Friday, April 18, 2014

Mangalagiri the capital for Seemandhra?

Sources confirm that the groundwork for finding a new capital began well before the tabling of T-Bill. In total, Guntur district has 1,34,420 hectares of forest land, one among the highest in the State, and a major portion of it falls under degraded and rock outcrop categories.

The government is mulling over building a new capital of residuary Andhra Pradesh in the forest land close to Mangalagiri, if indications from the government are to be believed.
A highly placed source in the government said a secret dossier from the Secretariat has been sent to the Ministry of Forest and Environment for declassification of forest land close or Mangalagiri, located between Vijayawada and Guntur.
Location of capital city for Andhra Pradesh has been a bone of contention ever since the issue of State bifurcation gained momentum. Leaders and prominent citizens from respective districts marketed their regions.
But, according to sources, the groundwork to find a capital city began at least two months before the A.P. Reorganisation Bill was actually tabled in the Parliament and now, the place has almost been finalised.
In total, Guntur district has 1,34,420 hectares of forest land, one among the highest in the State, and a major portion of it falls under degraded and rock outcrop categories. A small portion of about 2,250 hectares near Nizamapatnam has been earmarked as mangroves, said the District Forest Officer of Guntur K. Lohitasyudu.
The total extent of the forest land at Mangalagiri block under Tadepalli reserve is about 485 hectares, and it is believed that this is being targeted for declassification to host the new capital.
With the region’s close proximity to both the cities of Vijayawada and Guntur, this could be the chosen area, said Confederation of Indian Industry (CII) core committee member J.S.R.K. Prasad.
Earlier in 1960, about 214 acres of forest land in this region was declassified for setting up of T.B. sanatorium and over 180 acres was declassified to establish the 6 Andhra Pradesh Special Police battalion headquarters with firing range.
The national highway cuts through this forest land and Acharya Nagarjuna University. There is also a proposal to occupy the ANU campus as part of the capital project.
Agreeing that the region was in focus even since the new capital discussion began, former Rajya Sabha member from Guntur, Yalamanchili Sivaji, however said, “I don’t understand why the government needs land in hectares when the entire capital infrastructure can be covered in 50 to 60 acres”.

రాజుగారి చీకటి పాలన!

అసలే రాజు గారు.. పాలన కూడా బాగుంటుందని ఆశించారు.. అత్యధిక ఓట్లతో గెలిపించారు.. ఒక మాజి ముఖ్యమంత్రి పుత్రుడు(మాజే యం.పి) కావడంతో కష్టాలు తీరుతాయని ఆశించారు.. గిరిజన గూడల్లో వెలుగులు ప్రసరిస్తాయని, సౌకర్యాలు కలుగుతాయని భావించారు. ఐదేళ్లు గడిచిపోయాయి. కనీస సదుపాయాలను పక్కన పెడితే కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. ఇప్పటికీ చీకటే రాజ్యమేలుతోంది.

-ఇప్పటికీ విద్యుత్ సరఫరాకు నోచుకోని గిరిజన గ్రామాలు
-పొలంగట్లే రహదారులు
-బోర్లు లేక తాగునీటికి కటకట
-పట్టించుకోని 
యువరాజు

పులివెందుల, న్యూస్‌లైన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గిరిజన గూడలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, గిరిజనుల సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్నామంటూ పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకొస్తున్నా పరిస్థితి పూర్తి భిన్నం. వారి గూడలకు వెళ్లి చూస్తే సమస్యలే సాక్షాత్కరిస్తాయి. రాష్ట్ర ఒక మాజి ముఖ్యమంత్రి పుత్రుడు(మాజే యం.పి) సొంత నియోజవర్గం పరిధి పులివెందుల లో విద్యుత్  సదుపాయానికి నోచుకోలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రాజుగారి పాలన ఎంత మేరకు సాగించారో అవగత మవుతుంది.  

దీనికోసం రచ్చబండ, గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లలో వందల సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీంతో సుమారు 250 మంది గిరిజనులు చీకటిలోనే కాలం గడుపుతున్నారు. పొద్దుపోతే విష సర్పాలు, అటవీ జంతువుల భయంతో జీవనం సాగిస్తున్నారు. చదువులు సాగక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు పంచాయతీ పరిధిలోని పలు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు.

పొలం గట్లే ఈ గ్రామాల ప్రజలకు రోడ్లు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు భవనాలు లేవు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు  చేయక పోవడంతో గిరిజన పిల్లలు చదువులకు, పౌష్టికాహారానికి నోచుకోలేదు. తాగునీటికి కటకటే. బోర్లు లేకపోవడంతో కొండ ధారతోనే దాహం తీర్చుకుంటున్నారు. కనీస సదుపాయాలు కల్పించని యువరాజు... పదవికోసం మళ్లీ పోటీచేస్తున్నారని తెలుసుకున్న గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన పాలనకు స్వస్తి పలికి స్థానిక సమస్యలు తెలిసిన స్థానిక నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

లెజెండ్ కి భయపడ్డ జగన్


హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలకృష్ణ స్వయంగా పోటీలో ఉన్నందున లెజెండ్ సినిమాను నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం నేతలు ఆ జిల్లా కలెక్టర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

లెజెండ్ కి భయపడ్డ జగన్ అని సినీ వర్గాల గుసగుసలు!!!

