Saturday, April 12, 2014
దేశ ప్రేమికుడు కావాలా..? భార్య ప్రేమికులు కావాలా తేల్చుకోండి?
భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వైవాహిక జీవితంపై చెలరేగుతున్న విమర్శలకు వారణాసిలో ఆయన అభిమానులు వినూత్నంగా పోస్టర్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అందులో మోడీ దేశ ప్రేమికుడని కితాబునిచ్చారు. కాంగ్రెస్ తరపున దేశానికి తొలి ప్రధాని అయిన జవహర్‌లాల్ నెహ్రూ దేశ, విదేశ పత్నీ ప్రేమికుడని చెప్పారు.
దిగ్విజయ్‌సింగ్‌కు ఇద్దరు భార్యలు కాగా, తాజా మాజీ మంత్రి శశిథరూర్‌కు ముగ్గురు భార్యలని, సమాజవ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌కు ఏకంగా ఆరుగురు భార్యలని, మలయాంకు ఇద్దరు భార్యలున్నారని చెప్పారు. ఇదే పోస్టర్‌లో రాహుల్ ఓ మహిళను ముద్దాడుతూ ఉన్న ఫొటోను కూడా ముద్రించారు. ఆ మహిళ రాహుల్‌ను ముద్దాడిన మరుసటి రోజు భర్త చేతిలో హత్యకు గురైందని అందులో తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment