Friday, April 11, 2014

సా గుతున్న సామాజిక కసరత్తు

గుంటూరు: తెలుగుదేశం పార్టీలో శాసనసభ టిక్కెట్లను ఖరారు చేసేందుకు సామాజిక కసరత్తు కొనసాగుతోంది. అన్నివర్గాల అభ్యర్థుల కు టిక్కెట్లు కేటాయించేందుకు నేత లు సమాలోచనలు జరుపుతున్నా రు. గురువారం కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని నేతలు భావించినప్పటికీ సామాజిక సమతౌల్యం పాటించే క్రమం లో ఎవరి పేర్లను ప్రకటించ లేదు. పార్టీ గుంటూరు ఇన్‌చార్జ్ గరికపాటి మోహన్‌రావుతో నేతలు సమావేశమౌతూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన పార్టీ నాయకుల చర్చల్లో కొన్ని తా జా రాజకీయ పరిణామాలు తెర పైకి వచ్చాయి. మంగళగిరి అసెంబ్లీ టిక్కెట్‌ను స్థానికులకే ఇవ్వాలన్న నాయకుల డిమాండ్‌ను హైకమాండ్ అంగీకరించింది. ఇక్కడ చేనేత సామాజికవర్గం ఓటర్లు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే స్థితిలో ఉండటాన్ని పార్టీ గుర్తించింది. దీంతో ఆ సామాజికవర్గ నేతకే టిక్కెట్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ క్రమంలో మంగళగిరిలో ము రుగుడు హన్మంతరావు వర్గీయులు తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
గుంటూరు తూర్పు నియోజకవర్గం టిక్కెట్‌ను గతంలో ఇచ్చిన హామి మేరకు ఆర్యవైశ్య సామాజికవర్గం అభ్యర్థికే కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకొన్నది. దీంతో ఆ సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎవరి పేరును అధిష్ఠానం ప్రకటిస్తుందోనని ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి దేవరశెట్టి సత్యన్నారాయణ, దేవరశెట్టి సుబ్బారావు, బొలిశెట్టి కామేశ్వరరావు, ఎం గిరిధర్, మిట్టపల్లి ఉమామహేశ్వరరావు, సురేష్ తదితరులు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.
జిల్లాలో ముస్లిం మైనార్టీలకు ఒక టిక్కెట్‌ను కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాన్ని మైనార్టీలకు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. నరసరావుపేట నుంచి మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు బరిలోకి దిగాలని అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీర్మానాలు చేశారు. మరోవైపు సత్తెనపల్లికి కోడెల పేరు బలంగా వినిపిస్తోంది. కోడెల అభ్యర్థిత్వం ఖరారైన తర్వాతే మైనార్టీల సీటు తేలుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దివంగత ఎస్ ఎం లాల్‌జాన్ బాషా కుటుంబానికి ఏమి న్యాయం చేస్తారో ఇప్పుడే ప్రకటించాలని ఆయన అభిమానులు ఒత్తిడి పెంచుతున్నారు.
ఇదిలావుంటే పార్టీలో అసంతృప్తులపర్వం ప్రారంభమైంది. తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వాలని బుధవారం కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీ వివాదానికి దారి తీసింది. కార్యకర్తలు పార్టీ ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంపై హైకమాండ్ తీవ్రంగానే స్పందించింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. టిక్కెట్లు ప్రకటించిన తర్వాత రెండు, మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో గురువారం జరిగిన సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా హెచ్చరికలు పంపాలని పార్టీ యోచిస్తోంది.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020