పరిటాల సునీతతో బాలకృష్ణ భేటీ

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. జిల్లాలో టీడీపీ విజయావకాశాలు, రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా శనివారం టెక్కలి నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ లేపాక్షి, చినమత్తూరు మండలాల్లో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ప్రత్తిపాడులో టీడీపీ రెబల్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన కందుకూరు వీరయ్య

టీడీపీ టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్న కందుకూర వీరయ్య ప్రతిపాడులో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు మాచర్లలో స్థానికేతరుడికి టికెట్ కేటాయించారంటూ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Thursday, April 17, 2014

నీకు వొట్ వెయ్యమని ఎలా అడుగుతావ్ జగన్?

అయ్యా జగన్...

మీ అయ్య గవర్నమెంట్ ఆసుపత్రుల్లొ సదుపాయాలు కల్పించకుండ ప్రైవట్ ఆసుపత్రులకి అడ్డంగా దొచిపెట్టాడు... యెవడబ్బ సొమ్మని పంచాడు. అధి మే అయ్య సంపదించిన సొమ్మా? దాని గురించి లబ్ది పొందినవాల్లకి ఇంటింటికి ఉత్తరాలు పంపించటం యెమన్నా న్యాయమా?

మీ అయ్య ముఖ్యమంత్రి కాకముందు నువ్వు కట్టిన ఆదాయపు పన్ను ఎంత? ఇప్పుడు నువ్వు సబ్మిట్ చెసిన అఫిడవిట్ లొ నువ్వు చుపిన 430 కొట్లు ఎలా వచ్హాయ్?

ఇవన్ని చుసిన నన్ను నువ్వు వొట్ వెయ్యమని ఎలా అడుగుతావ్? 

Wednesday, April 16, 2014

స్టేట్ దాటటానికి సి.బి.ఐ కోర్ట్ పర్మిషన్ కావాలి

వై.యస్. జగన్ కి స్టేట్ దాటటానికి సి.బి.ఐ కోర్ట్ పర్మిషన్ కావాలి. ఈ వ్యక్తి మన స్టేట్ ని బాగుచేస్టాదంటె నమ్మి మనం వొట్ వేద్దామా?

హైటెక్ సిటీ ని నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించిన అనుభవం ఉన్న వ్యక్థి కి వొట్ వెద్దామా?

ఆలొచించండి మిత్రులారా!!!

Tuesday, April 15, 2014

ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు : ఫ్రత్తిపాటి


ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు. వాటన్నింటికి అతీతంగా వ్యవహరించండి. మీ ఊళ్లో వాళ్లను కూడా చైతన్యపరచండి. అప్పుడే  మీ భవిష్యత్తు బావుంటుంది. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొంటే నష్టం కలుగుతుందని ఓటర్లకు అవగాహన కలిగించాలని ఫ్రత్తిపాటి అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు. రాధాకాష్ణ మాట్లాడుతూ అభ్యర్థుల కులం, మతం, ప్రాంతం చూడొద్దన్నారు. అభ్యర్థుల గుణం చూసి ఓటేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు నేడు తాడు, బొంగరం లేకుండా చేశారు. ఈ క్లిష్ట సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. రాజకీయ వ్యవస్థ అంతా కుళ్లిపోయిందన్న భావన నుంచి విద్యార్థులు బయటికి రావాలని, అంతా ప్రభుత్వమే చేయాలన్న ధోరణి సరికాదన్నారు. ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగానికి నేను అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడం వలనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ఆకర్షితులు కావడం వలన నేడు ఇంజనీరింగ్ విద్యలో క్వాలిటీ తగ్గిపోయి పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ చురుకుగా ఉండటం వలనే 2జీ లాంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఉన్నంతలో మంచి వాళ్లను ఎన్నుకోవాలన్నారు. నోటా ఓటుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.

తెలంగాణ ఇచ్చింది...తెచ్చింది కాంగ్రెస్సే : ఎంపీ రాజయ్య

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని, తెలంగాణ ఇచ్చింది...తెచ్చింది కాంగ్రెస్సే అని ఎంపీ రాజయ్య అన్నారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ది అధికార దాహమని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో స్వపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించామని, మమ్మల్ని ద్రోహులనడం సరికాదన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు. అధికార దాహంతోనే కాంగ్రెస్‌ను కేసీఆర్ కాదనుకున్నారని మరో ఎంపీ గుత్తా సుఖేందర్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ సెగ్మెంట్లలో అమరవీరుల కుటుంబాలకు ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

కేశినేని నానికి బి ఫామ్ అందజేసిన చంద్రబాబు


విజయవాడ పార్లమెంట్ స్థానానికి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ లోక్‌సభ అభ్యర్థి కేశినేని నానికి బి ఫామ్ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. చివరి నిముషం వరకు బెజవాడకు చెందిన పొట్లూరి వరప్రసాద్, కేశినేని నాని... ఈ ఇద్దరిలో ఎవరికి సీటు ఇవ్వాలన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఇరువురికి మద్దతు తెలిపిన నేతలు చంద్రబాబు నివానికి చేరుకుని చర్చలు జరిపారు.
పొట్లూరి వరప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వాలని ఆయన తరఫున రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారావేత్తలందరూ టీడీపీ «అధ్యక్షుడు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ బీజేపీతో పొత్తుపెట్టుకుని ముందుకు వెళుతున్న తరుణంలో... గతంలో జగన్‌తో వ్యాపార సంబంధాలు ఉన్న పొట్లూరి వరప్రసాద్ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనకు టిక్కెట్ ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భావనతో చంద్రబాబు మొదటి నుంచి పొట్లూరికి సీటు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా బాబు వివరించినట్లు తెలియవచ్చింది. హేమా హేమీలు పొట్లూరికి సిఫారస్ చేసినప్పటికీ చివరికి కేశినేని నానికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకుని, బి ఫామ్ కూడా అందజేశారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళారు.

Monday, April 14, 2014

నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగింద?



నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగిందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణకు అనంతపురం జిల్లా హిందూపురం టిక్కెట్టు ఖరారైంది. అయితే హరికృష్ణ తనకు కూడా టిక్కెట్టు కావాలని చంద్రబాబుని కోరారు. అయితే ఈ విషయంపై ఆదివారం హరికృష్ణ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హరికృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ పాల్గొన్నారు. సమావేశంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఇద్దరూ చంద్రబాబు, బాలయ్యతో ఫోన్లో చర్చలు జరిపారు. హరికృష్ణకు పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే హరికృష్ణను గెలిపించుకునే బాధ్యతతో పాటు ఎన్టీఆర్‌ హిందూపూర్‌లో బాలకృష్ణతో కలిసి ప్రచారం చేయాల్సి ఉంటుంది.
               
అలాగే ఎన్టీఆర్‌ నారా లోకేష్‌తో కలిసి కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి. ఈ షరతులకు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ అంగీకరించారు. దీంతో హరికృష్ణకు పెనమలూరు సీటు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు నందమూరి-నారా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్‌  పూడినట్టు అయ్యింది.

పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు... జై ఫ్రత్తిపాటి

తెలుగు దేశం పార్టీని గెలిపించే ప్రయత్నంలో
మీరు కూడా బాగస్వాములు కండి...

పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు

జై ఫ్రత్తిపాటి



జన్మభూమి రుణం తీర్చుకుంటా: కోడెల


సత్తెనపల్లి: సత్తెనపల్లి నా జన్మస్థలం. నేను కోరుకున్న నరసరావుపేటను కాదనుకుని నన్ను కోరుకున్న సత్తెనపల్లికి రావడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం రాత్రి కాకతీయ కల్యాణ మండపంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు యెలినీడి రామస్వామి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ తల్లి ఒడి నుంచి ఈ తల్లి ఒడికి చేరానన్నారు. కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రజలకు వివరించాలన్నారు. నా మీద అభిమానం చూపిస్తున్న సత్తెనపల్లి ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కోడెల నాయకత్వం వర్ధిల్లాలంటా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొందరు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించిన వారు సమావేశానికి వచ్చారని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తెలుగుదేశం పార్టీకి జనసేన సంఘీభావం

తెలుగుదేశం పార్టీకి జిల్లాలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేస్తోన్నారు. టీడీపీ నాయకులు నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచారాల్లో జనసేన కార్యకర్తలు పార్టీ జెండాలతో వచ్చి మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జిల్లా పర్యటనలో తొలిసారిగా జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి ముందుకు నడిచాయి. దీంతో తెలుగుతమ్ముళ్లు ఎన్నికల ప్రచారంతో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో' నినాదంతో రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనదని, ఏ ఒక్క రాజకీయ పార్టీ గెలువు అవకాశాలు దెబ్బతీయ దలుచుకోలేదని స్పష్టం చేశారు. అలానే బీజేపీకి, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీకి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య జిల్లాలో చెలిమికి బీజం పడింది. టీడీపీకి సంఘీభావంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో బైకు ర్యాలీలు, పాదయాత్రలతో హల్‌చల్ చేస్తూ టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
యువతలో పవన్ కల్యాణ్‌కు మంచి క్రేజ్ ఉన్నది. గతంలో పవన్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో యువత విశేషంగా స్పందించింది. ఆయన యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసింది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు మండలాల్లోనూ పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆయా సంఘాల్లోని పవన్ అభిమానులంతా క్రమంగా తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. పవన్ అభిమానుల మద్దతు వలన తమకు ఓటింగ్ శాతం మరింత పెరిగిందని టీడీపీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే బీజేపీకి మద్దతుగా ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన త్వరలో జిల్లాకు కూడా వస్తారని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. టీడీపీ ప్రజాగర్జన జిల్లాలో ఇప్పటివరకు జరగలేదు. ఇతర జిల్లాలను తలదన్నే రీతిలో లక్షల మంది ప్రజలతో సభను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల టిక్కెట్ల ఖరారు పూర్తి అయి నామినేషన్ల ప్రక్రియ ముగియగానే గర్జన తేదీని నిర్ణయించాలని నాయకులు భావిస్తున్నారు. ఆ సభకు పవన్ కల్యాణ్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు.

TDP clears Nani’s name for Vijayawada LS



Nani ‘rattled’ by reports that Pawan Kalyan proposed P. Varaprasad's name. Meanwhile, discontent continued in the TDP rank and file over allocation of some important seats to the BJP as part of the alliance.

