Monday, April 14, 2014

తెలుగుదేశం పార్టీకి జనసేన సంఘీభావం

తెలుగుదేశం పార్టీకి జిల్లాలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేస్తోన్నారు. టీడీపీ నాయకులు నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచారాల్లో జనసేన కార్యకర్తలు పార్టీ జెండాలతో వచ్చి మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జిల్లా పర్యటనలో తొలిసారిగా జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి ముందుకు నడిచాయి. దీంతో తెలుగుతమ్ముళ్లు ఎన్నికల ప్రచారంతో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో' నినాదంతో రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనదని, ఏ ఒక్క రాజకీయ పార్టీ గెలువు అవకాశాలు దెబ్బతీయ దలుచుకోలేదని స్పష్టం చేశారు. అలానే బీజేపీకి, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీకి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య జిల్లాలో చెలిమికి బీజం పడింది. టీడీపీకి సంఘీభావంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో బైకు ర్యాలీలు, పాదయాత్రలతో హల్‌చల్ చేస్తూ టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
యువతలో పవన్ కల్యాణ్‌కు మంచి క్రేజ్ ఉన్నది. గతంలో పవన్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో యువత విశేషంగా స్పందించింది. ఆయన యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసింది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు మండలాల్లోనూ పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆయా సంఘాల్లోని పవన్ అభిమానులంతా క్రమంగా తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. పవన్ అభిమానుల మద్దతు వలన తమకు ఓటింగ్ శాతం మరింత పెరిగిందని టీడీపీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే బీజేపీకి మద్దతుగా ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన త్వరలో జిల్లాకు కూడా వస్తారని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. టీడీపీ ప్రజాగర్జన జిల్లాలో ఇప్పటివరకు జరగలేదు. ఇతర జిల్లాలను తలదన్నే రీతిలో లక్షల మంది ప్రజలతో సభను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల టిక్కెట్ల ఖరారు పూర్తి అయి నామినేషన్ల ప్రక్రియ ముగియగానే గర్జన తేదీని నిర్ణయించాలని నాయకులు భావిస్తున్నారు. ఆ సభకు పవన్ కల్యాణ్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020