తాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలతో స్ఫూర్తి పొందిన బలూచిస్తాన్ వాసులు క్రమంగా వీధుల్లో కథం తొక్కుతున్నారు. ఏకంగా కరాచీలో నిరసనలు చేపట్టారు. కరాచీ ల్యారీలోని ప్రభుత్వ భవనం నుంచి పాకిస్థాన్ జాతీయ జెండాను తొలగించి బలూచిస్తాన్ జెండాను ఎగురవేశారు. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పాక్ సైన్యం దమనకాండను ఆపెయ్యాలని కోరారు. బలూచిస్తాన్, పిఓకేలో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా కరాచీకి విస్తరించడంతో నవాజ్ సర్కారులో గుబులు మొదలైంది. నేడో రేపో ఇస్లామాబాద్‌లో కూడా బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు చెలరేగుతాయని నవాజ్ సర్కారు భావిస్తోంది.

"హాస్యానందం" ఆగష్టు 2016 సంచిక సౌజన్యం తో : లేపాక్షి కార్టూనిస్ట్


"హాస్యానందం" ఆగష్టు 2016 సంచిక సౌజన్యం తో 

ఒక మంచిమాట:లేపాక్షి కార్టూనిస్ట్







https://www.facebook.com/lepakshi.cartoonist

పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద మంత్రిగారికి ఇచ్చిన పత్రం: చలసాని



ఈ రోజు మేము రాష్ట్ర, ఆర్థిక, మరియు ఆరోగ్యశాఖామంత్రులని కలవడం జరిగింది.

1. పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజిన (పి.సి.పిఐఆర్) యొక్క స్వరూపాన్ని వ్యతిరేకించినందుకు ఆంధప్రదేశ్ ఆర్థికశాఖ, వాణిజ్యపన్నుల, శాసనసభ వ్యవహారాల మంత్రిగారిని అభినందిస్తూ వివరాలతో ఒక పత్రాన్ని అందించడం జరిగింది. ఏదో దేశంలో తుక్కుగా తీసిన యంత్రాలను మన తీరప్రాంతములో ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను జబ్బులలో ముంచేబదులు ఆ ప్రాంతంలో కాలుష్యరహిత పరిశ్రమలు, సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాథి, ఉద్యోగాలు, అభివృద్ది ఫలాలు అందించాలని కోరాము. పరిశ్రమలు అని చెప్పి కాలుష్య పరిశ్రమలను అనుమతించవద్దని విన్నవించాము. గౌరవ మంత్రివర్యులు వెంటనే సానుకూలంగా స్పందించారు. తరువాత కాలుష్య నివారణా సంస్థ ఇతర అధికారులతో ఆ విషయాలు మాట్లాడారు. ఆ విషయాన్ని తరువాత మాకు తెలియచేసినందుకు వారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఇది తక్షణ స్పందన అంటే.
(పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో మీ అందరూ భాగస్వామ్యం కావాలి. తొందరలోనే వివరాలు తెలియచేస్తాము)
2.బడ్జెట్ ని రూపకల్పనలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్దికి అన్ని వర్గాలకి సమానమైన న్యాయం జరిగేటట్లు చూడమని చెప్పి అభ్యర్థనా పత్రాలు అందించటం జరిగింది. యువతకి ఉపాథి కల్పనకి కూడా ప్రాధ్యాన్యత ఇవ్వాలని కోరాము. అత్యంత క్లిష్టపరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలు ఉన్న రాష్ట్రంలో ఆ భారం తలకెత్తుకోవడం ముళ్ళకిరీటాన్ని ఎత్తుకోవడమే. అయితే సుదీత్ఘమైన అనుభవం, పరిజ్ఞానం గల యనమల గారు దాన్ని సమర్థవంతంతా నిర్వహిస్తారని భావిస్తున్నాము.
3. ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం విషయంలో మరల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు రేపు పెద్దలను కలిసి ఈ విషయాన్ని సవరించాలని చెప్తామని చెప్పారు.
( కానీ దురదృష్టవశాత్తూ ఈ రోజు రాత్రి 7-8 చంద్రబాబుగారి అధికారిక స్పీచ్ (అమెరికా తరహాలో నుంచుని ఇచ్చే స్పీచ్) బాక్ డ్రాప్ లో మన 2000 సం॥ ఘన ఆంధ్ర వారసత్వం గల చారిత్రాత్మిక అమరావతీ పూర్ణకుభం స్థానంలో మరలా ఆధికారిక చిహ్నంగా చెంబు కొబ్బరికాయ కలశ చిహ్నాన్నే వాడారు. గౌ॥నీయులు మృదుస్వభావి పెల్లె రఘునాదరెడ్డిగారి దృష్టికి స్వయంగా తీసుకువెళ్ళాము. ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రిగారు కూడా మా లేఖ చదివారు. ఎవరు ముఖ్యమంత్రిగారిని ఇతరులని తప్పుదోవ పట్టిస్తున్నారు?)
.
4. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర మంత్రి రావెల గారు మరి కొంతమంది మంత్రులు శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నారని రోజూ వారి ప్రకటనల ద్వారా తెలుస్తుంది. అయితే తెదేపా నాయకత్వం ఎందుకని దాన్ని జాతీయ సమస్యలా చేయడం లేదో, భాజపాకు ఎందుకు అంత భయపడుతుందో అర్థం కాదు. చిదంబర రహస్యం ఏమై ఉంటుంది?
5. జాతివివక్షలాగా వాడుకోకపోతే తెలంగాణ మాస్ సర్వే మంచిపనే. కానీ కొందరు ఉద్యోగ మితృలు ఈ రోజు సచివాలయంలో దానిపై ఇలా ప్రశ్నించారు అ) దానిలో నేటివిటీ వచ్చిన సం॥ తీసేసామని ఒకరు చెబుతున్నా అది ప్రశ్నార్థకమే. ఆ) పైగా దానిలో కులం సర్టిఫికెట్ అడుగుతున్నారు. 1931 తరువాత భారతదేశం కులగణనను నిషేధించింది. కేవలం యస్.సి. యస్.టి ఇతర ప్రాయోజిత కులాల లెక్కలు మాత్రం తీసుకోవాలి. మొత్తం ఎందుకు తీసుకుంటున్నారు? ఇ) అందరి పుట్టిన సర్టిఫికెట్, భూముల పత్రాలు అడుగుతున్నారు అలాగే అనేక వివరాలు. ఏదైనా పథకాలను ఉపయోగించుకునేవారిని అడిగి తీసుకోవడం భావ్యమే.( దఌతులకి 3 ఎకరాలు ఉచితం కాబట్టి ఉందెంతో, ఇవ్వవలసింది ఎంతో లెక్కలు కావాలనేది, అలాగే ప్రభుత్వ పథకాల లబ్దిదారులకి అవసరం) కానీ అందరినీ అడగాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ చెల్లుతాయా? ఆఖరికి కోర్టులు స్వాంతన చేకూర్తుస్తాయా? కేంద్ర భాజపా ప్రభుత్వం ముందుకు వస్తుందా?
నాతోపాటు ప్రొఫెసర్ ప్రముఖ శాస్త్రవేత్త, బి.అర్. కలపాల, ప్రొఫెసర్. కాంతారావు, ప్రొ రాజు, శ్రీ పన్నాల సత్యన్నారాయణమూర్తి, డా॥ రాధాకృష్ణమూర్తి మొదలగువారితో పాటు విద్యార్ధి యువజన జె.ఎ.సి ప్రతినిధులు(1956-ఫీజు రియంబర్స్ మెంట్, ఉపాథి కల్పన కోసం పాపం పోరాడుతూనే )ఉన్నారు .

గౌ. శ్రీమతి "ఫురంధేష్వరి ' గారూ, మీ నాన్నగారి పేరుకి కళంకం తీసుకురాకండి:– చలసాని

గౌ. శ్రీమతి "ఫురంధేష్వరి ' గారూ, మీ నాన్నగారి పేరుకి కళంకం తీసుకురాకండి. మీకు మరిది గారి మీద వ్యక్తిగత కోపముంటే (some of the aspects may be genuine), దాన్ని కొన్ని నెలలనుంచీ ఎపి మీద చూపిస్తున్నట్లు లేదా? దయచేసి పద్దతి మార్చుకోండి. మొన్న ఒంగోలులో ప్రక్కన కూర్చుని నన్ను ఆ పైడికాయల గారిచే కూడా హీనంగా తిట్టించారెందుకు? విభజన సమయంలో మా ఎపి హక్కులపై మీయోక్క దారుణ నిర్లిప్తతపై మేమందరం మిమ్మల్ని బాధతో అన్నవి మనసులో పెట్టుకున్నారా?
అంత ఘొరంగా ఆంధ్రుల హక్కులకి పాతరేసి విభజన చేస్తున్నా, దిక్కుమాలిన అలాంటి (faulty) బిల్లు తెస్తున్నా, అన్నీ ముందే తెలిసినా(?!),
ఆయినా....... అప్పుడు ఆఖరి వరకూ మంత్రి పదవి పట్టుకుని వదలలేదు కదా మీరు? ప్రజల జ్ఞాపక శక్తి మీద తమరికి మరీ అంత చిన్న చూపా? తగదమ్మా. నమస్కారం.

Saturday, August 13, 2016

తారక్ పక్కనుంటే గూగుల్ అవసరం లేదు


‘‘తారక్ పక్కనుంటే గూగుల్ అవసరం లేదు’’ అని చెప్పారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘జనతాగ్యారేజ్’ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం ఘనంగా జరిగింది.
 
ఈ వేడుకకు హాజరైన బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘‘సీనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రాలేదు కానీ, జూనియర్ ఎన్టీఆర్‌తో యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. వయసులో నాకంటే చిన్నవాడైనా సరే తారక్‌ను ‘అన్నా’ అంటుంటా. చాలామందితో యాక్ట్ చేశాను కానీ, ఇతను ఒక గూగుల్ లాంటోడు. సెట్స్‌లో మేము కార్ల గురించి మాట్లాడుకున్నా, బాడీ డైట్ గురించి మాట్లాడుకున్నా, యానిమల్స్ గురించి మాట్లాడుకున్నా, మూజిక్‌ గురించి మట్లాడుకున్నా... 1970లోని ఫలానా సాంగ్ అంటే మేము గూగుల్ ఓపెన్ చేసి చూడాలి. తారక్ పక్కనుంటే అవసరం లేదు. దాని హిస్టరీ, పుట్టుపుర్వోత్తరాలు పాట పాడి వినిపిస్తాడు. సెట్స్‌లో ఫైట్ రిహార్సల్స్ జరుగుతుంటే చూస్తుంటాడు తప్ప తను రిహార్సల్స్ చేయడు. టేక్ చెప్పగానే డైరెక్ట్‌గా షాట్ చేసేస్తాడు. సరే, ఫైట్స్ కదా.. ప్రావీణ్యం ఉందేమో అనుకున్నా.. కానీ సాంగ్స్‌లో కూడా రిహార్సల్స్‌ చేయకుండా టేక్ చెప్పగానే వెళ్లి దడదడలాండిచేస్తాడు. సరే చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్ కదా అనుకున్నా. ఒక 5 పేజీల డైలాగ్ ఉంటుంది.. దాన్ని బట్టీపట్టకుండా.. జస్ట్ ఒక్కసారి సింపుల్‌గా చదివేసి దాన్ని కూడా దడదడలాడించేస్తాడు. తారక్‌ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇన్ని కళలు ఈ మనిషికి ఎలా వచ్చాయనిపిస్తుంది.’’ అని ఎన్టీఆర్ టాలెంట్ గురించి వివరించారు. చివరిగా సీనియర్ ఎన్టీఆర్ బొమ్మవైపు చూపిస్తూ.. ఆ పెద్దాయన ఆశీస్సులు తారక్‌కు ఉన్నట్టున్నాయి అని చెప్పారు.

