తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాటల్లో పొంతన ఉండదని అన్నారు. ఒకసారి ఆంధ్రోళ్ల నాళికలు కోస్తానని అన్నారని, మరుసటి రోజు అలా అనలేదని చెబుతారని అవకాశాన్ని బట్టి ఆయన మాట మారుస్తారని వీహెచ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాలు గెలుచుకుంటుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Monday, April 14, 2014
కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది : వీహెచ్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాటల్లో పొంతన ఉండదని అన్నారు. ఒకసారి ఆంధ్రోళ్ల నాళికలు కోస్తానని అన్నారని, మరుసటి రోజు అలా అనలేదని చెబుతారని అవకాశాన్ని బట్టి ఆయన మాట మారుస్తారని వీహెచ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాలు గెలుచుకుంటుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment