Friday, April 11, 2014

6 ఎంపీ, 40 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితా విడుదల. పేటలో రాయపాటి

మోదుగులకు తప్పని స్థానచలనం!
అనంతలో జేసీ.. నెల్లూరుకు ఆదాల
రాజమండ్రి మురళీమోహన్‌దే
గన్నవరం వల్లభనేని వంశీకే
6 ఎంపీ, 40 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితా విడుదల
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి) అనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి! జేసీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రిలో ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి! నరసరావుపేట లోక్‌సభ సీటు నుంచి బరిలోకి దిగనున్న రాయపాటి సాంబశివరావు! కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో తలపడనున్న సతీశ్‌రెడ్డి! గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా గల్లా జయదేవ్.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి! టీడీపీ రెండో జాబితాలోని విశేషాలివి. 40 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఆరుగురు పార్లమెంటు అభ్యర్థులతో సీమాంధ్ర ప్రాంత రెండో జాబితాను టీడీపీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దీంతో, ఇప్పటి వరకు ఆ పార్టీ 12 లోక్‌సభ, 87 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పెద్దగా ఆశ్చర్యాలకు తావు లేకుండా ఇప్పటికే ఖరారైన అభ్యర్థులతో ఈ జాబితాలు వెలువడ్డాయి. ప్రకటించిన స్థానాల్లో ఒక్క గన్నవరం సిటింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావుకు ఈసారి చాన్స్ లభించలేదు. ఆ స్థానంలో వల్లభనేని వంశీకి అవకాశం దొరికింది. బాలవర్ధనరావును కృష్ణా డెయిరీ చైర్మన్‌గా చేసే అవకాశం ఉంది.
లోకసభ అభ్యర్థులు
1)రాజమండ్రి మాగంటి మురళీమోహన్
2)గుంటూరు గల్లా జయదేవ్
3)నర్సరావుపేట రాయపాటి సాంబశివరావు
4)అనంతపురం జెసి దివాకరరెడ్డి
5)కడప ఆర్. శ్రీనివాసులరెడ్డి
6)నెల్లూరు ఆదాల ప్రభాకరరెడ్డి
అసెంబ్లీ అభ్యర్ధులు
బొబ్బిలి తెంటు లక్ష్మీనాయుడు
విజయనగరం మీసాల గీత
శృంగవరపుకోట కోళ్ళ లలితకుమారి
రామచంద్రాపురం తోట త్రిమూర్తులు
కొత్తపేట బండారు సత్యానందరావు
నిడదవోలు బూరుగుపల్లి శేషారావు
తణుకు అరుమిల్లి రాధాకృష్ణ
దెందులూరు చింతమనేని ప్రభాకర్‌రావు
ఏలూరు బడేటి కోట రామారావు
పోలవరం ముడియం శ్రీనివాస్
తిరువూరు నల్లగట్ల స్వామిదాస్
గన్నవరం వల్లభనేని వంశీ
మచిలీపట్నం కొల్లు రవీంద్ర
నందిగామ తంగిరాల ప్రభాకరరావు
పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్
పొన్నూరు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
వేమూరు నక్కా ఆనందబాబు
రేపల్లె అనగాని సత్యప్రసాద్
తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్

చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు
వినుకొండ జీవీఎస్ ఆంజనేయులు
గురజాల యరపతినేని శ్రీనివాసరావు
ఎర్రగొండపాలెం బుడాల అజితారావు
చీరాల వావిలాల సునీత
ఒంగోలు దామచర్ల జనార్ధన్
కందుకూరు డాక్టర్ దివి శివరాం
మార్కాపురం కందుల నారాయణరెడ్డి
కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి
నెల్లూరు అర్బన్ శ్రీధర కృష్ణారెడ్డి
వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ
ఉదయగిరి బొల్లినేని రామారావు
పులివెందుల సతీష్ రెడ్డి
మైదుకూరు సుదాకర్ యాదవ్
తాడిపత్రి జేసీ ప్రభాకరరెడ్డి
శింగనమల బండారు రవికుమార్
తంబళ్ళపల్లి జి. శంకర్ యాదవ్
చంద్రగిరి గల్లా అరుణకుమారి
గంగాధర నెల్లూరు జి. కుతూహలమ్మ
చిత్తూరు డీకే సత్యప్రభ
పూతలపట్టు ఎల్. లలితకుమారి.
రెబల్స్‌కు బాబు బుజ్జగింపు
హైదరాబాద్, ఏప్రిల్ 11 : హైదరాబాద్ నగర శివార్లలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన ముగ్గురు రెబల్స్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎల్‌బీ నగర్ నుంచి నామినేషన్ వేసిన సామా రంగారెడ్డి, శేరిలింగంపల్లిలో నామినేషన్ వేసిన మొవ్వా సత్యనారాయణ, పటాన్‌చెరులో నామినేషన్ వేసిన శశికళా యాదవ్‌లతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు టి.డి. జనార్దనరావు, మండవ వెంకటేశ్వరరావు వారితో మాట్లాడి అనంతరం బాబు వద్దకు తీసుకెళ్లారు. అన్ని అర్హతలు ఉన్నా, కొన్ని కారణాల వల్ల అవకాశం ఇవ్వలేకపోయామని, పోటీ నుంచి తప్పుకొని పార్టీకి సహకరించాలని బాబు వారిని కోరారు. భవిష్యత్తులో తప్పక వారికి తగిన అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020