Thursday, August 11, 2016

జూనియర్‌కు చంద్రబాబు ఆహ్వానం




హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలకు ఆహ్వానించింది. ఏపీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి జూనియర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానం పలికారు. దీనికి ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఎంతో కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న జూనియర్‌ను పుష్కరాలకు ఆహ్వానించడం వెనుక రాజకీయ కోణం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు మాత్రం జూనియర్ పుష్కరాలకు హాజరైతే అసలైన పండుగ వస్తుందని అనుకుంటున్నారట!

Monday, August 8, 2016

Mr. Karunanidhi is invited for Krishna Pushkaralu by Minister Ganta on behalf of AP Govt.,



Cordially invited DMK Chief Sri Kalaignar Karunanidhi and TN Assembly opposition leader Sri M. K. Stalin for ‪#‎KrishnaPuskaralu‬.

కచశేరా గారు ఘటనాఘటన సమర్ధులు. సన్నాసీ, హిట్లర్ అన్న నోటితోనే ఇంద్రుడని కీర్తించగలరు:::- చలసాని





కచశేరా గారు ఘటనాఘటన సమర్ధులు. సన్నాసీ, హిట్లర్ అన్న నోటితోనే ఇంద్రుడని కీర్తించగలరు. ఎప్పుడు ధిల్లీ వచ్చినా తమ రాష్ట్రాభివృద్ది గురించే మాట్లాడే ముఖ్యమంత్రి వీరేనని , నాలుగుమంచిమాటలు తాను ఒకనాడు తూలనాడిన నరేంద్రునిచేనే అనిపించుకోగలరు. "మిమ్మల్ని హైదరాబాదు వస్తే అరెస్టు చేస్తానన్నరోజులు కావండి ఇవి ... మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళం మేము" అని ప్రక్క ముఖ్యమంత్రి మీద పాతగాయాలు రేపెట్టగలరు కొందరు. నాచబానా గారు మిత్రపక్షం అయినా, వారి రాజధాని శంకుస్థాపనరోజు అలా రెండు మాటలు బాగా అనిపించుకోలేకపోయారు. అదే వాజపేయీ గారి సమయంలో "ఎపినుంచి నచబానాగారికి 43 మంది మొత్తం పార్లమెంట్ సభ్యుల అండ ఉన్నా, కేంద్రంలో మమ్మల్నిబ్లాక్ మెయిల్ చేయకుండా రాష్ట్రాభివ్రుద్దికోసం పాటుబడే ముఖ్యమంత్రి" అన్న ఆనాటి రోజలు గుర్తుకువచ్చి ఆయన ఈరోజు లోలోపల బాధపడుతూ ఉండవచ్చు. 2004 తరువాత భాజపాని వదిలేసినా మహాకూటమి కట్టినా ఫలితం దక్కలేదే.. స్వయంక్రుతాపరాధమా అనుకోవచ్చు.
--
అయితే ఎపికి వచ్చిన గుజరాత్ ప్రధానమంత్రి గౌ|| నదామో గారు గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు(యమునా మురికి నీళ్ళా) ఎలా ఇచ్చారో తెలంగాణలో కొంచెం స్టైల్ మార్చి ఒక చెంబులో నీరుపట్టి పోయారు గానీ మన ఆఖరిగా తెలుగురాష్ట్రాలకి ఇవ్వవలసినదానికంటే అదనంగా చిప్ప మాత్రం ఇస్తారేమో(మహారాష్ట్ర, గుజరాత్ కంటే)! కాని దాంట్లో రెండు అణాలు మాత్రం వేస్తారనే నమ్మకం ఉంది. ఇరువురు చంద్రులకంటే గుజరాతీ నరేంద్రుడి పవర్ ఎక్కువేగా. ఆయన ఎపికి రాయతీలతో కూడిన ప్రత్యేకతరగతిహోదా విభజన హామీల అమలులో చూపించే నిర్లిప్తత చూసి - చలసాని

పడవెళ్లి పోతోందిరా.... :::చలసాని

పడవెళ్లి పోతోందిరా.... 
ఎపికి రావలసిన రాయతీలపై సవరణలు ఆమోదం లేకుండా లోకసభలో జియస్టి బిల్లు గట్టుమీద మనల్ని వదిలేసి వెళ్ళిపోయే పడవలాగా వెళ్ళిపోతుంది. తీరం వదిలేస్తూంది..... ఓటింగ్ తెరచాప ఎత్తేసారు. నడుస్తోంది. పడవెళ్లిపోతోంది. ముందు నుంచీ నా వాదన అర్ధం చేసుకోలేకపోతున్నారో, నేను అర్ధం అయ్యేటట్లు చెప్పలేకపోతున్నానో, మీడియా చూపించడం లేదో... ఆఖరి సమయంలో ఇక ఇలా పోస్ట్ పెట్టాను. - చలసాని

Thursday, August 4, 2016

ఉమ్మడి ఏపీ హత్య 1996 నుండీ బీజేపీ, 99 నుండీ వైఎస్ విడివిడిగా పన్నిన కుట్ర!

