సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా సందిగ్ధం తొలగలేదు. సంవత్సర కాలం నుంచి బాలయ్య తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేసి తీరుతానని స్పష్టం చేస్తూ వస్తున్నాడు. ఎన్నికల కోలామాలం ప్రారంబమైనా బాలయ్య పోటీ చేస్తాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అంతేకాక పోటీ చేస్తే ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న విషయంపై క్లారిటీ లేనప్పటకీ బాలయ్య మనస్సు మాత్రం అనంతపురం జిల్లాలోని హిందూపురం పైనే ఉంది.
అయితే ఇటీవల బాలయ్య అన్న హరికృష్ణ కూడా చంద్రబాబుని కలిసి తనకు హిందూపురం లోక్‌సభ స్థానం కేటాయించాలని కోరాడు. దీంతో వీరిలో ఎవరికి సీట్లు కేటాయించాలి? ఎక్కడ కేటాయించాలనే విషయంపై చంద్రబాబు కూడా సందిగ్ధంలో పడ్డారు. అన్నదమ్ములిద్దరకి సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత ఉంటుందా లేదా ఒకే జిల్లాలో ఒకే స్థానం నుంచి ఇద్దరికి ఎలా సీట్లు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనలో పడ్డట్టు సమాచారం.
చివరగా వీరిలో ఒకరికి మాత్రమే టిక్కెట్టు కేటాయిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే చంద్రబాబు వీరిలో సొంత వియ్యంకుడు బాలయ్యకు టిక్కెట్టు ఇస్తాడా లేదా హరికృష్ణకు కేటాయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే మరి.
No comments:
Post a Comment