The Telugu Desam Party has finally cleared the candidature of Kesineni Srinivas alias Nani from the Vijayawada Lok Sabha constituency.
The decision came after Mr. Nani called on TDP president N. Chandrababu Naidu at his residence on Monday morning. Though what transpired in the meeting was not known yet, the TDP president is learnt to have assured Mr. Nani that he was the party’s choice from the prestigious constituency.
Mr. Nani had been nurturing the constituency for some time now after receiving an assurance from the party leadership, but doubts were expressed on whether he would be allotted the ticket. Mr. Nani was reportedly unnerved by claims of a section of leaders that film star and Jana Sena Party founder Pawan Kalyan had strongly recommended the name of his close confidant Potluri Varaprasad to the TDP leadership.
A formal announcement of Mr. Nani’s candidature will be made in the next list likely to be released by the TDP leadership on Monday midnight or early Tuesday. “His (Mr. Nani’s) name has been finalised and we will officially announce it any moment from now,” a senior leader engaged in the screening exercise told The Hindu.
Protests continue

Meanwhile, discontent continued in the TDP rank and file over allocation of some important seats to the BJP as part of the alliance. A section of the TDP cadre damaged furniture in the party office in the Vijayawada West constituency in protest against allotting the seat to the BJP while their counterparts in Nellore staged protest against the decision to give Nellore Rural seat to the saffron party.
TDP activists ransacked the party’s office at Kaikalur in Krishna district for giving away the seat, a stronghold of the party, to the BJP. They disrupted a meeting of the important leaders of the constituency demanding re-nomination of Jayamangala Venkataramana who won from the seat in the previous elections.

పవన్‌కళ్యాణ్‌ అకౌంట్‌లో కట్‌

నసేన పార్టీ స్థాపించిన పవన్‌కళ్యాణ్‌ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తన అభ్యర్థుల్ని ఎవర్నీ కూడా నిలబెట్టడం లేదని స్పష్టం చేసేశాడు. అయితే ఈ పార్టీ తరఫున పొట్లూరి వరప్రసాద్‌ పోటీ చేస్తాడని, ఒకవేళ జనసేనలో కాకున్నా అతనికి టీడీపీ లేదా బిజెపీలో టికెట్‌ వచ్చేట్టు పవన్‌ చూస్తాడని ఊహాగానాలు సాగాయి. జనసేన ఆవిర్భావ సభకి, వైజాగ్‌ బహిరంగ సభకి అయిన ఖర్చులు మొత్తం అతనే భరించాడని కూడా అన్నారు. అయితే పివిపి పెట్టిన డబ్బులన్నీ కూడా పవన్‌తో అతను నిర్మించబోయే సినిమాకి ఇచ్చే రెమ్యూనరేషన్‌ నుంచి కట్‌ చేసుకుంటాడట. 

ఇప్పటికే పార్టీ కోసం సొంత డబ్బు చాలా వరకు ఖర్చు పెట్టిన పవన్‌కళ్యాణ్‌కి ఇప్పుడు ఈ సభలతో భారీగానే అప్పు పడ్డాడు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి ఇక షూటింగ్స్‌కి వెంటనే వచ్చేస్తాడని అనుకుంటూ ఉంటే ఇప్పట్లో షూటింగ్స్‌కి రానని పవన్‌ తేల్చేసాడట. మరో ఏడు సభలు నిర్వహించి జనాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తాడట. ఎన్నికలు అయ్యాక కూడా పవన్‌ సభలు కొనసాగుతాయట. వచ్చే ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని పవన్‌ ఈ ప్రణాళిక వేసుకున్నాడని భోగట్టా.

చిక్కుల్లో టిఆర్ఎస్

టిఆర్ఎస్ చిక్కుల్లో పడింది, తెలంగాణ సాధన తర్వాత నాది ఉద్యమ పార్టీ కాదు, ఇక నుంచి రాజకీయ పార్టీ అంటూ ప్రకటించిన కేసిఆర్, అనంతరం  తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన బలాన్ని తగ్గిస్తున్నాయి.  పలితం రోజురోజుకు అధికారం చేజిక్కుంచుకోవాలన్న లక్ష్యానికి దూరం జరుగుతున్నారు.  ఉద్యమాన్ని కించపరిచి, ఉద్యమకారులపై ఝులుం ప్రదర్శించిన కొండా సురేఖ వంటి వారిని పార్టీలోకి తీసుకోవడం కేసిఆర్ కు బెడసి కొడుతోంది.

తాజాగా తెలంగాణ రాజకీయ జేఏసి సమావేశమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 4న మరో సారి సమావేశమై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఏ పార్టలో ఉన్న మద్దతిచ్చేది లేదని, వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిందేనన్నది టిజేఏసి తీసుకున్న నిర్ణయం. కొండా సురేఖ వంటి వారిని అసలు సమర్థించేది లేదని కూడా టిజేఏసి స్పష్టం చేసింది.

మరో వైపు ఓయు జేఏసి సమావేశమై బాంబు లాంటి వార్తను పేల్చింది. ఓయు జేఏసి నేతలను ఏపార్టీ పట్టించుకోక పోవడంతో వారే స్వయంగా రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించారు. తెలంగాణలోని 41 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వీరంతా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వారు. పైగా పలు పార్టీల నుండి కాకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. అంటే టిజేఏసి వీరికి మద్దతుగా ప్రచారం చేస్తుందన్న మాట.

అంటే తెలంగాణ సాధించడంలో కీలక భాగస్వామి అయిన విధ్యార్థి జేఏసి టిఆర్ఎస్ కు పోటీగా ఎన్నికల్లోకి దిగుతోంది. ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ దక్కించుకున్న కాంగ్రెస్ తోను టిఆర్ఎస్ కలిసి పోనని ప్రకటించింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన బిజేపి సైతం టిఆర్ఎస్ కు ప్రత్యర్థి గానే ఎన్నికల్లో తలపడుతోంది. అంటే ఏ సెంటిమెంట్ అయితే తనకు అధికారం కట్టబెడుతుంది అన్న ధీమాతో కేసిఆర్ ఉన్నారో, అదే నాలుగు ముక్కలుగా విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కేసిఆర్ అధికారమే తన లక్ష్యమని, నిజమైన ఉద్యమకారులను విస్మరించి, పక్కా రాజకీయులను పార్టీలోకి చేర్చుకుని, అందులోను తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన వారికి అవకాశాలు ఇవ్వడం ఆయనకు బెడసి కొడుతోంది అన్నది దీంతో స్పష్టం అవుతోంది. అంతే కాదు కొన్ని చోట్ల పార్టీలో మొదటి నుంచి ఉంటూ పార్టీ కోసం పని చేస్తూ, ఉద్యమంలోను చురుకుగా పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు ఉన్న చోట కూడా కొత్త వారిని చేర్చుకుని, వారికి టికెట్లు ఖరారు చేయడం అక్కడ పాత వారు ఇతర పార్టీలోకి వెల్లి పోటీకి దిగుతుండడం కూడా టిఆర్ఎస్ కు నష్టాన్నే తెస్తోంది. 

ప‌వ‌న్ ఇలా ట్విస్టిచ్చాడేంటి?

జ‌న‌సేన పార్టీని స్థాపించాక... రెండు భారీ స‌భ‌ల‌ను నిర్వహించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే...  ఆ స‌భ‌ల్లో కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. మోడీ ప్రధాని కావాల‌న్నారు. అయితే... తెలుగుదేశం గురించి గానీ, జ‌గ‌న్ గురించి గానీ, ఆయ‌న పార్టీ గురించిగానీ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. దీంతో ఆ పార్టీ నేత‌లెవ్వరూ ప‌వ‌న్ గురించి చెడుగా మాట్లాడ‌లేదు. అయితే.. ఉన్నట్టుండి ప‌వ‌న్ జ‌గ‌న్‌ని టార్గెట్ చేసుకొన్నాడు. ఆయ‌న‌కి అధికార వ్యామోహం ఉంద‌నీ, తండ్రి మ‌ర‌ణంతో పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన జ‌గ‌న్ అధికారం కోసం పాకులాడ‌టం బాధించిందని తూర్పార‌బ‌ట్టాడు. వైఎస్ పాల‌న‌లో అవినీతిని ఎండ‌గ‌ట్టాడు.  ఓ ప్రముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ తాజా సంచ‌ల‌నానికి తెర తీశాడు.  
ప‌వ‌న్ ఇచ్చిన ఈ ట్విస్టుతో జ‌గ‌న్ పార్టీ బిత్తర‌పోతోంది. ఇంత‌గా ఏకేశాడేంటి? అని ఆ పార్టీ నేత‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప‌వ‌న్ చెప్పిన మాట‌ల్ని జ‌నం సీరియ‌స్‌గా తీసుకొంటే మాత్రం జ‌గ‌న్ పార్టీకి నిజంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు. మ‌రి ఆ పార్టీ ఈ వ్యాఖ్యల్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఇప్పటికే జ‌గ‌న్ మీడియా ప‌వ‌న్‌ని టార్గెట్ చేసి స్క్రిప్టు సిద్ధం చేసింద‌ని స‌మాచారం.

వారసుడికి ఇక అడ్డు లేదు

మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని, అధికారాన్నయితే సంపాదించుకున్నారు కాని ఆయన వారసులు అంటూ నందమూరి కుటుంబం బెడదను మాత్రం నారా వారు ఇప్పటి వరకు తప్పించుకోలేకపోయారు. ఇక తన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయం దగ్గరపడనున్న నేపథ్యంలో తన వారసునికి నందమూరి కుటుంబం నుంచి బెడద లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు అంటే రాజకీయాల్లో ఆరి తేరినవారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలరు. కాని తన వారసుడు లోకేష్ కు అంత చతురత వుంటుందా? వుండదా అన్నది అనుమానం. అందుకే తను ఉన్నప్పుడే లోకేష్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులు చంద్రబాబు చక్క దిద్దుతున్నారు.

తెలుగుదేశం తన చేతిలోకి వచ్చిందే కాని ఇప్పటి వరకు నందమూరి వారసత్వం నుంచి చిక్కులు తప్పలేదు. ఎన్టీఆర్ పేరును వాడుకోవడం తప్పనిసరి. అది వాడుకోవాలంటే ఆయన వారసులను ఉంచుకోవడం కూడా కంపల్సరీ. దీంతో చంద్రబాబు తొలుత హరికృష్ణను దగ్గర తీసుకున్నారు. హరికృష్ణ రాజకీయ దురంధరుడు కాకపోయినా కూడా తండ్రి పేరు చెప్పుకుని చంద్రబాబును ఎన్ని ఇబ్బందులకు గురిచేసారో అందరికి తెలిసిందే.

చివరకు ఎన్టీఆర్ పోలికలతో కుమారుడు జూనియర్ తయారుకావడంతో హరికృష్ణ చంద్రబాబును ఓ ఆటాడుకోవడం మొదలెట్టారు. ఈ మద్య అటు తండ్రిని, ఇటు కొడుకుని అడ్డంపెట్టుకుని చంద్రబాబును ఏకంగా ఏదో చేయాలనే భావనలోకి హరికృష్ణ వచ్చారు. పదవికి రాజీనామా, ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లేందుకు రథయాత్ర వంటి స్కెచ్ లు వేసుకున్నారు. చంద్రబాబు కాబట్టి ఎలాగోలా నిలువరించారు.
జూనియర్ ను ఓ దశలో జగన్ కు దగ్గరగా చేస్తున్నాన్న రేంజ్ లో హరికృష్ణ చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్స్ కూడా పంపారు. ప్లెక్సీలు, బొమ్మలు బాగోతం అందులో భాగమే.  ఇవన్నీ చంద్రబాబును రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాయో అందరికి తెలిసిందే.

అయితే ఇక చంద్రబాబుకు కాలం కలసి వచ్చిందో, ఆయన తెలివితేటలు సహకరించాయో తెలియదు కాని నందమూరి బెడద ఇక పూర్తిగా తొలగిపోయే క్షణాలు వచ్చేసాయి. హరికృష్ణ టిడిపిలోనే ఉంటూ చికాకు పెడుతుండగా, ఎన్టీఆర్ కూతురు పురంధరీశ్వరి కాంగ్రెస్ లో ఉండి కొరకురాని కొయ్యగా తయారయింది. ఎన్నటికైనా చంద్రబాబుకు పురంధరీశ్వరి నుంచి రాజకీయ ముప్పు ఉందనే భావం ఇప్పటివరకు ఉంది.

ఇక ఆ భాద తొలగినట్టే. విభజన పుణ్యమా అని పురందరీశ్వరికి రాజకీయ జీవితాన్నిస్తున్న కాంగ్రెస్ ఖతం అయింది. దీంతో ఆమె  తన భవిష్యత్తు కోసం బిజేపిలో చేరారు. ఇది చంద్రబాబుకు మరింత ఇబ్బంది పెడుతుందని భావించారు. కారణం బిజేపితో పొత్తు పెట్టుకున్నందున పురంధరీశ్వరిని ఇక ఏమి అనలేక భరించాల్సి వస్తుంది అనుకున్నారు. కాని ఆమె విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన ఆమె గెలిచే అవకాశాలు అంతో ఇంతో ఉన్న విశాఖ లోక్ సభ స్థానం ఆమెకు దక్కకుండా పోయింది. అసెంబ్లీ కి ఆమె పోటీ చేయదు, చేసినా గెలిచే అవకాశాలు తక్కువ అంటున్నారు. అంటే స్ట్రాంగ్ గా ఉన్న నందమూరి వారసత్వం ఒకటి రాజకీయాలకు దూరం అయినట్టే అంటున్నారు.

ఇక మిగిలింది హరికృష్ణ , ఆయనకు చంద్రబాబుకు ఎదురొడ్డి ఏదో చేసే సత్తా లేదు. కొడుకు జూనియర్ ను అడ్డంపెట్టుకునే ఏదైనా చేయాలి. కాని జూనియర్ ను చంద్రబాబు పక్కా పథకం ప్రకారం పక్కను నెట్టారు. ఆయన ఇప్పుడు రాజకీయాల మాటే ఎత్తడం లేదు. ఓ వేళ మాట్లాడిని టిడిపికే నామద్దతు అనడం తప్ప మరో మాట అనకుండా చేసారు. హరికృష్ణ చంద్రబాబును కాదని చేసిన వ్యవహారం అంతా చూసారు కాబట్టి ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వకున్నా చంద్రబాబును తప్పుగా భావించే పరిస్థితి లేదు.

అందుకే ఆయనకు టికెట్టు రాలేదు. చివరిదాకా ఇస్తున్నట్టే భ్రమలో ఉంచి చివరకు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. వియ్యంకుడు నందమూరి వారసుడు బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారుగా. నందమూరి బెడద ఎలా తప్పుతుంది అనుకోవచ్చు. నిజానికి బాలకృష్ణకు రాజకీయ చతురత, ఎదిగే లక్షణాలు లేవు. ఆవేశం అంతంత మాత్రం. పైగా అన్నింటికన్నా ఆయన లోకేష్ కు మామగారు. అందువల్ల బాలకృష్ణలో లోకేష్ కు వచ్చిన ఇబ్బందులు లేవు. బాలకృష్ణ గెలిచారే అనుకుందాం, ఆయనకు పెద్ద పదవి కూడా ఇచ్చారే అనుకుందాం. కాని తన కూతురునే కొడుకుకు ఇచ్చారు. అలాంటప్పుడు అల్లునికి అండగా ఉంటారు తప్ప ఎదురు తిరగే ప్రయత్నం చేయరు గాక చేయరు. మరి ఇక వారసుడికి అడ్డేముంది? - See more at: http://telugu.gulte.com/tnews/4206/Chandrababu-make-free-path-lokesh#sthash.22o7culF.dpuf

YS Jagan needs to understand Statistics

The YSR Congress Party leader Y S Jagan Mohan Reddy who came out with their Manifesto yesterday went off on a tirade against TDP leader by saying that development was better during the YSR regime. Talking about statistics he said that it was in his father’s time that AP had seen a surge of development in the field of IT , but for the fact that it was during Naidu’s time the whole concept of IT was developed and implemented. The number of jobs generated in the IT field were more than Naidu’s time.

