Friday, April 11, 2014

సత్తెనపల్లి నుంచి పోటీకే కోడెల ఆసక్తి

నరసరావుపేట : నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గంలోని వరుసగా ఐదు సార్లు విజయం సాధించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా లేనట్లు ప్రచారం జరుగుతున్నది. సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కోడెల ఆసక్తి కనబరుస్తున్నట్టు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే మంగళవారం సాయంత్రానికి రెండు నియోజక వర్గాల్లో పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. తొలుత నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. నరసరావుపేట సీటును బీజేపీకి కేటాయించటం లేదని చంద్రబాబు ప్రకటించారు. అలాగే బీజేపీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచటం లేదు. ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేయలేమన్న ఆలోచనకు ఆ పార్టీ నేతలు వచ్చా రు. దీంతో పొత్తుల్లో భాగంగా సత్తెనపల్లి సీటును బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.
సత్తెనపల్లి లేదా గుంటూరు - 2 ఈ రెండింటిలో ఒకటి బీజేపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను తెలుగుదేశం అధిష్ఠానం వద్ద వుంచారు. ఈ అంశంపై పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సత్తెనపల్లికి బీజేపీ అభ్యర్థి పేరును కూడా టీడీపీకి సూచించినట్టు తెలుస్తుంది. తిరుమల డెయిరీ డైరెక్టర్ నలబోతు వెంకట్రావును బీజేపీ అభ్యర్థిగా సత్తెనపల్లిలో పోటీ చేయించాలన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు వెంకయ్య నాయుడును వెంకట్రావు కలసి పార్టీ టిక్కెట్‌ను తనకు కేటాయించాలని కోరినట్టు సమాచారం. దీనిపై వెంకయ్య నాయుడు సానుకూలం గా స్పందించారని తెలుస్తుంది. మొత్తం మీద జి ల్లా నుంచి ఒక టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి లేదా గుంటూరు - 2లలో ఏదో ఒక సీటును ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నది. సీట్ల సర్దుబాటు పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మా రింది. గుంటూరు - 2 నుంచి నరసరావుపేట సి ట్టింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని పోటీ చేయాలని టీడీపీ భావిస్తున్నది. నరసరావుపేట పార్లమెంట్ టిక్కెట్‌ను మోదుగులకు కాకుండా రాయపాటి సాంబశివరావుకు పార్టీ కేటాయించిం ది. దీంతో మోదుగులను బుజ్జగించే దానిలో భా గంగా గుంటూరు - 2 పార్టీ టిక్కెట్‌ను కేటాయించింది. దీంతో ఈ టిక్కెట్‌ను బీజేపీకి ఇచ్చే పరిస్థితి లేదని చెపుతున్నారు. ఇక మిగిలింది బీజేపీకి సత్తెనపల్లి టిక్కెట్ మాత్రమే. సత్తెనపల్లి నుంచి కోడెల పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తుండటం, మరో వైపు ఇదే టిక్కెట్‌ను బీజేపీ కోరుతుండటంతో రెం డు నియోజక వర్గాల్లో పార్టీ క్యాడర్‌లో ఉత్కంఠ నెలకుంది. కాగా మంగళవారం కోడెల నరసరావుపేట వచ్చేందుకు హైదరాబాద్ నుంచి బయలు దే రారు. ఇదే సమయంలో చంద్రబాబు నుంచి పిలు పు రావటంతో కోడెల హైదరాబాద్‌లోనే ఆగి పో యారు. రాత్రి చంద్రబాబుతో డాక్టర్ కోడెల భేటీ అయ్యారు. బీజేపీ సత్తెనపల్లి సీటు ఇవ్వాలని పట్టుబడుతున్న అంశాన్ని చంద్రబాబు కోడెల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్లు ఎక్కడి నుంచి టీడీపీ, ఏ నియోజక వర్గం నుంచి బీజేపీ పోటీ చేస్తుందన్న రసవత్తర చర్చ ఇరు పార్టీల్లో జరుగుతున్నది.
కోడెల ఇక్కడి నుంచి సత్తెనపల్లి వెళ్తారన్న అంశాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతున్నది. ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలు కోడెల పై ఒత్తిడి తెస్తున్నారు. సత్తెనపల్లి వెళ్ళే అంశాన్ని ఆయన ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. నరసరావుపేట లేదా సత్తెనపల్లి ఈ రెండు చోట్ల ఎక్కడి నుంచైనా పోటీ చేసే అంశాన్ని కోడెల నిర్ణయానికే చంద్రబాబు వదిలేశారు. సత్తెనపల్లి నుంచి ఆయన
పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురు పార్టీ నేతలు హైదరాబాద్ వెళ్ళి మంగళవారం కోడెలను కలిశారు. నరసరావుపేట నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కోడెల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కోడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో పార్టీ క్యాడర్ ఢీలా పడింది. ఈ నియోజక వర్గంలో తన సొంత సామాజిక వర్గం పూర్తి స్థాయిలో సహకరించక పోవటం వలనే ఇక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నరసరావుపేట కంటే సత్తెనపల్లిలోనే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయన్న అంచనాకు ఆయన వచ్చినట్టు సమాచారం. పార్టీకి దూరంగా వున్న తన సామాజిక వర్గంను దగ్గర చేసుకొనేందుకు పలు విధాలా ప్రయత్నాలు చేశారు. ఇవి ఫలించక పోవటం వలన కూడా నియోజక వర్గం మారాలని కోడెల నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ కంటే సత్తెనపల్లిలో విజయావకాశాలు ఎలా మెరుగ్గా వుంటాయని? పార్టీ శ్రేణులు కోడెలను ప్రశ్నిస్తున్నారు. ఈ నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి మెరుగ్గా వుందని, పట్టణంలో పార్టీ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కోడెలకు ఇక్కడే విజయావకాశాలు అధికంగా వున్నాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి వాదనను విన్పిస్తున్నారు.
కోడెల సత్తెనపల్లి వెళితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ పరిశీలనలో ఆరు పేర్లు వున్నట్టు తెలుస్తుంది. కొంత కాలంగా కోడెల నరసరావుపేట నుంచి పోటీ చేస్తారా?, సత్తెనపల్లి వెళ్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సత్తెనపల్లి వెళితే నరసరావుపేట నుంచి పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని పలువురు టీడీపీ అధిష్ఠానాన్ని కోరినట్టు సమాచారం. తిరుమల డెయిరీ చైర్మన్ దండా బ్రహ్మానందం, డైరెక్టర్లు డాక్టర్ నలబోతు వెంకట్రావు, బత్తిన నాగేశ్వరరావు, తిరుమల ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్, కార్యదర్శి రావెల సత్యనారాయణ, డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రి యాదవ్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎంపిక కోడెల నిర్ణయం పై ఆధార పడి వుండటంతో ఆయన మద్దతు పొందేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. కాగా పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న ఇరువురు నేతలు వారి సామాజిక వర్గ నాయకులతో మంగళవారం చర్చలు జరిపారు. పార్టీ టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. బుధవారం కోడెల నరసరావుపేటకు రానున్నారు. తాను పోటీ ఎక్కడి నుంచి చేసేది పార్టీ క్యాడర్‌కు ఆయన స్పష్టం చేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో కోడెల నిర్ణయం పై ఉత్కంఠ నెలకుంది.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020