
నందమూరి హరికృష్ణ ఇంట్లో ఆదివారం ఏం జరిగిందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణకు అనంతపురం జిల్లా హిందూపురం టిక్కెట్టు ఖరారైంది. అయితే హరికృష్ణ తనకు కూడా టిక్కెట్టు కావాలని చంద్రబాబుని కోరారు. అయితే ఈ విషయంపై ఆదివారం హరికృష్ణ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు. సమావేశంలో ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ చంద్రబాబు, బాలయ్యతో ఫోన్లో చర్చలు జరిపారు. హరికృష్ణకు పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే హరికృష్ణను గెలిపించుకునే బాధ్యతతో పాటు ఎన్టీఆర్ హిందూపూర్‌లో బాలకృష్ణతో కలిసి ప్రచారం చేయాల్సి ఉంటుంది.
అలాగే ఎన్టీఆర్ నారా లోకేష్‌తో కలిసి కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి. ఈ షరతులకు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ అంగీకరించారు. దీంతో హరికృష్ణకు పెనమలూరు సీటు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు నందమూరి-నారా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ పూడినట్టు అయ్యింది.
No comments:
Post a Comment