వైఎస్ ఉంటె విభజన జరిగేది కాదనే అపోహ జనంలో సృష్టించటంలో బాగానే సఫలమయ్యారు వాళ్ళు.. ఎందుకంటే అడ్డగోలు విభజనకు మూలం వైఎస్సే అని తల్లి పిల్ల కాంగ్రెసులో ప్రతీఒక్కరికీ తెలుసు.. 

చెన్నారెడ్డి హయాములో కుర్చీకోసం పాతబస్తీలో మతకల్లోలాలు దొమ్మీలూ తెచ్చి శాంతిభద్రతల సమస్య అనే సాకుతో చెన్నారెడ్డిగారిని దింపేయటానికి వందలాదిమందిని బలి తీసుకున్న ఘనత వైఎస్ దే. 1996 తరవాత బాబు పాలనలో పాతబస్తీ కర్ఫ్యూ ల్లో ఆ దొమ్మీలను అమలు చెయ్యలేని వైఎస్ పన్నిన మరొక దొమ్మీ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హత్య..

వైఎస్ దగ్గర కుర్చీ రాజకీయం తప్ప 2004 కు ముందు తరవాత అనేం లేదండీ.. తెలంగాణకు నేను అడ్డూకాదూ నిలువూ కాదూ అని తెలంగాణాలో ,హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా పాస్ పోర్టులుకావాలా? అని సీమాంధ్రలో వైఎస్ చేసిన 2 నాలుకల రాజకీయం 2009 ఎన్నికల్లోదే.. 

హత్య చేసి తప్పించుకోవాలనుకున్న ఫాక్షనిస్టు దొమ్మీ హత్యలు చేసి దొమ్మీ కేసుతో ఎస్కెపయినట్టు అడ్డగోలు విభజనను రాజకీయఅనివార్యతగా ప్రమోట్ చేసి ఇతర పార్టీల భుజాలపైకి తుపాకీ చేర్చి ఏపీని కాల్చి పడేసి.. ఇతర పార్టీల పైకి నెట్టేసి చేతికంటిన నెత్తురు వదిలించుకోవాలని వైఎస్ చేసిన కుతంత్రమే ఇంతా కొంప ముంచింది.. 

చిన్నరెడ్లతో టీడిక్లరేషన్ ఒక్కటే కాదు, నిండా 12 సీట్లు కూడా గెలవలేని తెరాసకు 56 సీట్లిచ్చి జీరోగా ఉన్న కేసీఆర్ ను ప్రమోట్ చేసింది వైఎస్ కాదా?

తెరాసలో గెలిచింది 12 మందే అయినా అందులో 6 మందికి మంత్రిపదవులూ, కేసీఆర్ గారికి ఢిల్లీలో మంత్రి సింహాసనం కట్టబెట్టి జాతీయ స్థాయికి ప్రమోట్ చేసింది వైఎస్ కాదా ? మొన్నటి 2014 ఢిల్లీ మంత్రాంగంలో కేసీఆర్ అండ్ కో, ఏపీ ప్రజల స్వరాన్ని, ఆందోళనను ఢిల్లీలో అడ్డుకోగలిగిందీ, సమన్యాయాన్ని పెడచెవిన పెట్టింది.. ఈ ప్రమోషన్ పరిచయాలతోనే కాదా ? 

ఢిల్లీ మొకం కూడా తెలీని కేసీఆర్ కుటుంబ సమేతంగా సోనియాను దర్శించటమే కాకుండా విభజన ఒప్పందాలు చేసుకోవటం, అదే కాంగ్రెసును నిలువునా ముంచగల స్థాయికొచ్చారంటే వైఎస్ చలవ కాదా? 

ఇప్పటి తెరాస సొంత మీడియా కోసం రాజధానిలో కేసీఆర్ కుటుంబం సీమాంధ్రుల దగ్గర పబ్లిక్ గా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కళ్ళు మూసుకున్న వైఎస్ .. కేసీఆర్ అండ్ కోకు అప్పుడప్పుడూ నజరానాలనూ బాగానే కట్టబెట్టారని కూడా వినికిడి.. ఆ సొమ్ములే సీమాంధ్రుల పై తెరాస మీడియా విష ప్రచారాలకు ఇంధనం.. 

అసలు తెలంగాణ ఇచ్చేస్తామని 2004 కాంగ్రెసు మేనిఫెస్టోలో పెట్టించిందే వైఎస్ కాదా? 2004 మేనిఫెస్టో వైఎస్ కనుసన్నల్లో రూపొందిందన్నది ప్రజలందరికీ తెలుసు కదా.. 

