Friday, April 11, 2014
ఆ పెద్దల బృందం తెరవెనక పావులు కదుపుతోంది!
ప్రస్తుతం రాష్ట్రం రాజకీయాల్లో ఏం జరుగుతోంది? దీని వెనక ఎవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? రాజకీయాలను ఎలా నడిపిస్తున్నారన్నదే ప్రస్తుతం ఎవరికి తెలియని మిస్టరీగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఆరంగ్రేటం వెనక ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయన మౌనం వహించే మేథావి. ఆంధ్ర రాష్ట్ర మీడియా దిగ్గజాల్లో ఆయన కూడా ఒకరు. మూడున్నర దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఈయనకు తోడుగా మరో ఇద్దరు. వీరు వేర్వేరు పార్టీలకు చెందిన వారు. వీరు జాతీయస్థాయిలో ఏమైనా చేసే సత్తా ఉన్న నాయకులు. ప్రస్తుతం రాష్ట్రం రెండు ముక్కలైంది. సీమాంధ్రలో ఓ యువనేత ప్రభంజనానికి, తెలంగాణలో ఉద్యమ పార్టీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు ఆ పెద్దల బృందం తెరవెనక పావులు కదుపుతోంది.
ప్రస్తుతం సీమాంధ్రలో అధికారంలోకి రావాలనుకుంటున్న యువనేత పార్టీకి, తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న ఓ ఉద్యమపార్టీకి ఈ పెద్దల బృందం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇంతకు ఈ బృందంలో రాష్ట్రానికి దీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తితో పాటు సీమాంధ్రకు చెందిన ఓ జాతీయనేత, మరో మీడియా మేథావి కీలకపాత్ర పోషిస్తున్నారు.
సినీహీరో పవన్‌కళ్యాణ్ చేత జనసేన పార్టీ పెట్టించి కొన్ని పార్టీ నాయకులపై విమర్శలు చేయించడంతో పాటు ఓ రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తు వ్యవహారంతో పాటు తెలంగాణలో ఉద్యమపార్టీతో పాటు ఓ జాతీయ పార్టీ హవా అడ్డుకోవడానికి, ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడకుండా ఆ బృందం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్రలో యువనేత పార్టీ, తెలంగాణలో ఉద్యమ పార్టీలు అధికారంలోకి వస్తే రెండు చోట్ల అరాచక పాలనే కొనసాగుతుందని, వీరు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఈ త్రిసభ్య కమిటీ బృందం చాలా పన్నాగాలు వేస్తోందని సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment