.jpg)
రాజకీయ రంగంలో మరో సంచలనం ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టార్లకే స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ మోడీకి మద్దతు పలకనున విషయం తమిళనాడు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. రజనీకాంత్ మోడీకి మద్దతు పలుకుతారన్న విషయాన్ని రజనీకాంత్ సన్నిహితుడు చో రామస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి మోడీ వెళ్ళి రజనీని కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.ఈ అంశంపై చెన్నైలో ముందుగానే పోస్టర్లు వెలిశాయి.
No comments:
Post a Comment