But if the promotion of the field of IT was spearheaded by Mr. Naidu than how can the Congress take credit for it. When the TDP was in power between 1994 and 2004 and YSR regime which was only between 2004 and 2009 - these figures cannot be compared as the development phase had started then and if we remember correctly India witnessed the Great Recession phase where many people lost their jobs and would Y S Jagan be willing to give the credit to his father for that?


Check out the brief highlights of the YSRCP Manifesto which was the last to come out.Nothing new in regards to development of the State has been given.
Pension to be Rs.700 per month.


Special centres in every village to give the people any type of identity card within 24 hours. About ten local women will do the duties in the centre ‘Amma Vodi’ Pathakam for poor people. As per the program, Rs.500 will be deposited in the bank account of mother every month. If a family consists of two children, the amount will be Rs.1000.


Natural calamities fund will be established with a fund of Rs.2,000 crores. Farmers will be given immediate relief under the scheme.

Agricultural colleges in two districts. Three agricultural and veterinary universities will be established in the state. Complete Fee reimbursement.

102 mobile team service at every mandal headquarter in the state. Farmers will get the service within 20 minutes of making a call. 103 mobile team service in every mandal headquarter in the state for veterinary services.

Loan waiver of DWACRA ladies to the tune of Rs.20,000 crores. Changes will be done in the loan policy of DWACRA women.About two lakh women in 20,000 villages will get the employment.

Power cut- free state by 2019. Seven hours of compulsory power for farmers daily.

Orphanage in every assembly constituency.

No belt shops in villages.Super specialty hospitals in every district.Liquor sale only at one place in a constituency.

50 lakh houses to be constructed  within next five years. A house for every person.  

Complete changes will be made in Arogyasri scheme. Rs.3,000 pm will be provided to every person, who got operated, till he is in a position to go to work

కేశినేని నానిపై జగన్ కన్ను



తెలంగాణలో వైసీపీ ఆల్రెడీ దుకాణం మూసేసింది. ఇప్పుడు సీమాంధ్రలో తన ఉనికిని కాపాడుకునే తంటాలు పడుతోంది. సీమాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద కన్నేసింది. ఆ పార్టీలో టిక్కెట్లు దొరకని, కోరుకున్న టిక్కెట్లు దొరకక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నాయకులను ఆకర్షించి వైసీపీ తరఫున పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఆ తరహా నాయకులను కొంతమందిని ఆహ్వానించి సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించేసినట్టు సంతోషిస్తోంది. ఇప్పుడు వైసీపీ దృష్టి విజయవాడ పార్లమెంటు స్థానం మీద పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్న కేశినేని నాని మీద వైసీపీ దృష్టిని కేంద్రీకరించింది.


వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించుకోవడంతో, ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న కేశినేని నాని నిరసన గళం వినిపిస్తున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేశినేని నానిని వైసీపీ నుంచి పోటీ చేయించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో కేశినేని పార్టీని ఒప్పించడానికి ఒక రాయబార బృందం రంగంలోకి దిగినట్టు సమాచారం.

కొత్త రాగాలు ఆలపిస్తున్న కేసీఆర్


రాజకీయాలలో అపర చాణక్యుడని పేరుగాంచిన తెరాస అధ్యక్షుడు ఎప్పటికప్పుడు వేసే కొత్త ఎత్తులు, పన్నే సరికొత్త వ్యూహాలను పసికట్టడం ప్రత్యర్ధ పార్టీలకు కూడా సాధ్యం కాదు. ఆయన ఏ రోజు ఏమీ మాట్లాడి ఎవరి మీద ఎటువంటి బాంబులు పేలుస్తారో, ఎప్పుడు ఏ ఎత్తుగడతో ఏ దిశలో ముందుకు సాగుతారో ఎవరికీ అంతుపట్టదు. నిన్న కరీంనగర్ లో తెరాస నిర్వహించిన బహిరంగ సభలో ఎవరూ ఊహించని విధంగా ఆయన మరో సరికొత్త పల్లవి అందుకొన్నారు.

“తెరాస నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని, అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో చేతులు కలపబోమని, అదేవిధంగా బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమిలో కానీ, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూపీఏ కూటమిలో గానీ చేరబోమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ పార్టీ థర్డ్ ఫ్రంట్ లో చేరుతుందని, ఫ్రంట్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. బీజేపీ చెప్పుకొంటున్నట్లుగా ఆ పార్టీకి కనీసం 200 సీట్లు కూడా రావని, అందువల్ల ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అసంభవమని తేల్చి చెప్పేశారు. అందుకు మంచి బలమయిన కారణం కూడా ఆయనే చెప్పారు. ఈసారి ఎన్నికలలో దేశమంతటా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని, అందువల్ల వారందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్నా థర్డ్ ఫ్రంట్ కూటమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యమని” ఆయన జోస్యం చెప్పారు.

అయితే కొద్ది రోజుల క్రితమే, ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినప్పటికీ, ఎన్నికల తరువాత ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ, ఆ తరువాత బీజేపీతో పొత్తులకు కూడా  కేసీఆర్ ప్రయత్నించారు. ఇప్పుడు వాటికి మద్దతు ఈయబోమని చెపుతున్నారు. ఇంతవరకు తమది ఉద్యమపార్టీ అని చెప్పుకొంటున్నఆయన అకస్మాత్తుగా తమ పార్టీకి సెక్యులర్ రంగు వేసుకోవడం, బీజేపీకున్న మతతత్వ ముద్ర గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

అయితే దేశమంతా మోడీ హవా నడుస్తున్నసంగతి కేసీఆర్ కి తెలియదని భావించలేము. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో కంటే బీజేపీతోనే ఎన్నికల పొత్తులకి ఆసక్తి చూపారు. కానీ బీజేపీ తమను కాదని తెదేపాతో పొత్తులు పెట్టుకోవడంతో సహజంగానే బీజేపీ శత్రువుగా మారింది. అందువల్లనే ఆయనకు ఇప్పుడు బీజేపీలో మతత్వం మరింత స్పష్టంగా కనబడుతోంది. అదేవిధంగా ఇప్పుడు తెరాస ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతోంది గనుకనే ఆ రెండు పార్టీలకు మద్దతు ఈయమబోమని చెపుతూ, ప్రజలను నమ్మించేందుకు ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ గురించి చెపుతున్నారు. ఇక ఈ ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్, తెదేపా-బీజేపీ కూటమి చాలా బలంగా ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఆయన కూడా వాటిని అంతే గట్టిగా విమర్శిస్తూ ఎదిరిస్తూ మాట్లడినప్పుడే ప్రజలు తెరాసను విశ్వసించే అవకాశం ఉంది.

కేసిఆర్ కి రాములమ్మ తిట్లు, శాపనార్ధాలు


టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన కాంగ్రెస్ మెదక్ శాసనసభ అభ్యర్ధి విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసిఆర్ కు మోసం చేయడం తప్ప పరిపాలించడం చేతకాదని అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారన్నారు. తెరాసకు అధికారమిస్తే దోచుకుతింటుందన్నారు. తెరాస దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారన్నారు. తెరాస దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కెసిఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని విమర్శించారు

మోడీకి రజనీకాంత్ మద్దతు


రాజకీయ రంగంలో మరో సంచలనం ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టార్లకే స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ మోడీకి మద్దతు పలకనున విషయం తమిళనాడు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. రజనీకాంత్ మోడీకి మద్దతు పలుకుతారన్న విషయాన్ని రజనీకాంత్ సన్నిహితుడు చో రామస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి మోడీ వెళ్ళి రజనీని కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.ఈ అంశంపై చెన్నైలో ముందుగానే పోస్టర్లు వెలిశాయి. 

హిందూపురం బరిలో బాలకృష్ణ

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసే అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ జాబితాలో మూడు లోక్ సభ, 32 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లున్నాయి. 
 
అసెంబ్లీ అభ్యర్థులు: పలాస- గౌతు శ్యామసుందర శివాజీ; పాతపట్నం -శత్రుచర్ల విజయ రామరాజు; శ్రీకాకుళం -గుండా లక్ష్మీదేవి; పార్వతీపురం -బొబ్బిలి చిరంజీవులు; గజపతినగరం -కొండపల్లి అప్పల్నాయుడు; భీమిలి -గంటా శ్రీనివాసరావు; విశాఖ దక్షిణ -వాసుపల్లి గణేష్‌కుమార్; గాజువాక - పల్లా శ్రీనివాస్; యలమంచిలి -పంచకర్ల రమేష్; పాయకరావుపేట -వంగలపూడి అనిత; అనకాపల్లి -పిల్లా గోవింద్; కాకినాడ నగరం -వనమాడి వెంకటేశ్వరరావు; ఆచంట -పితాని సత్యనారాయణ; గోపాలపురం -ముప్పిడి వెంకటేశ్వరరావు; అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్; విజయవాడ  సెంట్రల్- బొండా ఉమామహేశ్వరరావు; గుంటూరు పశ్చిమ-మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి; సత్తెనపల్లి- కోడెల శివప్రసాదరావు; బాపట్ల- అన్నం సతీష్ ప్రభాకర్; రాజంపేట- మేడా మల్లికార్జునరెడ్డి; కోడూరు- వెంకటసుబ్బయ్య; ఆళ్లగడ్డ- గంగుల ప్రభాకర్‌రెడ్డి; శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి; నందికొట్కూరు- లబ్బి వెంకటస్వామి; కర్నూలు- టీజీ వెంకటేష్; పాణ్యం- ఏరాసు ప్రతాప్‌రెడ్డి; నంద్యాల- శిల్పామోహన్‌రెడ్డి; డోన్- కేఈ ప్రతాప్; పత్తికొండ- కేఈ కృష్ణమూర్తి; మడకశిర- ఎం.వీరన్న; హిందూపురం- నందమూరి బాలకృష్ణ.
 
 లోక్‌సభ అభ్యర్థులు..
 అనకాపల్లి- ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి); కాకినాడ- తోట నరసింహం; అమలాపురం- డాక్టర్ పి.రవీంద్రబాబు

కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది : వీహెచ్


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాటల్లో పొంతన ఉండదని అన్నారు. ఒకసారి ఆంధ్రోళ్ల నాళికలు కోస్తానని అన్నారని, మరుసటి రోజు అలా అనలేదని చెబుతారని అవకాశాన్ని బట్టి ఆయన మాట మారుస్తారని వీహెచ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాలు గెలుచుకుంటుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020