Friday, April 11, 2014

హోరాహోరీ

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సునాయాసంగా గెలవాలంటే పరిషత్ ఎన్నికల్లో డామినెట్ చేయాల్సిందేనని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నేరుగా ద్వితియశ్రేణి నాయకుల ద్వారా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. నరసరావుపేట, గుంటూరు లోక్‌సభ పరిధిలోని 28 మండలాల్లో ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజి నుంచి నాగార్జున సాగర్ వరకు ఉన్న మండల కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు రెండో విడత పోలింగ్‌లో ఎక్కువగా ఉన్నాయి. తాడికొండ, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలోని 28 మండలాల్లో ఏర్పాట్లు చేసినట్లు జడ్పీ సీఈవో సుబ్బారావు తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని అధికారులు మండల కార్యాలయాలకు పంపారు.
ఎంపీటీసీకి రూ.5 లక్షలు ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి?
ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి.. డబ్బు ఎంతైనా ఇబ్బంది లేదు.. అంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో ఎంపీటటీసీ అభ్యర్థిలకు రూ.5 లక్షల చొప్పున అందజేశారు. దీంతో గత్యంతరం లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి కూడా ఎంపీటీసీకి రూ. 4 లక్షల చొప్పున అందజేశారని సమాచారం. ఈ విధంగా మలి విడతలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో నాయకులు ప్రతిష్ఠగా తీసుకుని నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపే తమ గెలుపుగా భావించి రంగంలోకి దిగుతున్నారు.
బెల్లంకొండలో ఓటుకు రూ. 2వేలు
పోలింగ్‌కు రెండు రోజులు గడువు ఉండగానే పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండలో అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారని సమాచారం. ప్రధాన పార్టీలు గెలుపు కోసం హోరాహోరిగా రంగంలోకి దిగాయి. తమ అనుచరులను గెలిపించుకోవాల్సిందేనంటూ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. రాజుపాలెం మండలంలో ఓటుకు రూ. వెయ్యి - రూ. 1500 చొప్పున పంపిణీ చేశారని తెలిసింది. డబ్బుతో పాటు మద్యం, పలావు పొట్లాలు అందిస్తున్నారు. మండలంలోని బార్, రెస్టారెంట్‌లలో ఖాతాలు ప్రారంభించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి తన స్వగ్రామం లంకెలకూరపాడులో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించటానికి స్వయంగా రంగంలోకి దిగారు. దొడ్లేరు, క్రోసూరు, ఉయ్యందన, పీసపాడు, అందుకూరు ఎంపీటీసీలకు తీవ్ర పోటీ నెలకొంది. అచ్చంపేట మండలంలో ఓటుకు రూ. వెయ్యి - 1500 చొప్పున పంపిణీ చేస్తున్నారని స మాచారం. తుళ్లూరులో బీజేపీ, సీపీఎం, సీపీఐలు టీడీపీకి మద్దతు ఇస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వరప్రసాద్ తాడికొండ నుంచి పోటీ చేయనని ప్రకటించడం, రాయపాటి టీడీపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలం సమకూరింది. ప్రత్తిపాడులో మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, ఎంపీ రాయపాటి టీడీపీ వైపు చేరడంతో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో ముందున్నారు. పెదనందిపాడు కేంద్ర మంత్రి జేడీ శీలం సొంత మండలం అయినా ఇక్కడ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో లేరు. పెదకాకాని జడ్పీటీసీకి వైసీపీ, టీడీపీ అభ్యర్థులు వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన వారు. ఇరువురు వ్యాపారులు కావడంతో ఓటుకు రూ. వెయ్యి - 1200 చొప్పున పంపిణీ చేస్తున్నారని సమాచారం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో ఓటుకు రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నారని తెలిసింది. పిడుగురాళ్ల, మాచవరం, కారంపూడి, గురజాల, వట్టిచెరుకూరు, గుంటూ రు మండలాల్లో కూడా గెలుపు కోసం ఇరు పా ర్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నాయి. డబ్బుతో పాటు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారు.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020