విభజన పేరొచ్చిన ప్రతిసారీ హైకమాండ్ చూసుకుంటుందంటూ అధిష్టానంపైన ఒత్తిడి పెంచింది కూడా వైఎస్సే.. 2004 నాటి వాగ్దానాన్ని అమలు చేశామని 2014లో స్వయానా సోనియా ప్రకటించటాన్ని ఎలా విస్మరిస్తాం ?

ఉమ్మడి ఏపీ హత్య 1996 నుండీ బీజేపీ, 99 నుండీ వైఎస్ విడివిడిగా పన్నిన కుట్ర.. its a cold blooded murder... ఇద్దరి లక్ష్యమూ కుర్చీనే.. హత్య చేసి తప్పించుకోవాలనుకున్న ఫాక్షనిస్టు దొమ్మీ సృష్టించి దొమ్మీ కేసుతో ఎస్కెపయినట్టు, అడ్డగోలు విభజన పాపాన్ని అన్ని పార్టీలపైకీ నెట్టేస్తే చేతికంటిన నెత్తురు వదిలిపోతుందని కాంగ్రెస్ భ్రమ పడింది. అడ్డంగా మునిగింది.

ఏ 2 గాఉన్న బీజేపీ తల్లిని చంపి బిడ్డను బయటికే తీశారని డైలాగులతో, రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరిస్తామని 'ప్రత్యేక' హామీలతో, తెలుగుదేశం పొత్తుతో తప్పించుకోగలిగింది. ఇప్పుడు నమ్మించి మోసగించే తొలినాటి వైఖరి కొనసాగిస్తూ కాంగ్రెసుకు పక్కనే గొయ్యి తవ్వుకుంటోంది.. వీళ్లిద్దరి బతుకులు జనానికి తెలుసు

ఆంద్ర ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఒకోసారి ఒక్కడిగానైనా నిలబడే ఉంటా - చలసాని




నమ్మిన సిద్దాంతం కోసం, ఆంద్ర ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఒకోసారి ఒక్కడిగానైనా నిలబడే ఉంటా. అవతలవైపు ఎంత మేరునగదీరులైనా, పెద్ద రాజకీయనాయకులు వారి మీడియాలు, లేదా వేలాదికోట్ల కాంట్రాక్టర్లు అయినా నన్ను నాలాంటి వారిని తోక్కుతానన్నా నేను పట్టించుకోను. అదే తిక్కనుకుంటే అది నాకు మెండుగా ఉంది. నా మాట నమ్మినవారు వందమంది లేదా వేయమంది ఉన్నా ఒక్కొక్కరూ పదివేలమంది పెట్టు. ఆంధ్రా అంటే అభిమానమున్న పాత్రికేయ మిత్రులు లక్షమంది పెట్టు.
===
ఆంధ్రులకి అలాగే ప్రక్కన జిల్లాలవారికీ అందరికీ హైదరాబాదు పోలీసు ఉద్యోగ వ్యవస్థలో కూడా సమానమైన హక్కులు ఉండాలనే రాష్ట్రపతి శాసనంలోని 14యఫ్ మినహాయింపు ఉండాలని దాదాపు దశాబ్దం క్రితం ఉన్నత న్యాయష్టానాన్ని ఆశ్రయించాను. అప్పుడు మా న్యాయవాది ఇప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు. అప్పుడు దానిపై ఎన్ని సంవత్సరాలు ఎంతగా కృషి చేసానో ఆరోజు ఇన్వాల్వ్ అయిన పోలీసు అధికారులకి తెలుసు. తరువాత ధిల్లీలోజరిగిన న్యాయపోరాటంలో ప్రక్కనే ఉన్నాను. (నాకు అక్కడ కేసు వేసే అర్హత లేదు- 6 సంవత్సరాలు కేసునడించింది). ఆఖరికి న్యాయం గెలించింది.
కాని, కాని...
అర్ధం పర్ధం తెలియని నాయకులు ఒక మేధావి యం.యల్.ఎ గారి బ్రీఫింగ్ వల్ల ఏకమై అది తీయాలని మూకగా మారి(ఎపి శాసనసభ్యులని మాత్రమే అంటున్నాను) ఏకగ్రీవంగా తీయించివేయించారు. తరువాత ఆ స్పీడు శాసనసభ్యుడి గారి మీదే అసెంబ్లీ ఆవరణలోనే దాడిజరిగిందనేది వేరే సంగతి. నేను అప్పుడు అందరి వద్దకు వెళ్లాను లేదా మాట్లాడాను. హైదరాబాదు పోలీసు వ్యవస్థమాత్రం ఉమ్మడిగా ఉండాలనే పాయింట్ అలాగే ఉంచాలి, పొరపాటున విభజన అయి తెలంగాణకువెళ్ళినా కూడా ఉమ్మడి పోలీసు భర్తీ వ్యవస్థ కొనసాగుతుంది. అది అవసరం అని కూడా చెప్పాను. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలంటే మా మిత్రులు కోటగిరి గారి మాట విని కొంచెం తడవు అక్కడ అడ్డుకుంది చిరంజీవి గారే. ఆర్నెల్ల ప్లాంటెడ్ ఉద్యోగ నాయకుడి వద్దకు పోలీసులు ఇలా ఉంది టి,యన్.జి.ఒలు మద్దతు ఇచ్చినట్లు మీరు కూడా ఇవ్వాలి అంటే, ఆ నాయకుడు చూపించిన అహంకార ప్రవర్తన మరవులేరు.
కాని. రివ్యూ పిటిషన్ మరల సుప్రీంకోర్టులో కొట్టేసారు. న్యాయం మరల గెలిచింది అన్నమా ఆశలు అడియాశలు చేసి మరల శాసనసభలో మూకగా అందరూ దాన్ని తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఆంద్ర శాసనసభ్యులు కూడా ' సోయి' కోల్పోయారు. అప్పుడు ఒక్కడినే శాసనసభ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిశ్చేష్టుడనై కొద్దితడవు కూలబడిపోయాను. నేను నాతొపాటు ఓ పదిమంది పోలీసు అధికారులు ఎంతబాధపడ్డామో. అయితే ఆ శాసనసభ్యులు చేసింది న్యాయమైనదని నేను ఒప్పుకోను. అప్పుడూ, ఇప్పుడూ ఒంటరిగానైనా పోరాడుతాననే గుండెనిబ్బరం నాకు ఉంది. అది, ఆంధ్రుల హక్కులు, తెలుగువారికోసం, విద్యుత్ సమస్య, నీటిపారుదల, ఉద్యోగ సమస్యలు, పర్యావరణ రక్షణ, తెలుగుభాషని నిలబెట్టుకోవడం ఏదైనా సరే.
నేడు.. జియస్టి బిల్లు వచ్చినప్పుడు అది సరళీకృతం చేయడానికి కొంతవరకూ ఉపయోగమే. కాని మన యంపిలు దిల్లీలో అందరికీ చెప్పి ఎపికి రావలసిన విభజన హామీల అమలుకి బిల్లుల్లో ఉన్న సూత్రాలు హాని చేస్తాయని, అలాగే రాష్ట్రాల అధికారాలకు కొంత దెబ్బ అని చెప్పలేకపోయారు. కనీసం మనసంగతేమిటని గొడవ అన్నాచేయలేదు(Honestly). అనేకమంది తమిళసోదరులు బయటికి వాకౌట్ చేసారు. ఇప్పుడు అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది అంట.
కాని, కాని ఇందాక మన యంపిలు చేసింది తప్పు అని నేను నాలాంటి వారు కొద్దిమందిమైనా చాటుతాం. 14యఫ్ విషయంలో నేను నాతొ పాటు పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్ పడిన తపన, శ్రమ, మరచిపోలేము. మావాదనే నాటికీ నేటికీ ఏనాటికీ నిజం,. - చలసాని

