ఎన్నికల్లో డబ్బు, కులం, మతం చూడొద్దు. వాటన్నింటికి అతీతంగా వ్యవహరించండి. మీ ఊళ్లో వాళ్లను కూడా చైతన్యపరచండి. అప్పుడే మీ భవిష్యత్తు బావుంటుంది. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొంటే నష్టం కలుగుతుందని ఓటర్లకు అవగాహన కలిగించాలని ఫ్రత్తిపాటి అన్నారు.
ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు. రాధాకాష్ణ మాట్లాడుతూ అభ్యర్థుల కులం, మతం, ప్రాంతం చూడొద్దన్నారు. అభ్యర్థుల గుణం చూసి ఓటేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు నేడు తాడు, బొంగరం లేకుండా చేశారు. ఈ క్లిష్ట సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. రాజకీయ వ్యవస్థ అంతా కుళ్లిపోయిందన్న భావన నుంచి విద్యార్థులు బయటికి రావాలని, అంతా ప్రభుత్వమే చేయాలన్న ధోరణి సరికాదన్నారు. ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగానికి నేను అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడం వలనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ఆకర్షితులు కావడం వలన నేడు ఇంజనీరింగ్ విద్యలో క్వాలిటీ తగ్గిపోయి పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ చురుకుగా ఉండటం వలనే 2జీ లాంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఉన్నంతలో మంచి వాళ్లను ఎన్నుకోవాలన్నారు. నోటా ఓటుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment