హైదరాబాద్, ఏప్రిల్ 11 : టైటానియం కుంభకోణంపై విచారణ జరిపే దమ్ము గవర్నర్‌కు లేదా అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ జోలికి వెళ్లొద్దని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందా అని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ పాలన మరికొన్నాళ్లు సాగి ఉంటే రాష్ట్రం నేరస్థుల స్వర్గధామంగా మారేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
టైటానియం కుంభకోణంపై ఎఫ్‌బీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వైసీపీకి కనిపించడం లేదా అని సోమిరెడ్డి నిలదీశారు. ఈ కుంభకోణంతో జగన్ బ్యాచ్ క్రిమనిల్ చర్యలకు అంతర్జాతీయ ప్రమోషన్ వచ్చిందని విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుంబం ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అవినీతి నిర్మూలనలో మొట్టమొదటి చర్య దీనిపై ఉంటుందని వెల్లడించారు. పొత్తులలో పట్టువిడుపులు ఉండాలని సూచించారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో పూర్తి అవుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలియజేశారు.
No comments:
Post a Comment