సత్తెనపల్లి: సత్తెనపల్లి నా జన్మస్థలం. నేను కోరుకున్న నరసరావుపేటను కాదనుకుని నన్ను కోరుకున్న సత్తెనపల్లికి రావడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం రాత్రి కాకతీయ కల్యాణ మండపంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు యెలినీడి రామస్వామి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ తల్లి ఒడి నుంచి ఈ తల్లి ఒడికి చేరానన్నారు. కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రజలకు వివరించాలన్నారు. నా మీద అభిమానం చూపిస్తున్న సత్తెనపల్లి ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కోడెల నాయకత్వం వర్ధిల్లాలంటా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొందరు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించిన వారు సమావేశానికి వచ్చారని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Monday, April 14, 2014
జన్మభూమి రుణం తీర్చుకుంటా: కోడెల

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment