
విజయవాడ పార్లమెంట్ స్థానానికి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ లోక్‌సభ అభ్యర్థి కేశినేని నానికి బి ఫామ్ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. చివరి నిముషం వరకు బెజవాడకు చెందిన పొట్లూరి వరప్రసాద్, కేశినేని నాని... ఈ ఇద్దరిలో ఎవరికి సీటు ఇవ్వాలన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఇరువురికి మద్దతు తెలిపిన నేతలు చంద్రబాబు నివానికి చేరుకుని చర్చలు జరిపారు.
పొట్లూరి వరప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వాలని ఆయన తరఫున రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారావేత్తలందరూ టీడీపీ «అధ్యక్షుడు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ బీజేపీతో పొత్తుపెట్టుకుని ముందుకు వెళుతున్న తరుణంలో... గతంలో జగన్‌తో వ్యాపార సంబంధాలు ఉన్న పొట్లూరి వరప్రసాద్ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనకు టిక్కెట్ ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భావనతో చంద్రబాబు మొదటి నుంచి పొట్లూరికి సీటు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా బాబు వివరించినట్లు తెలియవచ్చింది. హేమా హేమీలు పొట్లూరికి సిఫారస్ చేసినప్పటికీ చివరికి కేశినేని నానికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకుని, బి ఫామ్ కూడా అందజేశారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళారు.
No comments:
Post a Comment