Wednesday, August 3, 2016

జూన్ 15వ తేదీ నుంచి వృద్ధులకు బస్‌టికెట్‌లో 25 శాతం రాయితీని ఇచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది


జూన్ 15వ తేదీ నుంచి వృద్ధులకు బస్‌టికెట్‌లో 25 శాతం రాయితీని ఇచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలపడంతో కార్యాచరణ, విధివిధానాలపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించింది. కనీసం 60 ఏళ్ల వయసు, ఆపై ఉన్న వారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణించి, వారికి టికెట్‌ రాయితీ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటగా ముందస్తు రిజర్వేషన్‌ ఉన్న బస్సుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. , ఒకవేళ జాప్యం జరిగితే జులై 1వ తేదీ నుంచి తప్పనిసరిగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సీనియర్ సిటిజన్లు 25 శాతం రాయితీ పొందేందుకు టికెట్‌ను ముందస్తుగా తీసుకునే సమయంలో పేరు, ఫోన్‌ నెంబర్‌ వంటి వివరాలతో పాటు వయసును పేర్కొనాల్సి ఉంటుంది. వయసు ధ్రువీకరణకు ఆధార్‌తో పాటు ఇంకా ఏయే గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత వయసు ధ్రువీకరణ కార్డు లేకుంటే రాయితీగా ఇచ్చిన 25శాతం ఛార్జీని తిరిగి వసూలు చేస్తారు. ముందుగా రిజర్వేషన్‌ బస్సుల్లో వృద్ధులకు రాయితీ అమలుతీరును పరిశీలించి, ఆ తర్వాత తెలుగు వెలుగు (ఆర్డినరీ) సహా ఆర్టీసీకి ఉన్న మొత్తం 12 వేల బస్సుల్లో రాయితీని విస్తరించే యోచనలో ఉంది ఏపీఎస్‌ఆర్టీసీ.

'బాబు వస్తే జాబు వస్తుంది'





'బాబు వస్తే జాబు వస్తుంది' అని ఆశించిన యువత 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్యపాత్ర పోషించారు. అది ఓర్వలేని ప్రతిపక్షం 'బాబు వచ్చాడు... జాబేదీ?' అంటూ యువత కనిపించినప్పుడల్లా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. రెండేళ్ళ పాలన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువతకు రెండేళ్ళలో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు చంద్రబాబు. దీంతో ప్రతిపక్షానికి గొంతులో వెలక్కాయ అడ్డుపడినట్టయ్యింది. ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో యువతకు వచ్చిన ఉద్యోగాల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.5 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. ఒక్క భాగస్వామ్య సదస్సులోనే 4.8 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. సత్వర అనుమతులు, భూకేటాయింపులు, ఏకగవాక్ష విధానం వంటి వాటి సంగతి అలా ఉంచితే ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రూ.2వేల కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి పారిశ్రామిక వర్గాల్లో భరోసానిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో ఇప్పటికే 175 ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు 94వేల మందికి ఉపాధి లభించింది. మరో 180 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పెట్టుబడుల హామీలన్నీ ఆచరణలోకి వస్తే మరో 7.88లక్షల మందికి ఉద్యోగాలొచ్చే అవకాశముంది.
డీఎస్సీ 2014కు 4.20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.96 లక్షల మంది పరీక్షరాశారు. జూన్ 2, 2015న పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. అయితే కోర్టు కేసులతో పలు దఫాలుగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. పరిపాలన ట్రెబ్యునల్‌ నుంచి ఈమధ్యే స్పష్టత రావడంతో నియామకాల కోసం ఏడాదిన్నరగా నిరీక్షిస్తున్న డీఎస్సీ-2014 అభ్యర్థులకు ఇటీవలే చంద్రబాబు చేతులమీదుగా నియామకపత్రాలు అందించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి 10వేల మంది నూతన ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. ఇక 3,634 వ్యవసాయ విస్తరణాధికారుల ఖాళీలు సహా, గిరిజన, వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ జరిగింది.
రానున్న కాలంలో 20 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, త్వరలో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఇవేకాకుండా 6 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఆంధ్రరాష్ట్రం లో పుష్కర ఘాట్స్ వివరాలు

Ghat Name Address
Bhavani Ghat
Bhanipuram, Vijayawada


Durga Ghat
Near Prakasam Barrage, Beside Model Guest House, Vijayawada

Ferry Ghat
Ibrahimpatnam

Krishnaveni Ghat
Vijayawada

Sangamam Ghat
Ibrahimpatnam

Padmavathi Ghat
Opp.PNBS, Krishna Lanka, Vijayawada

Punnami Ghat
Bhavanipuram, Near Punnami Hotel, Vijayawada
Directions
Vijaya Krishna Ghat
Kanakadurgamma Varadhi, Vijayawada (Urban)

Gollapudi Main Ghat
Gollapudi, Vijayawada

Surayapalem Ghat
Suraypalem, Gollapudi, Vijayawada

Guntupalli Ghat
Guntupalli, Ibrahimpatnam Mandal

Tummalapalem-1 Ghat
Tummalapalem, Ibrahimpatnam Mandal

Tummalapalem-2 Ghat
Tummalapalem, Ibrahimpatnam Mandal

Damuluru Ghats-1 & 2
Damuluru, Ibrahimpatnam Mandal

Vekanuru-1 Ghat
Vekanuru, Avanigadda

Vekanuru-2 Ghat
Vekanuru, Avanigadda

Edlanka Ghat
Edlalanka, Avanigadda

South Chiruvolu Lanka Ghat
Chiruvolu Lanka, Avanigadda

Kothapeta Ghat
Kothapeta Village, Avanigadda

Puligadda Ghat
Puligadda Village, Avanigadda

K.Kothapalem Ghat
Kokkiligadda Kothapalem, Mopidevi

Bobbarlanka Ghat
Bobbarlanka, Mopidevi
Directions
Mopidevi Warf Ghat
Mopidevi

Kosuruvaripalem Ghat
Kosuruvaripalem, Mopidevi
Pedakallepalli Ghat Pedakallepalli, Mopidevi Mandal
Pedakallepalli Ghat-1 Pedakallepalli, Mopidevi Mandal
Pedakallepalli Ghat - 2 Pedakallepalli, Mopidevi Mandal
Hamsaladeevi Ghat Hamsaladeevi, Koduru Mandal
Ullipalem Ghat Ullipalem, Koduru Mandal
Salempalem Harijanawada Ghat Salempalem, Koduru Mandal
Pittalanka Padavalarevu Ghat Pittalanka, Koduru Mandal
Kummaripalem Ghat Kummaripalem, Koduru Mandal
V.Kothapalem Ghat V.kothapalem, Koduru Mandal
Royyuru Ghat Royyuru, Thotlavalluru Mandal
Vallurupalem Ghat Vallurupalem, Thotlavalluru Mandal
Thotlavalluru Ghat Thotlavalluru
Chagantipadu Ghat Chagantipadu, Thotlavalluru Mandal
Devarapalli Ghat Devarapalli, Thotlavalluru Mandal
Illuru -1 Ghat Illuru, Thotlavalluru Mandal
Illuru - 2 Ghat Illuru, Thotlavalluru Mandal
Illuru - 3 Ghat Illuru, Thotlavalluru Mandal
Yanamalakuduru Ghat Yanamalakuduru, Penamaluru mandal
Pedapulipaka Ghat Pedapulipaka, Penamaluru mandal
Chodavarm Ghat Chodavarm, Penamaluru mandal
Kasaranenivaripalem Ghat Kasaranenivaripalem, Penamaluru mandal
Gani Atkuru Pushkar Ghat Gani Atkuru, Kanchikacherla Mandal
Chevitikallu Pushkar Ghat Chevitikallu, Kanchikacherla Mandal
Kunikinapadu Pushkar Ghat Kunikinapadu, Kanchikacherla Mandal
Munnaluru Pushkar Ghat Munnaluru, Kanchikacherla Mandal
Punnavalli Ghat Punnavalli, Chandarlapadu Mandal
Kasarabada Ghat Kasarabada, Chandarlapadu Mandal
Ustepalli Ghat Ustepalli, Chandarlapadu Mandal
Gudimetla Ghat Gudimetla, Chandarlapadu Mandal
Gudimetla - 2 Ghat Gudimetla, Chandarlapadu Mandal
Popuru Ghat Popuru, Chandarlapadu Mandal
Sri Vedadri Village Ghat Vedadri, Jaggaiahpeta Mandal
Sri Yogananda Lakshmi Narasimha Swamy Vari Ghat Vedadri, Jaggaiahpeta Mandal Directions
Sri Ravirala Village Ghat Ravirala, Jaggaiahpeta Mandal
Sri Bhavani Muktheswara Swamy Vari Ghat Mukteswarapuram, Jaggaiahpeta Mandal Directions
Uttaravahini Ghat Mukteswarapuram, Jaggaiahpeta Mandal
Vadapalem Ghat Vadapalem, Machilipatnam Mandal Directions
China Yadara Ghat China Yadara, Machilipatnam Mandal
Bhogireddy palle Ghat Bhogireddy palle, Machilipatnam Mandal
Papavinasama Ghat Ghantasala
Srikakulam Ghat Srikakulam, Ghantasala Mandal Directions
Ramudupalem Ghat Ramudupalem, Challapalli Mandal Directions
Inapuru Ghat Inapuru, Pamidimukkala Mandal Directions
T.Kothapalem Village Ghat
T.Kothapalem Village, Nagayalanka
Directions
Sri RamaPada Kshetram Ghat
Nagayalanka
Directions
Nagayalanka 7th Ward Ghat
Nagayalanka
Directions
Brahmananda Puram Ghat
Nagayalanka
Directions
Gullalamoda Ghat
Gullalamoda, Etimoga Village, Nagayalanka
Directions
TOLL FREE NUMBER-----12890
RAILWAY ENQ.,-------
133/ 0866 -2577775
RTC Enquiry-----
0866 – 2522200
Krishna Pushkaralu Control Room-----------
8333000020

కృష్ణా పుష్కరాల యాత్రికులకు విన్నపము




పుష్కర యాత్రికులకు ఒక విన్నపము.
కృష్ణా పుష్కరాలు ఆగష్టు 12 వ తేదీ నుండి
ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సారి యాత్రీకులందరూ విజయవాడలో నే
పుష్కర స్నానాలు చేయటం సాధ్య పడక పోవచ్చు.
ముఖ్యంగా రహదారి గుండా ప్రయాణాలు చేసే వారు
చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా
ఉంది.
కారణం
విజయవాడలో గత సంవత్సరం నుండి జరుగుతున్న
Fly Over మరియు రహదారి మరమ్మత్తు పనులు
ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు.
ఎన్నేళ్ళు పడుతుందో ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం
అసాధ్యం .
ఈ ఏడాది అంతా హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు మరో రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని తీవ్ర అసౌకర్యానికి లోనై తిట్టుకుంటూ , పసి
పిల్లలతో తీవ్ర అవస్ధల పాలవుతూ ప్రయాణాలు
చేస్తున్నారు.
అలాంటిది పుష్కరాల సమయంలో పట్టే ఆలస్యాన్ని
మనం ఊహించగలమా ?
చాలా అవస్ధల పాలు కావలసి వస్తుంది.
దీనికి మా సలహా !
పుష్కర స్నాన ఫలితం నది పరీవాహక ప్రాంతంలో ఎక్కడ
చేసినా వస్తుంది.
విజయవాడ లోనే చెయ్యాలన్న నియమం పెట్టుకోవద్దు.
ముఖ్యంగా హైదరాబాదు వైపు నుండి వచ్చేవారు
విజయవాడ లో దిగే ప్రయత్నం చేసే కన్నా తెనాలి
లో దిగితే బస్టాండు వద్ద మంచి హోటల్స్ మరియు
బస చేసే సౌకర్యాలు ఉన్నాయి.
విశ్రాంతి తీసుకొని వల్లభాపురం , గాజుల్లంక , చిలుమూరు ఇత్యాది కృష్ణా నదీ పరివాహిక ప్రాంతాలున్నాయి.
హాయిగా పుష్కర స్నానం చేసుకొని దైవ దర్శనం
కూడా చేసుకోవచ్చు .
లేదా
రేపల్లే కు హైదరాబాదు నుండి రైలు సౌకర్యం ఉంది.
చక్కగా రేపల్లె వెడితే రేపల్లె లో ఇప్పుడు మంచి
హోటల్స్ వసతి సౌకర్యాలు ఉన్నాయి.
పెనుమూడి రేవులో స్నానం చేసుకొని మోపిదీవి
సుబ్రహ్మణ్య స్వామి వారిని , శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును , అడవుల దీవి , మోర్తోట , హంసల దీవి ,
ఇలా ఎన్నో చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలను దర్శించు
కోవచ్చు.
ఇదంతా కృష్ణా నది పరీవాహిక ప్రాంతం.
సంగమ ప్రదేశం.
పరమ పవిత్రం.
మరో ముఖ్యమైన విషయం.
పుష్కరాలు మొదటి రోజునే అదీ పుష్కరుడు ప్రవేశించబోయే సుముహూర్త సమయంలోనే పుష్కర
స్నానం చెయ్యాలనే మూఢ నమ్మకాలు వదిలేయండి.
ఆ పుష్కరాలు 12 రోజులలో ఎక్కడ చేసినా ఏ ప్రాంతంలో స్నానం చేసినా సంపూర్ణమైన ఫలితం
లభిస్తుంది .
అనవసరమైన మూఢ నమ్మకాలతో మీరు అవస్ధల పాలై
మీ కుటుంబ సభ్యులను పసి పిల్లలను చిన్నారులను
అవస్ధల పాలు చేయవద్దు.
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020