క్రోసూరు: చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని దొడ్లేరులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తో కలిసి ప్రసంగించారు. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తాను విశ్రమించబోనని చెప్పారు. తాను గతంలో మూడుసార్లు ఎంపీగా గెలవటం వెనుక పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల పాత్ర, అభిమానం అపారమని, మరోసారి తనను ఆదరించాలని కోరారు.స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రాయపాటి సాంబశివరావుకు దొడ్లేరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వేలాదిమంది కార్యకర్తలు గ్రామం వెలుపల నుంచి మేళతాళాలతోను, బాణసంచా కాల్పులతోను స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ రాయపాటి సహకారంతో రాష్ట్రాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కొమ్మాలపాటి శ్రీధర్‌పై పోటీచేసి ఓటమి చెందిన నూర్జహాన్‌బేగం, వైసీపీ నియోజకవర్గ నాయకుడు ప్రసాద్‌లు రాయపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపాటి, కొమ్మాలపాటిల కాంబినేషన్ ప్రజాభివృద్ధిలో సూపర్‌హిట్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ దస్తగిరి, జడ్పీటీసీ అభ్యర్థిని గిల్సన్ గ్లోరి, నాయకులు తోక వెంకట్రావు, నలజాల కోటేశ్వరరావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు దాచేపల్లి సైదా, మాజీ ఎంపిీటీసీ సభ్యుడు బత్తుల సీతారామిరెడ్డి, పార్టీ దొడ్లేరు అధ్యక్షుడు బత్తుల హనుమంతరావు, గుడిపాడు మస్తాన్‌వలి, మాజీసర్పంచ్ షేక్ అల్లాభక్షు,దాచేపల్లి రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment