నసేన పార్టీ స్థాపించిన పవన్‌కళ్యాణ్ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తన అభ్యర్థుల్ని ఎవర్నీ కూడా నిలబెట్టడం లేదని స్పష్టం చేసేశాడు. అయితే ఈ పార్టీ తరఫున పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తాడని, ఒకవేళ జనసేనలో కాకున్నా అతనికి టీడీపీ లేదా బిజెపీలో టికెట్ వచ్చేట్టు పవన్ చూస్తాడని ఊహాగానాలు సాగాయి. జనసేన ఆవిర్భావ సభకి, వైజాగ్ బహిరంగ సభకి అయిన ఖర్చులు మొత్తం అతనే భరించాడని కూడా అన్నారు. అయితే పివిపి పెట్టిన డబ్బులన్నీ కూడా పవన్‌తో అతను నిర్మించబోయే సినిమాకి ఇచ్చే రెమ్యూనరేషన్ నుంచి కట్ చేసుకుంటాడట.
ఇప్పటికే పార్టీ కోసం సొంత డబ్బు చాలా వరకు ఖర్చు పెట్టిన పవన్‌కళ్యాణ్‌కి ఇప్పుడు ఈ సభలతో భారీగానే అప్పు పడ్డాడు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి ఇక షూటింగ్స్‌కి వెంటనే వచ్చేస్తాడని అనుకుంటూ ఉంటే ఇప్పట్లో షూటింగ్స్‌కి రానని పవన్ తేల్చేసాడట. మరో ఏడు సభలు నిర్వహించి జనాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తాడట. ఎన్నికలు అయ్యాక కూడా పవన్ సభలు కొనసాగుతాయట. వచ్చే ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ ప్రణాళిక వేసుకున్నాడని భోగట్టా.

No comments:
Post a Comment