Friday, April 11, 2014
పార్టీ పురుడుపోసుకుంది ఎక్కడ?
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ స్థాపించింది ఎవరని అడిగితే టక్కున చెప్పే సమాధానం నందమూరి తారకరామారావు అని. అయితే ఆ పార్టీ పురుడుపోసుకుంది ఎక్కడంటే హైదరాబాద్‌లోని ముషీరాబాద్. 1982లో గోల్కొండ చౌరస్తాలోని రామకృష్ణ స్టూడియోలో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 1983లో ఆయన తేదేపాకు తిరుగులేని ఆధిక్యాన్ని తీసుకొచ్చాడు.
అనంతరం నాదెండ్ల భాస్కరరావు తేదేపాకు వెన్నుపోటు పొడిచినప్పుడు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేందుకు ఈ స్టూడియో ఎన్టీఆర్‌కు ఎంతో ఉపయోగపడింది. అయితే పార్టీకి పుట్టినిల్లు లాంటి ముషీరాబాద్‌లో పార్టీ ఎప్పుడూ ఒడిదుడుకులే ఎదుర్కొంది. 1983లో పార్టీ ఆవిర్భవించినప్పుడు మాత్రం ఈ స్థానం నుంచి తేదేపా తరపున ఎన్టీఆర్ ఆలిండియా అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్ తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన ఎన్.నరసింహారెడ్డిపై 51,855 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment