Monday, April 14, 2014

వారసుడికి ఇక అడ్డు లేదు

మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని, అధికారాన్నయితే సంపాదించుకున్నారు కాని ఆయన వారసులు అంటూ నందమూరి కుటుంబం బెడదను మాత్రం నారా వారు ఇప్పటి వరకు తప్పించుకోలేకపోయారు. ఇక తన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయం దగ్గరపడనున్న నేపథ్యంలో తన వారసునికి నందమూరి కుటుంబం నుంచి బెడద లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు అంటే రాజకీయాల్లో ఆరి తేరినవారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలరు. కాని తన వారసుడు లోకేష్ కు అంత చతురత వుంటుందా? వుండదా అన్నది అనుమానం. అందుకే తను ఉన్నప్పుడే లోకేష్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులు చంద్రబాబు చక్క దిద్దుతున్నారు.

తెలుగుదేశం తన చేతిలోకి వచ్చిందే కాని ఇప్పటి వరకు నందమూరి వారసత్వం నుంచి చిక్కులు తప్పలేదు. ఎన్టీఆర్ పేరును వాడుకోవడం తప్పనిసరి. అది వాడుకోవాలంటే ఆయన వారసులను ఉంచుకోవడం కూడా కంపల్సరీ. దీంతో చంద్రబాబు తొలుత హరికృష్ణను దగ్గర తీసుకున్నారు. హరికృష్ణ రాజకీయ దురంధరుడు కాకపోయినా కూడా తండ్రి పేరు చెప్పుకుని చంద్రబాబును ఎన్ని ఇబ్బందులకు గురిచేసారో అందరికి తెలిసిందే.

చివరకు ఎన్టీఆర్ పోలికలతో కుమారుడు జూనియర్ తయారుకావడంతో హరికృష్ణ చంద్రబాబును ఓ ఆటాడుకోవడం మొదలెట్టారు. ఈ మద్య అటు తండ్రిని, ఇటు కొడుకుని అడ్డంపెట్టుకుని చంద్రబాబును ఏకంగా ఏదో చేయాలనే భావనలోకి హరికృష్ణ వచ్చారు. పదవికి రాజీనామా, ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లేందుకు రథయాత్ర వంటి స్కెచ్ లు వేసుకున్నారు. చంద్రబాబు కాబట్టి ఎలాగోలా నిలువరించారు.
జూనియర్ ను ఓ దశలో జగన్ కు దగ్గరగా చేస్తున్నాన్న రేంజ్ లో హరికృష్ణ చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్స్ కూడా పంపారు. ప్లెక్సీలు, బొమ్మలు బాగోతం అందులో భాగమే.  ఇవన్నీ చంద్రబాబును రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాయో అందరికి తెలిసిందే.

అయితే ఇక చంద్రబాబుకు కాలం కలసి వచ్చిందో, ఆయన తెలివితేటలు సహకరించాయో తెలియదు కాని నందమూరి బెడద ఇక పూర్తిగా తొలగిపోయే క్షణాలు వచ్చేసాయి. హరికృష్ణ టిడిపిలోనే ఉంటూ చికాకు పెడుతుండగా, ఎన్టీఆర్ కూతురు పురంధరీశ్వరి కాంగ్రెస్ లో ఉండి కొరకురాని కొయ్యగా తయారయింది. ఎన్నటికైనా చంద్రబాబుకు పురంధరీశ్వరి నుంచి రాజకీయ ముప్పు ఉందనే భావం ఇప్పటివరకు ఉంది.

ఇక ఆ భాద తొలగినట్టే. విభజన పుణ్యమా అని పురందరీశ్వరికి రాజకీయ జీవితాన్నిస్తున్న కాంగ్రెస్ ఖతం అయింది. దీంతో ఆమె  తన భవిష్యత్తు కోసం బిజేపిలో చేరారు. ఇది చంద్రబాబుకు మరింత ఇబ్బంది పెడుతుందని భావించారు. కారణం బిజేపితో పొత్తు పెట్టుకున్నందున పురంధరీశ్వరిని ఇక ఏమి అనలేక భరించాల్సి వస్తుంది అనుకున్నారు. కాని ఆమె విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన ఆమె గెలిచే అవకాశాలు అంతో ఇంతో ఉన్న విశాఖ లోక్ సభ స్థానం ఆమెకు దక్కకుండా పోయింది. అసెంబ్లీ కి ఆమె పోటీ చేయదు, చేసినా గెలిచే అవకాశాలు తక్కువ అంటున్నారు. అంటే స్ట్రాంగ్ గా ఉన్న నందమూరి వారసత్వం ఒకటి రాజకీయాలకు దూరం అయినట్టే అంటున్నారు.

ఇక మిగిలింది హరికృష్ణ , ఆయనకు చంద్రబాబుకు ఎదురొడ్డి ఏదో చేసే సత్తా లేదు. కొడుకు జూనియర్ ను అడ్డంపెట్టుకునే ఏదైనా చేయాలి. కాని జూనియర్ ను చంద్రబాబు పక్కా పథకం ప్రకారం పక్కను నెట్టారు. ఆయన ఇప్పుడు రాజకీయాల మాటే ఎత్తడం లేదు. ఓ వేళ మాట్లాడిని టిడిపికే నామద్దతు అనడం తప్ప మరో మాట అనకుండా చేసారు. హరికృష్ణ చంద్రబాబును కాదని చేసిన వ్యవహారం అంతా చూసారు కాబట్టి ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వకున్నా చంద్రబాబును తప్పుగా భావించే పరిస్థితి లేదు.

అందుకే ఆయనకు టికెట్టు రాలేదు. చివరిదాకా ఇస్తున్నట్టే భ్రమలో ఉంచి చివరకు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. వియ్యంకుడు నందమూరి వారసుడు బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారుగా. నందమూరి బెడద ఎలా తప్పుతుంది అనుకోవచ్చు. నిజానికి బాలకృష్ణకు రాజకీయ చతురత, ఎదిగే లక్షణాలు లేవు. ఆవేశం అంతంత మాత్రం. పైగా అన్నింటికన్నా ఆయన లోకేష్ కు మామగారు. అందువల్ల బాలకృష్ణలో లోకేష్ కు వచ్చిన ఇబ్బందులు లేవు. బాలకృష్ణ గెలిచారే అనుకుందాం, ఆయనకు పెద్ద పదవి కూడా ఇచ్చారే అనుకుందాం. కాని తన కూతురునే కొడుకుకు ఇచ్చారు. అలాంటప్పుడు అల్లునికి అండగా ఉంటారు తప్ప ఎదురు తిరగే ప్రయత్నం చేయరు గాక చేయరు. మరి ఇక వారసుడికి అడ్డేముంది? - See more at: http://telugu.gulte.com/tnews/4206/Chandrababu-make-free-path-lokesh#sthash.22o7culF.dpuf

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020