Friday, April 11, 2014
బాలయ్య స్నేహితుడికి టిక్కెట్టు ఖరారైంది
సినీనటుడు నందమూరి బాలకృష్ణకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు ఖరారుకాలేదు కాని ఆయన స్నేహితుడికి మాత్రం టిక్కెట్టు వచ్చింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కదిరి బాబూరావుకు గత ఎన్నికల్లో స్థానికంగా టీడీపీ నుంచి గట్టి నాయకులు ఉన్నా బాలకృష్ణ పట్టుబట్టి మరీ టిక్కెట్టు ఇప్పించాడు. అయితే నామినేషన్ పత్రాలపై సంతకం చేయకపోవడంతో బాబూరావు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన పోటీకి అనర్హులయ్యారు,
అయితే బాలకృష్ణ బాబూరావుకు ఫోన్ చేసి పట్టుబట్టి మరీ టిక్కెట్టు ఇప్పిస్తే ఇంత అజాగ్రత్త ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్న కదిరి బాబూరావుకు మరోసారి బాలయ్యపై నమ్మకంతో చంద్రబాబు తొలి జాబితాలోనే టిక్కెట్టు కేటాయించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment